Nindu Noorella Saavasam Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో చిత్రగుప్తుడు మాట్లాడుతూ ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళటం అంటే ప్రమాదాలను కొని తెచ్చుకోవటమే. నాకు తెలిసి ఆ ఘోర ఇప్పటికే నిన్ను ఎలా బంధించాలి అనే ప్రశ్నకి సమాధానం వెతుకుతూ ఉంటాడు. మళ్లీ హెచ్చరిస్తున్నాను బాలిక నీ కుటుంబానికి నీవే ప్రమాదంగా మారబోతున్నావు అని అరుంధతిని హెచ్చరిస్తాడు.


మరోవైపు నీరసంతో కళ్ళు మూసుకున్న అంజుకి అమ్మకి మాటిచ్చాను ఎలాగైనా పాస్ అవ్వాలి అనుకొని జ్వరంతోనే పుస్తకం తీసి చదువుతుంది.


అప్పుడే అక్కడికి తన అక్క అన్నయ్యలు వస్తారు.


అమ్ము : ఏం చేస్తున్నావ్ అంజు.


అంజు: రేపు ఎగ్జామ్ పాస్ అవ్వాలి అందుకే చదువుతున్నాను.


అమ్ము : ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో పడుకో అని ప్రేమగా చెప్తుంది.


ఆనంద్: ఈ స్కూల్ కాకపోతే మరొక స్కూల్లో చదువుకుందువు గాని అంతేగాని జ్వరంతో రిస్క్ చేయకు.


అంజు: నాక్కూడా మీతో పాటు చదువుకోవాలని ఉంది. మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే వాళ్లతో ఎవరు గొడవ పెట్టుకుంటారు. స్కూల్ అయిపోయాక రాథోడ్ వచ్చేలోపు మనం నలుగురం కలిసి ఆడుకునే వాళ్ళం కదా ఇప్పుడు ఫోర్త్ పర్సన్ మిస్ అయితే మీరు కూడా బాధపడతారు కదా అని బాగా ఎమోషనల్ అవుతుంది.


అంజుని చూసి మిగతా పిల్లలు కూడా ఏడుస్తారు. ఇదంతా చూస్తున్న అమర్, అరుంధతి, మిస్సమ్మ కూడా బాగా ఎమోషనల్ అవుతారు.


అంజు : అమ్ము పొద్దుట్నుంచి చదువుతున్నాను నన్ను రెండు ప్రశ్నలు అడగవా అని బుక్ ఆమెకిస్తుంది. అమ్ము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతుంది.


అప్పుడు అమ్ము అంజుని మందలించి ముందు పడుకో ఎగ్జామ్స్ సంగతి తర్వాత చూద్దాం అని ఆమెని పడుకోబెడుతుంది.


అరుంధతి: ఇదంతా బయటి నుంచి చూస్తున్న అరుంధతి తప్పంతా నాదే, ఆ నిమిషానికి నిన్ను సేవ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ భవిష్యత్తులో నువ్వు ఇంత బాధ పడతావ్ అనుకుంటే అప్పుడే చదివించేదాన్ని తప్పంతా నాదే నన్ను క్షమించు అనుకుంటుంది.


అమర్: బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మిస్సమ్మతో  రేపు అంజు ఎగ్జామ్ రాయక్కర్లేదు పాత స్కూల్ లోనే రీ జాయిన్ అవుతుంది ఈ విషయం అంజుకి చెప్పు.


మిస్సమ్మ: అంజు మీద మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నాకు నమ్మకం ఉంది. తను కచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతుంది ఒకవేళ పాస్ అవ్వకపోయినా నష్టం లేదు కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా అని ఎదిరించి మాట్లాడుతుంది. మళ్ళీ అలా మాట్లాడినందుకు మన్నించమని అమర్ ని అడుగుతుంది.


మరోవైపు ఆత్మని పట్టుకోలేనందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఘోర. అప్పుడే అతని స్వామి ప్రత్యక్షం అయితే నేను ఎందుకు ఆత్మని పట్టుకోలేకపోతున్నాను అని అడుగుతాడు.


స్వామి: ఆత్మ ఆ ఇంటిలో ఉన్నంతసేపు నువ్వు పట్టుకోలేవు. ఆత్మ బయటకు వస్తే అప్పుడు పట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు ఏం చెప్తే అది ఈ లోకం వింటుంది. కానీ పట్టుకోవటం పట్టుకోకపోవడం అనేది నీ చేతుల్లో ఉంటుంది. వెళ్ళు రేపు ఆ ఆత్మని పట్టుకొని నీవు అనుకున్నది సాధించు అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు స్వామి.


ఘోర : రేపంతా ఆత్మ బయటే ఉంటుందా.. అయితే రేపు అనేది అంతమయ్యేలోపు ఆత్మని నేను బంధించి తీరుతాను లోకానికి నాయకుడిని అవుతాను అని ఆనందపడతాడు.


మరోవైపు అంజు నీరసంగా ఉంటే భోజనం చేయదు నేనుంటే తినిపించేదాన్ని  ఇప్పుడు ఎవరైనా తినిపిస్తున్నారో లేదో అనే కంగారుగా అంజు రూమ్ కి వెళ్తుంది అరుంధతి.


అక్కడ మంచి మాటలు చెప్పి అంజు చేత భోజనం తినిపించడానికి ప్రయత్నిస్తున్న మిస్సమ్మని చూసి ఆనందపడుతుంది. మనసులోనే ఆమెకి థాంక్స్ చెప్పుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ చేసిన పనికి మైకంలో విశాలాక్షి - పరుగు పరుగున వచ్చిన నాగయ్య పాము!