Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఫ్లైట్ టికెట్ కనిపించకపోవడంతో సహస్ర విహారి వెనక్కి వచ్చేస్తారు. అంబిక సహస్ర వాళ్లని చూసి ఏమైంది వీళ్లేంటి వెనక్కి వచ్చేశారు నా చేతికి పవర్ వచ్చేసింది అనుకునేలోపు ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటుంది. 

అంబిక కిందకి వస్తూ మొక్కల్లో విహారి వీసా చింపేసి పడేసుండటం అంబిక చూసి ఎవరో వీసా చింపేశారు ఎవరు అయితే ఏంటి ఈ నింద లక్ష్మీ మీద వేసేద్దాం అని ఆ పేపర్లు తీసుకొని లక్ష్మీ గదిలో తలగడ కింద పడేస్తుంది. సహస్ర ఇంటి లోపలికి వచ్చి ఏడుస్తూ అన్నీ కింద పడేస్తుంది. మొక్కలు అన్నీ విసిరికొడుతుంది. పద్మాక్షి ఏమైంది అని అడిగితే దానికి సహస్ర ఏడుస్తూ మేం అమెరికా వెళ్లడం ఇక్కడ ఎవరికో ఇష్టం లేదు అని చెప్తుంది. ఏం జరిగింది సహస్ర అని యమున అడుగుతుంది. సహస్ర కోపంగా అత్తయ్య ఎవరో మమల్ని ఆపాలి అని బావ వీసా కనపడకుండా చేశారు అని చెప్తుంది. 

విహారి మనసులో కనకాన్ని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదని ఆ దేవుడు ఇలా చేసినట్లు ఉన్నాడని విహారి హ్యాపీగా ఫీలవుతాడు. అంబిక అందరితో విహారి, సహాస్రల్ని ఆపాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి ఉంది అని అంటుంది. వసుధ చాలా కంగారు పడుతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో విహారిని ఆపడానికి వసుధ గదిలోకి వెళ్లి విహారి వీసాని చూసి దాన్ని చింపేసి మొక్కల్లో పడేస్తుంది. విహారి అందరితో అయింది ఏదో అయిపోయింది కదా సహస్ర వెళ్లి రెస్ట్ తీసుకో అని అంటాడు. పద్మాక్షి కోపంగా విహారి అయింది ఏదో అయింది ఏంటి నీ పాస్ పోర్ట్ ఎవరు తీశారు. ఇదంతా ఇంట్లో వాళ్లే చేశారు. పదండి వెతుకుదాం.. దొరికిన వాళ్ల పని అయిపోతుందని అంటుంది. అందరూ వెళ్లి ఇళ్లంతా వెతుకుతారు.

పద్మాక్షి కోపంగా ఎవరికి ఏమైనా దొరికిందా అని అడుగుతుంది. ఎవరూ లేదని తలూపుతారు. సహస్ర కోపంగా లక్ష్మీ నువ్వే ఈ పని చేసింది అని అంటుంది. నాకు తెలీదు అని లక్ష్మీ అంటుంది. అంబిక కూడా నాకు లక్ష్మీ మీద అనుమానం ఉందని అంటుంది. తన గదిలోనూ వెతుకుదాం అని లక్ష్మీ గదిలోకి సహస్ర వెళ్తుంది. లక్ష్మీ బెడ్ మీద తలగడ కింద వీసా పేపర్ ముక్కలు చూస్తుంది. సహస్ర షాక్ అయి కోపంతో రగిలిపోయి పద్మాక్షికి అమ్మా ఇవిగో చింపేసిన వీసా పేపర్లు ఇవి చింపేసింది లక్ష్మీనే అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. వసుధ కంగారు పడుతుంది. లక్ష్మీ వసుధని చూసి వసుధమ్మ కంగారు పడుతున్నారు అంటే నన్ను విహారిని దూరం చేయకూడదు అని ఇదంతా చేసినట్లు ఉన్నారని అనుకుంటుంది. 

పద్మాక్షి కోపంగా లక్ష్మీని కొడుతుంది. సహస్ర కూడా కొడుతుంది. మళ్లీ పద్మాక్షి కొట్టే టైంకి విహారి అడ్డుకుంటాడు. చిరిగిన వీసా తన గదిలో ఉంటే తనే చేసినట్లా అని అంటాడు. తనకేం అవసరం అని చారుకేశవ అడిగితే తనకే అవసరం అది నా అల్లుడి మీద కన్నేసింది.. ఇన్నాళ్లు నా కూతురు దీని మీద అనుమానపడుతున్నా నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నా ఇది విహారిని ఇష్టపడుతుంది అందుకే విహారి దూరంగా వెళ్లడం ఇష్టం లేక అది ఈ పని చేసింది అని అంటుంది. లక్ష్మీ జుట్టు పట్టుకొని నా అల్లుడు మీదే మోజు పడ్డావా అని అంటుంది. విహారి మాట్లాడుతుంటే యమున కోపంగా విహారి నువ్వు ఈ విషయంలో కలుగజేసుకోవద్దు అంటుంది. నీ మొగుడు వచ్చాడు కదా అయినా పరాయి మగాడి మీద ఆశ ఏంటే నీకు అని అంటే విహారి అత్తయ్య అని అరుస్తాడు. 

అంబిక లక్ష్మీ విహారి మీద కన్నేసింది కావాలంటే చూడండి అని మత్తులో ఉన్న విహారిని లక్ష్మీ పట్టుకున్నప్పుడు తీసిన ఫొటో చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు.  విహారిగారు పడిపోతుంటే పట్టుకున్నానని లక్ష్మీ అంటుంది. మళ్లీ సహస్ర లక్ష్మీని కొడుతుంది. ఏంటే నీ కవరింగ్‌లు సిగ్గూ శరం ఉందా నీకు అని కొట్టబోతే తన మీద చేయి పడితే ఊరుకోను అని విహారి అంటాడు. పద్మాక్షి విహారితో ఏంటి తన మాయలో పడి మాట్లాడుతున్నావా అని అడుగుతుంది. విహారి తాను లక్ష్మీ భర్త అని చెప్పబోతే యమున ఆపుతుంది. ప్రకాశ్ ఇంతలో ఇన్ని మాటలు నా భార్యని అంటున్నారు కదా ఎల్లుండి నేను నా భార్యని తీసుకెళ్లిపోతా అంటాడు. సహస్ర లక్ష్మీతో నువ్వు వెళ్లిపో అంటుంది. నేనే ఇదంతా చేశానని వసుధ చెప్తుంది. ఇదంతా మీరు చేయకుండా ఉండాల్సింది అని అంటుంది. లక్ష్మీ గదిలోకి వెళ్లి చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.