Brahmamudi Serial Weekly Episode: కావ్య కడుపుతో ఉందన్న విషయం స్వరాజ్ ద్వారా ఇంట్లో వాళ్లకు ముఖ్యంగా రాజ్‌కు తెలిసేలా చేయాలనుకుంటుంది రుద్రాణి. అందుకోసం గార్డెన్ లో చాక్లెట్ తింటున్న స్వరాజ్ దగ్గరకు వెళ్తుంది. చాక్లెట్ ఇచ్చింది ఎవరని అడుగుతుంది రుద్రాణి. కావ్య ఆంటీ ఇచ్చిందని స్వరాజ్ చెప్పగానే.. అయితే కావ్య ఆంటీకి కంగ్రాట్స్ చెప్పావా నువ్వు అని అడుగుతుంది రుద్రాణి.. కంగ్రాట్స్ చెందుకు చెప్పాలని స్వరాజ్ అడగ్గానే.. నువ్వు ఆడుకోవడానికి నీకో బుల్లి ప్రెండ్‌ను ఇవ్వబోతుంది కదా అందుకు చెప్పాలి అంటుంది రుద్రాణి.
ఆ మాటలకు స్వరాజ్ హ్యాపీగా అవునా..? అయితే ఇప్పుడే వెళ్లి చెప్తాను అంటూ లోపలికి వెళ్లిపోతాడు. నేరుగా కావ్య దగ్గరకు వెళ్లి కంగ్రాట్స్ చెప్తాడు స్వరాజ్. నాకెందుకు చెప్తున్నావురా అని కావ్య అడగ్గానే… మీరు ప్రెగ్నెంట్ అట కదా అందుకే చెప్తున్నాను అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. కనకం వచ్చి ఆ విషయం నీకెవరు చెప్పారని అడుగుతుంది. స్వరాజ్ తనకు రుద్రాణి చెప్పిందని అంటాడు. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. నేను అప్పు గురించి చెబితే వాడు కావ్యను అడిగాడు అంటూ తప్పించుకుంటుంది రుద్రాణి. తర్వాత కనకం ప్లాన్ ప్రకారం రాజ్ చేత కావ్య మీద అక్షింతలు వేయిస్తుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు.
తర్వాత రాజ్, కావ్యను బయటకు గార్డెన్‌లోకి తీసుకెళ్లి నేను నీ మీద అక్షింతలు వేస్తేనే ఇంట్లో వాళ్లు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఇక మనం పెళ్లి చేసుకుంటే ఎంత సంతోషిస్తారో కదా అంటూ పెళ్లి ప్రపోజల్ తేగానే.. కావ్య రాజ్‌ను తిట్టి మీరు ఆ విషయం కోసమే మా ఇంటికి వస్తే నేను ఇంట్లో ఉండకుండా వెళ్లిపోతానని బెదిరిస్తుంది. దీంతో రాజ్ మీరెందుకు వెళ్లడం నేనే వెళ్లిపోతాను అంటూ స్వరాజ్‌ను తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత అప్పు కళ్లు తిరిగి కింద పడిపోతుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఎక్సఫైర్ అయిన టాబ్లెట్ వేసుకోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పి వెళ్లిపోతుంది. రుద్రాణి వెంటనే ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్యనే కదా ఎందుకు కావ్య అంత పని చేశావు అంటూ నిలదీస్తుంది. దీంతో ధాన్యలక్ష్మీ కావ్యను తిడుతుంది. కావ్య ఏడుస్తూ పైకి వెళ్లిపోతుంది. వెంటనే ఇందిరాదేవి, అపర్ణ కోపంగా ధాన్యలక్ష్మికి ఇంట్లో వాళ్లకు తెలిసేలా కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తారు. దీంతో ధాన్యలక్ష్మీ బాధగా కావ్య దగ్గరకు వెళ్లి సారీ చెప్తుంది.
రాజ్, కావ్య చేత నిజం చెప్పించాలని తాను అమెరికా వెళ్తున్నట్టు నాటకం ఆడాలని డిసైడ్ అవుతాడు. ఇక రుద్రాణి యామనికి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన విసయం మొత్తం చెప్పి ఇక రాజ్ కు నిజం చెప్పమని చెప్తుంది. యామిని సరే అంటుంది. రాజ్ అమెరికా వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న రుద్రాణి ఇంట్లో వాళ్లకు చెప్తుంది. వెంటనే అపర్ణ, ఇందిరాదేవి ఎలాగైనా రాజ్‌ను ఆపాలని ప్రయత్నిస్తారు. రాజ్ వినకుండా ఎయిర్‌ఫోర్ట్‌కు బయలుదేరుతాడు. దీంతో కావ్య తానే రాజ్‌కు నిజం చెప్పాలని ఎయిర్‌ఫోర్ట్‌కు బయలుదేరుతుంది. రుద్రాణి కూడా రాజ్‌కు నిజం చెప్పాలని ఎయిర్‌ఫోర్ట్‌కు బయలుదేరుతుంది. రాజ్ మధ్యలో కారు ఆపుకుని ఫోన్ మాట్లాడుతుంటే.. రుద్రాణి వెళ్తుంది. రాజ్‌తో మాట్లడుతూ కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుంది.
ఇంతలో అక్కడకు కావ్య వస్తుంది. రాజ్ నువ్వు ప్రెగ్నెంటా..? అని అడగ్గానే అవునని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. రాజ్ అపర్ణ, ఇందిరాదేవిల దగ్గరకు వెళ్లి మీకు నిజం తెలిసినా ఎందుకు చెప్పలేదు అంటూ వాళ్లను తిట్టి కావ్య ముఖం జన్మలో చూడనని వెళ్లిపోతాడు. రాజ్ తిట్టి వెల్లిపోయాడని తెలుసుకున్న కావ్య భోజనం చేయకుండా రూంలోనే ఉంటుంది. దీంతో అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి ఓదార్చి కావ్యకు భోజనం పెడతారు. మరోవైపు ఇంటికెళ్లి బాధగా రూంలో కూర్చున్న రాజ్‌ను మందు తాగమని యామిని పుల్‌బాటిల్ ఇస్తుంది. మందు తాగి ఇంట్లోంచి బయటకు వెళ్లిన రాజ్ రోడ్డు మీద పడుకుని ఉంటాడు. అటుగా వెళ్తున్న కావ్య రాజ్‌ను కారులో తీసుకెళ్తుంది. ఇంతటితో గడిచిన వారం బ్రహ్మముడి అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!