Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిధునని బైక్ మీద ఎక్కించుకొని పుట్టింటిలో వదిలేయడానికి వెళ్తాడు. మధ్యలో స్పీడ్ బ్రేకర్‌కి మిధున దేవా మీద పడటంతో దేవా బైక్ ఆపి ఏంటి ఎక్కువ చేస్తున్నావ్.. భుజం మీద చేయి వేస్తున్నావ్.. ఏదో నన్ను మిస్ అయినట్లు ఓవర్ చేస్తున్నావ్.. రొమాన్స్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. దానికి మిధున బండి మీద నుంచి దిగి.. నువ్వో పెద్ద రొమాంటిక్ కింగ్‌వి నీతో రొమాన్స్ చేయడానికి నేను వాచిపోయి ఉన్నానని బండరాయి ముఖానికి ఒక పలకరింపు కూడా రాదని ఇద్దరూ గొడవ పడతారు. బైక్‌ని నువ్వే గుంటల్లో పోనిస్తున్నావ్.. నేను నీ మీద పడాలి అనే కదా అంటే ఛీ ఛీ నాకు అలాంటి ఉద్దేశం లేదని దేవా అంటాడు. ఇక మిధున దేవాతో వెనక కూర్చొంది అమ్మాయి.. బస్తా కాదు చూసుకొని పోనివ్వు అంటుంది. నవ్వు మాములు కంచువి కాదే ఎవడు తీసుకున్నాడో అయిపోతాడు అని దేవా అంటే ఆల్రెడీ నువ్వు చేసుకున్నావ్ కదా ఇక మూసుకొని పద అంటుంది.

దేవా గురించి ఆలోచిస్తూ భాను దిగులుగా ఉంటే సూర్యకాంతం వచ్చి రౌడీ బేబీ అని గిరిగిరా తిప్పి కింద పడేస్తుంది. ఏంటి అక్క నడుం విరగొట్టేశావ్ అంటే వెదవ నడుం ఉంటే ఏంటి పోతే ఏంటి కానీ నీకో శుభవార్త అని అంటుంది. ఏంటని భాను అంటే నీ సవతి ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్తుంది. భాను నిజంగా గుడ్ న్యూస్ చెప్పావని గెంతులేస్తూ కాంతాన్ని ముద్దులతో ముంచేసి గిరగిరా తిప్పి కింద పడేస్తుంది.  మరోవైపు త్రిపుర అత్తని బామ్మని, అలంకృతని పిలిచి మిధున మన ఇంటికి వస్తుందని చెప్తుంది. మిధున ఇంట్లో గొడవ జరిగి వచ్చేస్తుందని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుందని చెప్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. మిధునని దేవా తీసుకొచ్చి ఇదే మీ సామ్రాజ్యం వెళ్లిపో అని అంటాడు. మిధున కుటంబం హారతి పట్టుకొని రెడీగా ఉంటారు.

దేవా మిధునతో మన జీవితంలో మనం కన్న ప్రతీ కల నిజం అవ్వాలి అని లేదు ఒక కల కాకపోతే మరో కల నిజం చేసుకుంటాం. నీ మెడలో నేను కోపంతో కట్టిన తాడుని తాళి అనుకొని జీవితం నాశనం చేసుకోవడం మూర్ఖత్వం అంటాడు. ఆదిత్య నువ్వు లేకపోతే బతకలేనని దేవదాసులా తిరుగుతున్నాడని అతన్ని పెళ్లి చేసుకో అని అంటాడు. దేవా మిధున తల్లి, వదినలతో నాకు తెలిసిన రేంజ్‌లో మంచి మాటలు చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చా ఇక తనని మీరే చూసుకోండి.. ఎందుకైనా మంచిది తనని బయటకు పంపొద్దని అంటాడు. ఇక వెళ్తూ వెళ్తూ దేవుడా నా జీవితానికి బెయిల్ ఇచ్చి కేసు కొట్టేసి హ్యాపీగా చేశావు థ్యాంక్యూ అని చెప్పి వెళ్లిపోతాడు. మిధున తల్లి మిధునతో చాలా సంతోషంగా ఉందమ్మా తిరిగి మన ఇంటికి వచ్చేశావ్ అని మిధునకు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు. అలంకృత మిధునతో ఈ రోజు నాన్న పుట్టిన రోజు కదా గ్రాండ్‌గా చేసుకుందామని అంటుంది. మిధున చెల్లితో నాన్న ఎక్కడ అని అడిగితే నీ గురించే ఆలోచించి బాధ పడుతూ గది నుంచి బయటకు రాలేదని చెప్తుంది. 

మరోవైపు శారద ఇద్దరి కోడల్ని తీసుకొని గుడి వస్తుంది. మిధున వెళ్లిపోగానే సొంత మనిషి వెళ్లిపోయినట్లుందని తిండి పెట్టుకుండా ఇబ్బంది పెట్టానని మిధున సంస్కారం చూసి ఎవరైనా అలాంటి అమ్మాయినే కోడలిగా కోరుకుంటుంది కానీ తన స్థాయికి మేం సరిపోం అని పంపేశానని అనుకుంటుంది. ఇక కాంతం ప్రసాదంగా ఇచ్చిన అరటి పండు తినేసి తిక్క అక్కడే పడేస్తుంది. తర్వాత తానే ఆ తొక్క మీద కాలు వేసి పడిపోతుంది. ఇక హరివర్దన్ మిధున చిన్న నాటి ఫొటోలు పెద్ద స్క్రీన్ మీద వేసుకొని ఏడుస్తాడు. మిధున వెనక నుంచి చూస్తుంది. ప్రతీ పుట్టిన రోజుకి నాన్నకి 12 గంటలకు విష్ చేసేదానివి ఇప్పుడు ఈ నాన్న నీకు గుర్తు రాలేదా అమ్మ అని ఏడుస్తాడు. మిధున కూడా ఏడుస్తుంది.

ఓ లాయర్‌లా ఉన్న నేను నువ్వు  పుట్టగానే జడ్జి అయ్యాను నా అదృష్టం నువ్వు నా లక్కీ ఛామ్ కాలు కింద పెట్టకుండా పెంచుకున్నా.. నువ్వు మాత్రం నన్ను వదిలేసి ఆ రౌడీ కోసం వెళ్లిపోయావ్.. నువ్వు లేకపోతే బతకలేనని తెలిసి కూడా ఎలా వెళ్లిపోయావమ్మా.. నాన్న గుర్తు రావడం లేదా అని ఏడుస్తాడు. మిధున చాలా ఏడుస్తుంది. మిధున ఎదురుగా వచ్చి నిల్చొగానే హరి ఎమోషనల్ అయి నిజంగా వచ్చావా తల్లి అంటే మిధున తండ్రితో వచ్చేశా నాన్న నీ కోసం వచ్చేశా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్  పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!