Nindu noorella savaasam Serial weekly Episode:  చిత్ర షాపింగ్ మాల్‌లో లాస్‌ వచ్చేలా చేసి వాళ్లను రోడ్డు మీదకు తీసుకురావాలిన మనోహరి ప్లాన్‌ చేస్తుంది. అందుకోసం తనకు తెలిసిన ఒక మేనేజర్‌ను ఆ షాపింగ్‌ మాల్‌లో తక్కువ శాలరీకి జాయిన్‌ కమ్మని చెప్తుంది. మను చెప్పినట్టే ఆ వ్యక్తి తక్కువ శాలరీకే అక్కడ మేనేజర్‌గా జాయిన్‌ అవుతాడు.

మనోహరికి ఫోన్‌ చేసి మీరు చెప్పినట్టే జాయిన్‌ అయ్యాను అని చెప్తాడు. దీంతో మనోహరిగుడ్‌ నెల రోజుల్లోపు ఆ షాపు దివాలా తీయాలి. వాళ్లు రోడ్డు మీద పడాలి. షాపింగ్‌ మాల్‌ నష్టాల్లో కూరుకుపోవాలి. కస్టమర్స్‌ ఎవ్వరూ మాల్‌ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నెల తిరగే లోపు షాపులో ఈగలు దోమలు తప్పా కస్టమర్స్‌ ఎవ్వరూ కనబడకూడదు అని చెప్తుంది. దీంతో ఆ మేనేజర్‌ నెల కాదు మేడం పది రోజుల్లో షాపును దివాలా తీయిస్తాను. వాళ్లను రోడ్డు మీద పడేస్తాని అని చెప్తాడు. దీంతో మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. ఆ మేనేజర్‌తో మాట్లాడుతుంటే వెనక నుంచి అమర్‌ వచ్చి పిలుస్తాడు. మనోహరి షాక్‌ అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు మనోహరి అని అడగ్గానే హాస్టల్‌ స్టాప్‌తో మాట్లాడుతున్నాని మనోహరి తప్పించుకుంటుంది. తన మాటలు అమర్‌ వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది.

స్కూల్‌ లో పోలింగ్‌ చాలా ప్రశాంతంగా జరిగిందని ప్రిన్సిపాల్‌ చెప్తుంది. రిజల్ట్‌ ఇప్పుడే వచ్చిందని చెప్తూ స్టూడెంట్స్‌ అందరూ పోలింగ్‌ లో పాల్గొనడం హ్యాపీగా ఉందని చెప్తుంది. మరోవైపు సరస్వతి వార్డెన్‌ కోసం వెతుకుతున్న మనోహరి దగ్గరకు వెళ్తుంది భాగీ. ఎవరి కోసం వెతుకుతున్నావని మనును అడుగుతుంది. దీంతో మను నేను వెతకడం ఏంటని అంటుంది. భాగీ కోపంగా నువ్వు సరస్వతి వార్డెన్ కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. ఆవిడ నన్ను కలవకుండా చేస్తున్నావని నాకు తెలుసు. నిజం నాకు తెలిసిన రోజు నీ కథ ముగిసినట్టే అంటూ వార్నింగ్‌ ఇస్తుంది భాగీ. తెలిస్తే ఏం చేస్తావు అంటూ మను కోపంగా అడుగుతుంది. ఇంతలో ఆనంద్‌ ఎలక్షన్స్‌ లో గెలిచినట్టు ప్రిన్సిపాల్‌ అనౌన్స్‌ చేయడం వింటారు. ఇదే రిజల్ట్ నీకు రిపీట్‌ అవుతుంది అని వార్నింగ్‌ ఇచ్చి భాగీ వెళ్లిపోతుంది.

 ఇంటికి వెళ్లిన తర్వాత ఆనంద్ డాన్స్‌ చేస్తూ అంజును హగ్‌ చేసుకుంటాడు. అంతా నీవల్లే జరిగింది. నువ్వే కనక లేకపోతే నేను గెలిచేవాణ్నే కాదు అంజు అంటూ మెచ్చుకుంటాడు. అప్పటికే పరధాన్యంలో ఉన్న అంజు అసలు నేనేం చేశాను.. నాకే గుర్తు లేదు.. అంటూ అంజు మాట్లాడుతుంది. అయితే అంజు కావాలనే తనకు గుర్తు లేదని చెప్తుందని అలాగైతే తాము ఇంకా తనని పొగడతామని అనుకుంటుందని అమ్ము అనుకుని నిన్ను ఇక పొగడలేం కానీ పడుకో అంటూ వెటకారంగా చెప్తుంది. అందరూ పడుకున్నా కూడా అంజు మాత్రం అసలు నేనేం చేశాను అని ఆలోచిస్తుంది.

మరుసటి రోజు ఉదయం గార్డెన్‌లో అమర్‌ కాఫీ తాగుతుంటే ఇంటి మీద గద్ద తిరుగుతుంది. రాథోడ్‌ గద్దను చూసి షాక్‌ అవుతాడు. అమర్‌ పిలిచినా పలకడు. అమర్‌ గట్టిగా పిలగానే ఉలిక్కి పడి చూస్తాడు. ఏంటి రాథోడ్‌ పరధాన్యంలో ఉండిపోయావు..అంటాడు అమర్‌. ఇంటి మీద గద్ద తిరుగుతుంది సార్‌.  అలా తిరగడం ఇంటికి మంచిది కాదు సార్‌ అని చెప్తాడు. ఇంతలో చంభా చెప్పిందని ఇంట్లో ఎవ్వరూ ఉండకుండా చూసుకోమని రణవీర్‌ మనుకు కాల్ చేస్తాడు. మను సరే అంటుంది. చిత్ర దగ్గరకు వెళ్లి ఎలాగైనా భాగీని ఈరోజు షాపింగ్‌ మాల్‌కు తీసుకెళ్లమని చెప్తుంది.

దీంతో చిత్ర భాగీని తీసుకుని షాప్‌కు వెళ్తుంది. అమర్‌ ఆఫీసుకు వెళ్తాడు. పిల్లలు స్కూల్‌కు వెళ్లిపోతారు. అందరూ వెళ్లిపోయాక చంభా, రణవీర్‌, లాయరు వస్తారు. చంభా మంత్రం వేసి ఆరు ఆత్మను బందిస్తుంది. మరోవైపు అంజు అమర్‌కు ఫోన్‌ చేసి ఇంట్లో ఏదో జరుగుతుంది డాడ్‌ నేను స్కూల్‌లో ఉండలేని నన్ను ఇంటికి తీసుకెళ్లు అని చెప్తుంది. నేను వెళ్లి చూస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అంజు అంటూ అమర్‌ ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన భాగీ కూడా చిత్ర మాటలకు అనుమానం వచ్చి ఇంటికి బయలుదేరుతుంది. భాగీ ఇంటికి బయలుదేరిన విషయం మనుకు చెప్తుంది చిత్ర.  దీంతో ఈ వారం నిండు నూరేళ్ల సావాసం అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!