Nindu Noorella Savasam Serial Today Episode నేను ఎమ్మెల్యే కొడుకుని నాతో జాగ్రత్తగా ఉండు అని బంటి రాంమూర్తికి వార్నింగ్ ఇస్తాడు. అంజలితో పాటు మిగతా పిల్లలు అక్కడికి వచ్చి బంటిని అంజలి తిడుతుంది. ఇంతలో ప్రిన్సిపల్ వచ్చి ఇంకోసారి పిల్లలతో కలిసి తింటే నీ జాబ్ తీసేస్తా అని బెదిరిస్తుంది. రాంమూర్తిని చూసి పిల్లలు ఫీలవుతారు. 


రాంమూర్తి: భాగీకి కాల్ చేసి.. అమ్మా భాగీ ఇంట్లో ఏమైనా గొడవ అయిందా.
భాగీ: అలాంటిదేం లేదు నాన్న.
రాంమూర్తి: నీ మాట వింటుంటే అనుమానంగా ఉందమ్మా నిజం చెప్పు. అమ్మా ఎందుకు గొడవ జరిగింది. పిల్లలకు నీకు గొడవ ఎందుకైంది అమ్మ.
భాగీ: నాన్న మీరు మాట్లాడుతుంది పిల్లల గురించా.
రాంమూర్తి: అవునమ్మా పిల్లలు నాతో సరిగా మాట్లాడటం లేదు.
భాగీ: అది మనోహరి పని నాన్న నేను పిల్లలతో మాట్లాడుతా. అసలు మీరు స్కూల్ దగ్గర ఏం చేస్తున్నారు నాన్న స్కూల్‌లో పని మానేశా అన్నారు కదా.


అమర్ తల్లిదండ్రులు భాగీకి ధైర్యం చెప్తారు. ఇక అమర్ గదిలో మిస్సమ్మ ఆరు చీర కర్టెన్‌గా వేయడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భాగీ అమర్ దగ్గరకు వెళ్లి పిలిస్తే అమర్ మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. ఏం చెప్తావ్ చెప్పు అని అరుస్తాడు. నా జ్ఞాపకం నాశనం చేశావు మనశ్శాంతి కూడా దూరం చేస్తావా అని అరుస్తాడు. రెండు చేతులు జోడించి దయ చేసి నాకు కనిపించొద్దు అని అరుస్తాడు. శివరాం అమర్‌ని ఆపుతాడు. మిస్సమ్మ ఇంట్లో వాళ్లని ప్రేమగా చూసుకుంటున్నందుకు నీకు కోసం వస్తుందా. నీ పిల్లలకు తల్లి లేని లోటు తీర్చుతున్నందుకు కోపం వస్తుందా ఎందుకు కోపం అని కొడుకుని అడుగుతాడు. మిస్సమ్మని బట్టలు సర్దుకోమని భాగీని పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చేయ్ అని శివరాం రాథోడ్‌తో చెప్తాడు. ఆరు షాక్ అయిపోతుంది. మనోహరి మాత్రం ఎగిరి గంటేస్తుంది. నీ భర్త నీ ముఖం చూస్తే కోపం వస్తుంది అన్నాడు కదా ఇక ఎందుకు వెళ్లిపో అని అంటాడు.


మేం గతంలో ఉన్నాం మాకు భవిష్యత్ అవసరం లేదు అందుకే నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని దెప్పిపొడుస్తాడు. ఇక తన భార్య నిర్మలను పంపించి భాగీ బ్యాగ్ తీసుకురమ్మని చెప్తాడు. నిర్మల బ్యాగ్ తెస్తుంది. శివరాం మిస్సమ్మకి క్షమాపణ అడిగి వెళ్లిపోమని చెప్తాడు. అమర్ చూస్తుండగానే మిస్సమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఇక మరోవైపు ఆరు ఏదో ఒకటి చేయండని గుప్తా గారికి చెప్తుంది. రాథోడ్ మిస్సమ్మని కారులో తీసుకెళ్తాడు. ఆరు ఏడుస్తుంది. మిస్సమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ గదిలోకి వెళ్లి ఆలోచనలో పడతాడు. ఇక పిల్లలు ప్రిన్సిపల్ మేడంకి ఓ జలక్ ఇవ్వాలని తన గదికి వెళ్లి పొగడ్తలతో ముంచి సెల్ఫీ అడుగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని తిట్టిన అమర్‌ - భాగీని తట్టా బుట్టా సర్దుకోమ్మన్న మనోహరి