Nindu noorella savaasam Serial weekly Episode: ఆరు ఆత్మను ఎలాగైనా టార్చర్ చేయాలని మనోహరి డిసైడ్ అవుతుంది. అందుకోసం పిల్లలతో కలిసి గార్డెన్‌లో పుట్‌బాల్ ఆడాలనుకుంటుంది. పిల్లలను పిలిచి బయట బాల్ ఆట ఆడుదామటుంది. పిల్లలు కూడా హ్యాపీగా సరే అంటూ మనోహరి వెంట వెళ్తారు. అందరూ కలిసి ఆడుతుంటే మనోహరి కావాలనే పదే పదే బాల్‌ను ఆరు ఉన్న వైపు వేస్తుంది. కానీ ప్రతిసారి పిల్లలు ఎవరో ఒకరు ఆరు వైపు బాల్ వెళ్లకుండా అడ్డుపడుతుంటారు. ఇంతలో రాథోడ్ పంతులుగారిని తీసుకుని వస్తాడు. మనోహరి వెంటనే కారు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి ఎవరు రాథోడ్ ఇతను అని అడుగుతుంది.
దీంతో పంతులు గారు మేడం అమర్ సార్ తీసుకురమ్మన్నారు అని చెప్తాడు. ఎందుకు అని మనోహరి అడిగితే తనకు తెలియదని పంతులును తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు రాథోడ్. మనోహరి కూడా పిల్లలను ఆడుకోమ్మని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. పై నుంచి అంతా చూస్తున్న గుప్త తూనీగ రూపంలో వచ్చి ఆరు బంధనాన్ని తెంపేసి ఆరుకు విముక్తి కల్పిస్తాడు. తన మీద కూర్చోబెట్టుకుని మొత్తం తిప్పేస్తుంటాడు. ఇంతలో ఆరు బంధ విముక్తి అయిన విషయం చంభాకు తెలుస్తుంది. వెంటనే చంభా గట్టిగా అరుస్తూ ఆ ఆత్మ తప్పించుకుంది రణవీర్ అని చెప్తుంది. వెంటనే రణవీర్ మనోహరి కి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఏం లేదు ఒక పంతులును అమర్ ఇంటికి పిలిపించారు అని చెప్తుంది. అయితే ఆత్మ తప్పించుకుందని చంభా చెప్తుంది అనగానే మనోహరి షాక్ అవుతుంది. తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేస్తుంది.
అమర్ ఇంటికి వచ్చి పంతులు ఆరు ఆత్మ కోసం ఇంట్లో హోమం చేయమని చెప్తాడు. సరేనని ఏర్పాట్లు చేస్తుంటారు. విషయం తెలిసిన చంభా హోమం జరగకుండా ఆపాలని మనోహరికి చెప్తుంది. మనోహరి చిత్ర ఇద్దరూ కలిసి ఎంత ప్రయత్నించినా అమర్ హోమం అపడు. హోమం విజయవంతంగా పూర్తి చేస్తారు. హోమం పూర్తి చేశాక పిల్లలందరినీ తీసుకుని వినాయక చవితి షాపింగ్‌కు వెళ్లాలని అనుకుంటారు. అమర్ వచ్చి కారు దగ్గర నిల్చుని ఉంటాడు. పిల్లల కోసం వెయిట్ చేస్తుంటాడు. గార్డెన్‌లో కూర్చున్న ఆరు అమర్‌ను చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లోంచి పిల్లలు రాగానే అమర్ కారు స్టార్ట్ చేసి వెళ్లబోతుంటే.. అప్పుడే ఆరును గుప్త కారు దగ్గరకు తీసుకొస్తాడు. దగ్గరకు వచ్చిన ఆరు ఏవండి ఆగండి నేను వస్తున్నాను షాపింగ్‌కు అంటుంది. దీంతో అమర్ ఎమోషనల్ గా గార్డెణ్ వైపు చూస్తూ ఉంటాడు.
ఇంతలో చిత్రగుప్తుడు ఆరు దగ్గరకు వచ్చి నీకు ఇంకా గండం పూర్తిగా పోలేదని.. రేపు మీ ఇంట్లో గణపతి పూజ అయ్యాకే పూర్తిగా పోతుందని చెప్తాడు. అయితే మా వాళ్లు కచ్చితంగా గణపతి పూజ పూర్తి చేస్తారని ఆరు అంటుంది. ఇక అమర వాళ్లు షాపింగ్‌కు వస్తున్నారని తెలుసుకున్న చిత్ర.. మేనేజర్‌కు బిల్లు వేయమని చెప్తుంది. వినోద్ వద్దని చెప్పగానే.. వినోద్‌తో గొడవ పడుతుంది. వాళ్లు అశ్రమం పిల్లలకు కూడా కొంటున్నారు అందుకే బిల్లు వేయమని చెప్పాను అంటూ చిత్ర వెళ్లిపోతుంది. ఆశ్రమం పిల్లల బట్టల కోసం షాపింగ్ మాల్‌కు వస్తుంది వార్డెన్ సరస్వతి. అక్కడ మనోహరి, చిత్రను చూసి భయంతో పక్కకు వెళ్లి దాక్కుంటుంది. అయితే అమర్‌ను కలవమని ఒక పేపర్ మీద రాసి అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ కు ఇస్తుంది. ఆ పేపర్ మనోహరి చూస్తుంది. కిందకు వెళ్లి వార్డెన్‌ను చంపాలనుకుని గొంతు నులుముతుంది. ఇంతలో మనోహరి నుంచి తప్పించుకుని పారిపోతుంది. దీంతో ఈ వారం నిండు నూరేళ్ల సావాసం అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!