Nuvvunte Naa Jathaga Serial Today Episode తన మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోమని రిషి దేవాకి చెప్పాడని మిథున ఇంట్లో అందరికీ చెప్తుంది. హరివర్థన్‌ వాళ్లు షాక్ అయిపోతారు. రిషి బావ దేవా క్లోజ్‌ కదా ఇప్పుడు రిషి బావకి దేవానే అక్క మెడలో తాళి కట్టాడని తెలిస్తే ఊరుకుంటాడా అని అలంకృత అంటుంది. దానికి త్రిపుర ఎందుకు ఊరుకుంటాడు.. ఇప్పటి వరకు మోసం చేసింది చాలు ఈ పెళ్లి వద్దు అని వెంటనే యూఎస్‌కి వెళ్లిపోతాడు అని అంటుంది. 

Continues below advertisement

హరివర్ధన్‌ వాళ్లు చాలా టెన్షన్ పడతారు. మిథున మెడలో దేవా తాళి కట్టాడు అనే విషయం దాచేసి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కానీ దాని వల్ల మిథునకు కుమిలి కుమిలి ఏడ్చే పరిస్థితి వస్తుంది. రిషికి దేవా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని రిషి అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడుగుతుంది. ఆదిత్యకు మిథునను ఇచ్చి పెళ్లి చేస్తే వాడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మిథున అంటే ప్రాణం కాబట్టి మిథునని హ్యాపీగా చూసుకుంటాడు. అది వదిలేసి రిషితో ఎందుకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారో అర్థం కావడం లేదు అని అంటుంది.

మిథున పాత జ్ఞాపకాలకు దూరంగా ఉంచాలి అని నాన్న రిషితో పెళ్లి చేయాలి అనుకుంటున్నారు.. ఇంకోసారి మీ తమ్ముడి ప్రస్తావన తీసుకురావొద్దని రాహుల్ అంటాడు. ఇంతలో మిథున తానే రిషికి విషయం చెప్తా అని అంటుంది. అప్పుడే రిషి అక్కడికి రావడంతో అందరూ టెన్షన్ పడతారు. రిషి వచ్చి ఏం మాట్లాడుతున్నారో మాట్లాడండి మీరు మాట్లాడుకునే విషయం నాకు తెలుసు అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఈ విషయం నా దగ్గర దాయడం నాకు బాధగా ఉంది.. ఎందుకు నా దగ్గర దాస్తున్నారు అని రిషి అంటాడు. ఎందుకు మీరు మిథున మెడలో తాళి ఎవరు కట్టారో ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతాడు.  

Continues below advertisement

మిథున చెప్పబోతే హరివర్థన్ ఆపేస్తాడు. కొన్ని మాట్లాడుకోకపోవడమే మంచిది అని అంటాడు. మిథున మెడలో తాళి కట్టిన వాడి గురించి మీరు తీసుకున్నంత లైట్‌గా నేను తీసుకోను.. మిథున నాకు కాబోయే భార్య. మీ కూతురిని బాధ పెట్టిన వాడిని మీరు వదిలేస్తారేమో కానీ నాకు కాబోయే భార్యని బాధ పెట్టిన వాడిని నేను వదలను అని అంటాడు. మిథున మెడలో తాళి కట్టిన వాడు ఎవడో తెలిస్తే అప్పుడు వాడి పని ఉంటుందని రిషి అంటాడు. రిషికి ఎవరూ ఆ రౌడీ గాడి గురించి చెప్పొద్దు అని హరివర్థన్ అంటాడు. మిథున బాధ పడుతూ పరమేశ్వరా నా జీవితాన్ని ఏం చేయనున్నావయ్యా.. ఎలాంటి గొడవలతో ముడి పెట్టబోతున్నావయ్యా అని అనుకుంటుంది. 

దేవా వాళ్ల ఇంట్లో అందరూ భోజనాలకు కూర్చొంటారు. కాంతం వంట చేశానని అన్నీ తీసుకొస్తుంది. రంగం భయపడతాడు. కాంతం భర్తకి ముందు వడ్డిస్తా అని అన్నీ ఒకే గిన్నెలో తీసుకొచ్చి కూర అనగానే ముక్కులు వేసి.. చారు అడగగానే నీరు వేస్తుంది. రీల్స్ పిచ్చి తగలెయ్యా రీల్స్ చూసి ఆ ప్రయోగాలు నా మీద చేస్తావేంటే అని రంగం తల పట్టుకుంటాడు. కాంతం ఆనంద్‌తో బావగారు మీకు వడ్డిస్తా అంటే వద్దమ్మా నాకు ఇంకా శాలరీ రాలేదు.. ఏమైనా అయితే మందులు కూడా కొనుక్కోలేను అని అంటాడు. 

దేవా ఇంటికి వస్తాడు. తినడానికి రమ్మని ప్రమోదిని పిలిస్తే ఆకలి లేదు వద్దు అనేస్తాడు. దేవాకి ఏమైందని అందరూ అనుకుంటారు. మిథునని తలచుకొని దేవా బాధ పడుతుంటే సత్యమూర్తి దేవా దగ్గరకు వెళ్లి కూర్చొంటాడు. నా ముగ్గురు కొడుకుల్లో నాకు ఇష్టమైన వాడివి నువ్వే నేను ద్వేషించిన వాడివి నువ్వే.. కానీ కొడుకుని ఎంత ద్వేషించినా సరే ఆ కడుకు బాధపడుతుంటే ఏ తండ్రి తట్టుకోలేడు అని అంటాడు. చెప్పరా తిండి తిప్పలు మానేసి బాధ పడే అంత కష్టం నీ మనసులో ఏం ఉందిరా అని అడుగుతాడు. ఏం లేదని దేవా అంటే మిథునని మర్చిపోలేకపోతున్నావా నువ్వు అని  సత్యమూర్తి అడుగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.