Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, అలంకృత బ్యూటీ పార్లర్‌కి వెళ్లాలని అనుకుంటారు. మిథున గదిలో డ్రస్ ఉందని వేసుకుంటానని అలంకృత వెళ్తుంది. ఇంతలో మిథున గదిలో దేవా ఉన్నాడు కదా అలంకృత వెళ్తుందని టెన్షన్ పడుతుంది. మిథున టెన్షన్‌ పడటం త్రిపుర గమనిస్తూ ఉంటుంది. 

Continues below advertisement

అలంకృత గదిలోకి వెళ్లి పెద్దగా అరుస్తుంది. అందరూ కంగారు పడుతుంది. మిథున అలంకృతకు తెలిసిపోయిందని టెన్షన్ అవుతుంది. అందరూ మిథున గదికి వెళ్తారు. తీరా చూస్తే అలంకృత బల్లిని చూసి అరుస్తుంది. రిషి అలంకృతతో నువ్వు చాలా డేరింగ్ అన్నావ్ కదా బల్లికే భయపడతావా అని అడుగుతాడు. మిథున డ్రస్ తీసి ఇస్తుంది. అందరూ  వెళ్లిపోతారు. దేవా ఓ చోట దాక్కుంటాడు. త్రిపుర మిథునని చూసి ఈ కంగారు చూస్తే నా అనుమానమే నిజం అనిపిస్తుందని అనుకుంటుంది.  

శ్రీరంగం, సూర్యకాంతం పల్లీలు తినుకుంటూ ఇప్పటికైనా దేవా వస్తాడా రాడా అని అనుకుంటారు. దేవా పెళ్లి ఇష్టం లేకుండా పారిపోయాడు ఇంకెందుకు వస్తాడు అని శ్రీరంగం అంటాడు. ఇంతలో రిషి దేవా వాళ్ల ఇంటికి వస్తాడు. దేవా ఇంట్లో లేడా అని రిషి అడిగితే లేడా అని అడుగుతాడు. రిషి ఇంట్లో లేడని చెప్పిన కాంతం విషయం చెప్పబోతే సత్యమూర్తి ఆపుతాడు. దేవా ఎక్కడికి వెళ్లాడో తెలీదు.. ఎప్పుడు వస్తామో చెప్పలేమని రంగం అంటాడు. రంగం, కాంతం తగిలించాలని చూడటంతో శారద ఆపుతుంది. దేవా ఫోన్ చేస్తున్నా కలవడం లేదని చెప్తారు. దేవా త్వరగా వచ్చేస్తాడని అంటుంది. దేవా పెళ్లి ఇష్టం లేదని వెళ్లిపోయాడని కాంతం చెప్తేస్తుంది. 

Continues below advertisement

దేవాకి పెళ్లి ఇష్టమే ఆ టైంకి వస్తాడు అని శారద, సత్యమూర్తి చెప్తారు. దేవా పెళ్లి టైంకి రాలేదు అంటే ఏదో జరిగింది అని అర్థమవుతుంది..అదేంటో నేను తెలుసుకుంటా దేవా ఎక్కడున్నా తీసుకొస్తా అని అంటాడు. రిషి దగ్గర నిజం చెప్పాలనుకుంటున్నావ్ అని శారద కాంతాన్ని తిడుతుంది. మరోవైపు మిథున హల్దీ వేడుక మొదలవుతుంది. 

మిథునని తీసుకొని వచ్చి హల్దీ వేడుక జరుగుతుంది. దేవా దూరం నుంచి హల్దీ వేడుక చూసి చాలా బాధ పడతాడు. రిషి బావ చాలా అదృష్టవంతుడు నువ్వు భార్యగా అవుతున్నావ్ అక్కా అని అంటుంది. అందరూ మిథునకు పసుపు గంధం రాసి ఆశీర్వదిస్తారు. దూరం నుంచి దేవా చూస్తునే ఉంటాడు. హరివర్థన్ వాళ్లు చాలా సంతోషడతారు. కన్నకూతుర్ని పెళ్లికూతురిలా చూసుకోవాలి అనుకున్నది ప్రతీ తండ్రీ కల ఆ రోజు నా కల కలగా మిగిలిపోయింది.

మళ్లీ ఇన్ని రోజులకు నా కూతురిని ఇలా పెళ్లి కూతురి ముస్తాబులో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని హరివర్థన్ కన్నీరు పెట్టుకుంటారు. మళ్లీ నీ జీవితంలో వచ్చే ఈ వెలుగులు చూడటానికే దేవుడు నా ప్రాణం ఉంచాడు. మన ఇంటికి పట్టిన గ్రహణం పోయింది. ఇక మన ఇంటికి సంతోషాలకు కొదవే ఉండదు.. ఇక హాయిగా బతికేస్తానమ్మా.. నీ జీవితం కోసం ఏ బెంగ లేదు అని అంటారు. హల్దీ వేడుక తర్వాత మిథునని పెళ్లి కూతురిలా రెడీ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.