Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో నేను మీతో అబద్ధం చెప్పిన మాట నిజమే కానీ అది కేవలం నా తండ్రి కోసమే చేశాను. ఆయనకి ఏమైనా అయితే నేను అనాధని అయిపోతాను అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నేను అవసరానికి అబద్ధం చెప్పాను కానీ అబద్ధాన్ని ఎప్పుడూ నిజం చేయాలనుకోలేదు. నేను నిజం చెప్పాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు కానీ నిజం చెప్పాను అని తృప్తి నాకు మిగులుతుంది పిల్లలు జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


మరోవైపు పిల్లలు, వాళ్ళ నానమ్మ తాతయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలలో తాతయ్యకి మిస్సమ్మ మందులు కొనటం ఏమిటి అని డౌట్ వస్తుంది.


నిర్మల : ఒకవేళ ఇద్దరు ఒకే హాస్పిటల్లో ఉన్నారేమో అంటుంది.


ఆమె భర్త: లేదంటే ఇద్దరూ ఒకరేనేమో అంటాడు.


అది కూడా నిజం అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మిస్సమ్మకి ఫోన్ చేసి కనుక్కోండి తాతయ్య అంటారు పిల్లలు.


అమర్ కోప్పడతాడేమో అని ముందు భయపడతాడు కానీ పిల్లల బలవంతం మీద మిస్సమ్మకి కాల్ చేస్తాడు అమర్ తండ్రి.


అమర్ తండ్రి: మిస్సమ్మ కి కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతాడు తర్వాత నువ్వు కష్టంలో ఉన్న సమయంలో నీకు అండగా ఉండవలసింది పోయి నిన్ను అపార్థం చేసుకున్నాడు అమర్. వాడి తరపున నన్ను క్షమించు, వాడి మాట కరుకు గాని మనసు చాలా మంచిది అని చెప్తాడు.


మిస్సమ్మ: అయ్యో, సార్ గురించి నాకు బాగా తెలుసండి మరేం పర్వాలేదు అంటుంది.


అమర్ తండ్రి: ఎల్లుండి హాస్పిటల్ కి వచ్చి నిన్ను కలుస్తాము రేపు మా అనుకునే మనిషిని కలవడానికి వెళుతున్నాను ఆ తర్వాత రోజు మీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత మీ నాన్నగారు ఏమైనా వాచ్మెన్ గా పనిచేస్తున్నారా అని అడుగుతాడు.


మిస్సమ్మ : ఆశ్చర్యపోతూ ఎందుకు అలా అడుగుతున్నారు అని కాళీ దగ్గరికి వెళ్లి నాన్న వాచ్మెన్ గా పనిచేసేవారా అని అడుగుతుంది. కంగారుగా అతను లేదు అని చెప్పటంతో అమర్ తండ్రికి మా నాన్నగారు ఎక్కడా వాచ్మెన్ గా పనిచేయలేదు అని చెప్తుంది. అయినా ఎందుకు అలా అడుగుతున్నారు అని అడుగుతుంది.


ఆమె తండ్రి : లేదు పిల్లలు ఏదో అంటేనూ అనుమానం తో అడిగాను అంతే. ఎల్లుండి కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.


మరోవైపు ఆలోచనలో ఉన్న అమర్ దగ్గరికి వచ్చిన మనోహరి ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.


అమర్: మిస్సమ్మని నేను అపార్థం చేసుకున్నానేమో అనిపిస్తుంది ఆమె చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది అనిపిస్తుంది తను చాలా సార్లు నాతో ఏదో మాట్లాడ్డానికి ప్రయత్నించింది అది ఇదేనేమో అని పాజిటివ్ గా మాట్లాడుతాడు.


మనోహరి: మిస్సమ్మ అమర్ తో మాట్లాడిందని తెలుసుకొని షాక్ అయిపోతుంది. తరువాత కోపంతో రగిలిపోతూ అంటే సరైన కారణం ఉంటే ఎలాంటి అబద్ధాలు అయినా చెప్పొచ్చా అలాంటి వాళ్ళని నువ్వు క్షమించేస్తావా.. ఈ సంఘటన చూసి పిల్లలు కూడా అలాగే తయారవుతారు. అలాంటి వాళ్ళని కంటికి కనిపించనంత దూరంగా ఉంచాలి అని చెప్తుంది.


ఆ తర్వాత మరుసటి రోజు పొద్దున్న నిద్ర లేచిన అమర్ రాథోడ్ ని పిల్లలు నిద్ర లేచారా అని అడుగుతాడు.


రాథోడ్: కంగారు పడిపోతూ ఏమో సార్ తెలియదు ఇంకా ఎవరూ కిందికి రాలేదు అంటాడు.


అమర్ కోపంగా పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళ బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి నలుగురు బుద్ధిగా చదువుకుంటూ కనిపిస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు అమర్, రాథోడ్, అరుంధతి.


అమర్: ఇంత పొద్దున్నే ఏం చేస్తున్నారు అని అడుగుతాడు.


అమ్ము : పొద్దున్నే లేచి చదువుకుంటే తలకెక్కుతుందంట కదా మిస్సమ్మ చెప్పింది. మాకు ఇలాగే అలవాటు చేసింది అంటుంది.


అంజు : ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటే టైమ్ సేవింగ్ కూడా జరుగుతుందని చెప్పింది. మేము చాలా రోజుల నుంచి అలాగే ఫాలో అవుతున్నాము అని చెప్తుంది.


అరుంధతి: ఆనంద పడిపోతూ మిస్సమ్మ.. నువ్వు పిల్లల్ని పాడు చేసావని ఎవరు చెప్పారు, వాళ్లని ఎంత బాధ్యతాయుతంగా పెంచుతున్నావు అనుకుంటుంది.


అమర్: హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను మీ ప్రిన్సిపాల్ తో మాట్లాడాను ఇంక మీరు స్కూల్ కి వెళ్లొచ్చు అంటాడు.


అమ్ము : ఈరోజు మీరు భాగి ఆంటీ ని చూడటానికి వెళ్తున్నారు కదా మేము కూడా వస్తాము అని అడుగుతుంది.


అమర్: వద్దు, మాకు ఇన్విటేషన్ లేదు అయినా వెళ్తున్నాము అందరు వెళ్తే బాగోదు మేము వెళ్తాము తనతో మాట్లాడి ఇంటికి తీసుకు వస్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు.


అతని వెనకే వచ్చిన రాథోడ్ సర్ మీతో ఒక విషయం చెప్పొచ్చా అని అడుగుతాడు. అమర్ చెప్పమనడంతో మీరు మిస్సమ్మ విషయంలో తొందర పడ్డారేమో సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు అంటాడు.


అమర్: మనోహరి పెళ్లిచూపులు ప్రోగ్రాం ఉంది ముందు ఆ పనులు చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read'విరూపాక్ష'తో పోలికలు... పెళ్లి పుకార్లు... 'ఊరు పేరు భైరవకోన' సంగతులు... వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