Nindu Noorella Saavasam November 30th Episode: పిల్లలు ముగ్గురు తండ్రితో ఏదో మాట్లాడాలనుకుంటారు కానీ భయంతో మాట్లాడలేక పోతారు.
అమర్ : నాతో ఏమైనా మాట్లాడాలా?
పిల్లలు: ముందు భయంతో ఏమీ లేదు అంటారు కానీ అమర్ ధైర్యం చెప్పడంతో మీ పర్మిషన్ తీసుకోకుండా వాచ్మెన్ తాతయ్యని లంచ్ కి ఇన్వైట్ చేసాము అంటారు.
అమర్: అంజుకి బాగోలేదు అలాగే ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేదు ఇప్పుడు వద్దు తర్వాత రమ్మని చెప్పండి అని అనటంతో పిల్లలు ముఖాలు మాడ్చుకుంటారు.
మిస్సమ్మ : ఇన్వైట్ చేసిన వాళ్ళని వద్దు అని చెప్తే బాగోదు ఈసారికి వచ్చిన అతిధికి మర్యాద చేసి పంపిద్దాం.
మిస్సమ్మకి అమర్ తండ్రి కూడా సపోర్ట్ చేయడంతో మరెప్పుడూ నన్ను పర్మిషన్ అడగకుండా ఎవరిని ఇన్వైట్ చేయకండి అంటూ ప్రస్తుతానికి పర్మిషన్ ఇస్తాడు అమర్. పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరోవైపు...
మనోహరి: నీలతో మాట్లాడుతూ ఇంట్లో ఏదో ఉంది అంటే ఆరోజు గుమ్మానికి ఏదో తాయత్తు కట్టావు ముందు బానే ఉంది కానీ తర్వాత మళ్లీ ఇబ్బంది తలెత్తింది నా పక్కన ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఆ ఘోర కూడా అదే మాట చెప్తున్నాడు. కచ్చితంగా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అది ఆ ఘోరాకి మాత్రమే తెలుస్తుంది వెళ్లి అతనిని తీసుకురా అనటంతో నీల అతనిని వెతకటానికి బయలుదేరుతుంది.
ఈ మాటలు విన్న అరుంధతి భయపడిపోతుంది. కంగారుగా చిత్రగుప్తుడు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఏమైనా చేయమంటుంది.
చిత్రగుప్తుడు: నా అంగుళీకము ఇచ్చేయవచ్చు కదా అని అరుంధతిని కోప్పడతాడు కానీ మళ్లీ నీలని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు.
నీల: నా పని అయితే చెప్పేదాన్ని కానీ ఇది మా మేడం గారి పని అని అక్కడ నుంచి వెళ్ళబోతుంది.
చిత్రగుప్తుడు: వెళ్తే వెళ్లావు కానీ ఆ ఘోరా కంటపడకు అతను కన్నె పిల్లలను ఎత్తుకుపోతాడు అనటంతో కంగారుగా వెనక్కి వచ్చేస్తుంది.
మేడం అన్ని ఇలాంటి పనులే చెప్తుంది అని మనోహరిని తిట్టుకుంటూ ఏదో ఒక అబద్ధం చెప్పేస్తాను అని చిత్రగుప్తుడికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
చిత్రగుప్తుడు: గండం తప్పినందుకు ఆనందపడుతున్న అరుంధతిని చూసి ఎన్నాళ్ళు ఇలా తప్పించుకుంటావు ఇకపై నీకు దినదినము గండమే నీకు ఒక సోదరుడులాగా చెప్తున్నాను నా వెంట మా లోకానికి వచ్చేయ్ అని చెప్పటంతో బాగా ఏడుస్తుంది అరుంధతి.
మరోవైపు రాథోడ్ వాచ్మెన్ ఇంటి దగ్గరలోకి వచ్చి ఫోన్ చేస్తాడు.
వాచ్మెన్ : మేముండే సందులోకి కారు రాదు నేనే అక్కడికి వస్తాను అని రాథోడ్ కి చెప్పి మంగళకి వస్తాను అని చెప్పి బయలుదేరుతాడు.
ఈయన వెళుతున్నది మాస్టారు ఇంటికేనా అని అనుమానంతో అక్క తమ్ముళ్ల ఇద్దరు అతనిని వెంబడిస్తారు. కానీ వాళ్ళు నిజం తెలుసుకొనేలోపు వాచ్మెన్ కారెక్కి వెళ్ళిపోతాడు.
మంగళ తమ్ముడు : తెలియని దానికోసం ఆరాటపడటం కన్నా తెలిసిన దానితో మనం ఏమైనా చేయొచ్చు కదా.
మంగళ: నిజమే ఆ మిలటరీ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో కొనుక్కో ఆ ఇంట్లో మనకి ఎవరు పనికొస్తారో తెలిస్తే అప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది.
మరోవైపు నీల కోసం ఎదురుచూస్తున్న మనోహరి దగ్గరికి నీలా వచ్చి ఘోరా ఎక్కడా దొరకలేదు అని అబద్ధం చెప్పేస్తుంది. ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు.
మనోహరి : వస్తున్నది వాచ్మెన్ నువ్వు ఎందుకు ఇన్ని రకాల ఐటమ్స్ చేస్తున్నావు ఏవో రెండు రకాలు సరిపోతాయి కదా.
అమర్ తల్లిదండ్రులు : స్థాయిని బట్టి ఆతిథ్యం ఇస్తామా ఇంకెప్పుడూ ఆయన గురించి అలా మాట్లాడకు.
ఇంతలో కారు రావడంతో వాచ్మెన్ ని ఇన్వైట్ చేయటానికి అందరూ బయటికి వెళ్తారు. మిస్సమ్మ కూడా బయటికి రాబోతుంటే మనోహరి వారించి ఆమెని లోపలే ఉంచేస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply