Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా పోస్టర్లు కావాలనే వేశాడని మిధునను ఏమైనా చేస్తాడేమో అని త్రిపుర చెప్తుంది. ఇక మిధున చెల్లి తండ్రితో నాన్న అక్క పరువు ఇప్పటికే పోయింది ఎలా అయినా అక్కని ఇంటికి తీసుకొచ్చేయ్ నాన్న అని అంటుంది. దానికి హరివర్దన్ మిధున అంటే తనకు ప్రాణం అని తనని ఎలా ఇంటికి తెచ్చుకోవడానికి ఏం చేయాలో ఎలా మిధనని ఇంటికి రప్పించాలో ఓ క్లారిటీ వచ్చేసిందని అంటాడు.
మరోవైపు దేవా ఇంటికి వచ్చి ఇద్దరు అన్నల్ని ఓరేయ్ శ్రీరంగం, ఓరేయ్ అనంద్ అని కోపంగా పిలుస్తాడు. ఇద్దరూ భార్యలతో కలిసి బయటకు వస్తారు. దేవా వాళ్లకి ఫోటో చూపించి ఏంట్రా ఇది అని అడుగుతాడు. దాంతో శ్రీరంగం ఫొటో చాలా బాగుందని అంటాడు. మిధున కూడా అక్కడే ఉంటుంది. భార్యతో ఫొటో పిచ్చెక్కిపోయింది కదా జంట అదుర్స్ అంటాడు. దానికి సూర్యకాంతం మన జంటలా ఇంకెవరు ఉంటారు ఏం బాలేదు అంటుంది. ఇక దేవా శ్రీరంగం కాలర్ పట్టుకొని నువ్వే చేశావా ఈ పని అని అడుగుతాడు. తన ఫోన్ నుంచి ఎవరో ఈ ఫొటో పంపేశారని అందరి ముందు తలదించుకున్నాని అంటాడు. మిధున ఆపడానికి ప్రయత్నిస్తుంది. నాకేం తెలీదు అని శ్రీరంగం జట్టు పీక్కుంటాడు.
మిధున: ఏవండీ ఒక్కసారి నేను చెప్పేది వినండి.దేవా: నీకు సంబంధం లేదు పక్కకెళ్లు.శ్రీరంగం: ఇందాక నుంచి ఫొటో షాపు ఫొటో షాపు అంటున్నావ్ నేను అసలు ఎప్పుడూ ఆ ఫొటో షాపుకే వెళ్లలేదు. మిధున: మనసులో అయ్యో ఏం బ్యాచ్ ఇది ఫొటో స్టూడియోకి ఫొటో షాప్‌కి తేడా తెలీదు.దేవా: ఖర్మరా బాబురా.ఆనంద్: నాకు ఫొటో షాపు తెలుసు ఫొటో స్టూడియో తెలుసు కానీ నాకు ఉన్న బద్ధకానికి నా ఫోనే చూడను ఇంక నీ ఫోన్ ఎందుకు.దేవా: నువ్వు పంపించలేదు వీడు పంపలేదు మరి నా ఫోన్ నుంచి ఫొటో ఎవరు పంపారురా. మిధున: అసలు అది ఆ ఫొటో.దేవా: హే ఆపు నువ్వు అసలే ఫొటో ఎవరు పంపారో తెలీక నేను తలపట్టుకుంటే. అదేదో నువ్వే ఈ ఫొటో పంపినట్లు. అయినా నీకు అంత సీన్ లేదులే. నన్ను టార్చర్ చేయడం తప్ప ఫొటో షాప్ చేసినంత సీన్ లేదులే. అందులోనూ నా ఫోన్ పట్టే ధైర్యం నీకు లేదులే.మిధున: నేను చెప్పేది ఒక్కసారి.దేవా: ఎల్లేహే నాకు తెలీకుండా ఇంట్లో చాలా మంది శత్రువులు తయారయ్యారు. ఈ విషయాన్ని అంత సులభంగా వదలను. అప్పుడు వాళ్లకి నా చేతిలో మామూలుగా ఉండదు.మిధున: అయ్యో పాపం కోపంతో ఊగిపోతున్నాడు.
