Nindu Noorella Saavasam Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో పేపర్లో భాగీ ఫోటో పడిందేమో అని కంగారుపడుతుంది మనోహరి. కానీ న్యూస్ మాత్రమే పడటంతో ఆనందపడుతుంది
అమర్ తల్లిదండ్రులు ఏం అవార్డు అని కొడుకుని అడుగుతారు.
అమర్: బెస్ట్ ఆర్జే అవార్డు నాన్న, జ్యూరీ మెంబర్స్, ప్రేక్షకులందరూ కలిపి ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారంట. రేపు మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటుంది అది మామూలు విషయం కాదు అంటాడు.
నిర్మల: అందుకే అరుంధతి భాగిని అంతగా ఇష్టపడేది అంటుంది.
అరుంధతి: ఆ మాటలు వింటూ ఆనంద పడిపోతుంది. తను నా చెల్లెలు లాంటిది ఎందుకో ఆమెతో మాట్లాడితే చాలా ప్రశాంతంగా ఉండేది అంటుంది.
అమర్: భాగీ కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తాను అని ఫోన్ తీస్తాడు.
మనోహరి : కంగారు పడిపోతూ వద్దు అమర్ అంతగా పరిచయం లేదు కదా తప్పుగా అనుకుంటుంది అంటుంది.
అమర్ తండ్రి : అవును రేపు నేరుగా ఫంక్షన్ కి వెళ్లి అక్కడ పరిచయం చేసుకొని అక్కడే కంగ్రాట్స్ చెబుదాం అంటాడు.
అమర్: అవును నిజమే తనని ఎప్పుడు కలవాలన్నా కుదరటం లేదు రేపు ఫంక్షన్ కి వెళ్లి అక్కడే కలుద్దాం అంటాడు.
ఈ మాటలు వింటున్న మనోహరి ఎక్కడ మిస్సమ్మ, భాగి ఒక్కరే అని అమర్ వాళ్ళకి తెలిసిపోతుందో అని కంగారు పడిపోతుంది.
మరోవైపు మిస్సమ్మని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్లతో సహా మిస్సమ్మ ఇంతకుముందు పనిచేసే ఆర్జే ఆఫీస్ మేనేజర్ కూడా హాస్పిటల్ కి వస్తాడు.
అయితే అందర్నీ హాస్పిటల్లోకి అలౌ చేయరు హాస్పిటల్ వాళ్ళు. కేవలం ఆఫీస్ మేనేజర్ మాత్రం లోపలికి వెళ్తాడు. మంగళ కి అవార్డు విషయం చెప్పి మిస్సమ్మని కలవాలి అంటాడు.
మంగళ: తన తండ్రికి బాగోలేదు ఇప్పుడు ఎవరినీ కలవదు అంటుంది.
కాళీ: ఇప్పుడు వాళ్ళు కలిస్తే ఏమవుతుంది భాగ్య అవార్డు తీసుకుంటే వచ్చి నష్టం ఏంటి అంటాడు.
మంగళ: ఇప్పుడు భాగి స్టేజి మీద అవార్డు తీసుకుంటే ఆ విషయం ఆ మిలిటరీ వాడికి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు కలిసిపోతారు. అప్పుడు మీ పెళ్లి చేయటం కష్టమవుతుంది అంటుంది.
ఆ విషయం అర్థం చేసుకున్న కాళీ మేనేజర్ ని బయటికి పంపించేయబోతుంటే ఆ హడావుడికి మిస్సమ్మ బయటికి వస్తుంది.
మేనేజర్ ని పలకరిస్తుంది. మేనేజర్ భాగీకి విషయం చెప్పి రేపు అవార్డు ఫంక్షన్ ఉంది అని చెప్తాడు.
మిస్సమ్మ : నేను ఎక్కడికి రాలేను, ఇప్పుడు మా నాన్నగారికి బాగోలేదు అని చెప్పి ఐసీయూలోకి వెళ్ళిపోతుంది.
కాళీ మేనేజర్ ని బయటికి పంపించేస్తాడు. భాగి తండ్రితో అవార్డు విషయం చెప్పి బాధపడుతుంది. నాకు ఇప్పుడు అవార్డులు ముఖ్యం కాదు. నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఈ పెళ్లి చేసుకొని మీ రుణం తీర్చుకుంటాను నాకు నువ్వు ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం అని ఏడుస్తుంది.
రామ్మూర్తి: నా కూతుర్ని ఈ మోసం నుంచి ఎలా బయటపడేయ్యాలి అని బాధపడతాడు.
మరోవైపు స్కూల్ కి రెడీ అయిన పిల్లలు నీరసంగా కిందికి దిగుతారు.
నీల: పిల్లలు బాగా నీరసంగా ఉన్నారు మీరు అమరయ్య గారితో చెప్పండి పిల్లలకి టిఫిన్ పెడదాం అంటుంది.
మనోహరి అందుకు అంగీకరించదు. పిల్లల దగ్గరికి వెళ్లిన నీల మనోహరి అమ్మగారికి సారీ చెప్పండి తను మీ నాన్న గారితో మాట్లాడుతుంది అంటుంది.
పిల్లలు: మేము మా నాన్నకు సారీ చెప్పాలి కానీ తనకి ఎందుకు సారీ చెప్పాలి అంటారు.
ఇంతలో రాథోడ్ వచ్చి తండ్రిని తీసుకొని వస్తేనే పిల్లల్ని స్కూల్ లోనికి ఎలౌ చేస్తారని ప్రిన్సిపల్ చెప్పారు అని డల్ గా చెప్తాడు.
పిల్లలందరూ తండ్రి దగ్గరికి వెళ్లి విషయం చెప్పి స్కూల్ కి రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ల మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్.
అమర్ తండ్రి: పిల్లలు తప్పు చేస్తే మందలించాలి కానీ మరీ ఇంతలా పనిష్మెంట్ ఇవ్వకూడదు అని భార్యతో చెప్తాడు.
నిర్మల: వాడికి ఎవ్వరూ ఎదురు చెప్పలేకపోతున్నాము. మిస్సమ్మ ఉంటే పిల్లలకీ పరిస్థితి రానిచ్చేది కాదు. మిస్సమ్మ విలువ ఇప్పుడు తెలుస్తుంది అంటుంది.
మరోవైపు మనోహర్ కి మంగళ ఫోన్ చేస్తుంది.
మంగళ: భాగీ ని కలవడానికి మీడియా వాళ్ళు వస్తే కలవనివ్వలేదు అని చెప్తుంది. అలాగే పెళ్లి ఖర్చులకి డబ్బులు లేవు అని చెప్తుంది.
మనోహరి : మంచి పని చేశావు పెళ్లి అయిన వరకు భాగిని ఎవరితో కలవనివ్వకు నీకు డబ్బులు అవసరమైతే నేను పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ కి వెళ్లకుండా ఎలా అని ఆలోచనలో పడుతుంది. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.