మరోవైపు భాను మేడ మీదకు వెళ్లి దేవా నీ మీదే ఆశలు పెట్టుకున్నానురా నువ్వు ఆ మిధునని భార్యగా అంగీకరిస్తే నేను తట్టుకోలేను అని ఏడుస్తుంది. అది చూసిన సూర్యకాంతం భానుని ఓదార్చి మిధున మీద తగిలిస్తుంది. దాంతో కోపంగా భాను దాని ప్రాణాలు తీస్తా అని అరుస్తుంది. సూర్యకాంతం భానుతో దేవాకి మందు పెట్టి వెంట తిప్పుకోమని సలహా ఇస్తుంది. దేవా ఎవరు ఫోటో పంపారని టెన్షన్ పడుతుంటే మిధున దేవా దగ్గరకు వెళ్తుంది. అందరినీ అడిగిన నువ్వు నన్ను ఎందుకు అడగటం లేదు అంటే నీకు అంత సీన్ లేదని దేవా అంటాడు.
మిధున: ఆ ఫొటో నేనే పంపాను. నా ఫొటో నా దగ్గరే ఉంటుంది కదా. మీ ఇంటి వాళ్ల దగ్గర ఎలా ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్. పెద్ద రౌడీ అంటావ్ కానీ ఒట్టి ఉప్మా నువ్వు. దేవా: అమ్మో అమ్మో నా రాజ్యంలో ఇంత కుట్రా. నీకు అంత సీన్ లేదు అని అనుకున్నా కదే. ఒట్టి అమాయకురాలివి అనుకుంటే ఇంత కుట్ర చేస్తావా. నీ మీద నాకు వన్ పర్సంట్ కూడా డౌట్ రాలేదు కదే. మిధున: నేను ఇలా చేయడానికి కారణం నువ్వే. ఉదయం బాత్ రూం దగ్గర నన్ను ఏం అన్నావ్. ఈ ఊరిలో ఒక్కరైనా నన్ను దేవా భార్య అని అనుకోవడం లేదని అన్నావ్ కదా. అందుకే ఇలా చేశా. ఇక నుంచి దేవా భార్య మిధున అని అందరూ అనుకుంటారు. మనం భార్య భర్తలం అని ఎవరీకీ తెలీదని ఫీలయ్యావ్ కదా ఇక ఫీల్ అవ్వకులే. ఇది జస్ట్ సాంపిల్ మాత్రమే.దేవా: ఏంటి ఇది సాంపిల్‌లా ఇక ఎన్ని కుట్రలు చేస్తావేంటే. నేను జీవతంలో చేసిన పెద్ద తప్పు నీ మెడలో తాళి కట్టడమే ఇలా ఇరుక్కుపోయానేంట్రా.
ఇళ్లు దక్కుతుందో లేదో అని సత్యమూర్తి భార్యకు చెప్పుకొని బాధ పడతాడు. ముగ్గురు కొడుకుల్లో ఏ ఒక్క కొడుకు తండ్రికి అండగా లేరని అంటాడు. ఇంతలో ఒకాయన వచ్చి దేవా, మిధున ఫొటోలు చూపించి దేవా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.. లేపుకెళ్లి చేసుకున్నాడు ఓ ఆడపిల్ల జీవితంతో మీ కొడుకు ఆడుకున్నాడంటే బాధగా ఉందని అంటాడు. దాంతో సత్యమూర్తి వీడు నాకు చెడపుట్టాడని నన్ను చంపేయడానికి పుట్టాడని బాధ పడతాడు. ఈ పోస్టర్లు దేవా వేయించలేదంట అని చెప్తుంది శారద. రౌడీ చేతిలో బంగారం లాంటి అమ్మాయి జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోనని అనుకుంటాడు. మరోవైపు ఉదయం దేవాని నిద్ర లేపడానికి మిధున కింద నుంచి మీదకు నీరు విసిరేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!