Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీకు ఆపోజిట్ గా ఎలక్షన్స్ లో నిలబడ్డ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నాడు అతనికి అందరి సపోర్టు ఉంది అంటుంది.
అంజు: మీ సపోర్ట్ కూడా అతనికైన అంట కదా అతను మీ ఫ్రెండ్ కొడుకు అంట కదా అని వెటకారంగా మాట్లాడుతుంది.
ప్రిన్సిపాల్ : అన్ని తెలుసుకునే పోటీ చేస్తున్నారన్నమాట. రేపు ఎలక్షన్స్ లో ఓడిపోయి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే నాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు నేను తీసుకోను అంటుంది.
అంజు: అలాగే మేడం రేపొద్దున్న వాళ్లు ఓడిపోయి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోకండి అని కౌంటర్ వేసి మేడమ్ ని పక్కకు తప్పుకోమని తన వాళ్ళని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
దారిలో వాళ్లకి ఎలక్షన్స్ లో ఆపోజిట్ గా పోటీ చేసే అబ్బాయి ఎదురుపడతాడు. రెండు రోజుల్లో ఎలా మీరు అందరిని ఓట్లు వేయమని అడుగుతారు గెలుస్తామనేనా అని అడుగుతాడు.
అంజు: ఎందుకు గెలవం? ఇప్పటివరకు గెలుస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్న నువ్వు ఓడిపోతావనే భయంతోనే మా దగ్గరికి వచ్చావు కదా అలాగే చూస్తూ ఉండు మేము గెలిచి తీరతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు బాధగా ఇంటికి తిరిగి వస్తాడు చిత్రగుప్తుడు.
అరుంధతి: కంగారుగా అతని దగ్గరికి వెళ్లి మిస్సమ్మ నన్ను నీలకి పరిచయం చేసింది కానీ నీల నేను కనిపించలేదు అనే విషయం మిస్సమ్మకి చెప్పలేదు ఎందుకో అర్థం కావడం లేదు అని అడుగుతుంది.
చిత్రగుప్తుడు: నీకు ప్రమాదం పొంచి ఉంది, కూటములన్నీ ఒకటవుతున్నాయి, చేతులు జోడించే ప్రార్థిస్తున్నాను ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోదాం పద అని అరుంధతిని గట్టిగా కోప్పడతాడు.
అరుంధతి: ఎందుకు ఈరోజు గుప్తా గారు ఇంత కోపంగా ఉన్నారు అని మనసులో అనుకొని నాకు ప్రమాదాన్ని తీసుకువచ్చేది ఎవరు,ఏం జరుగుతుంది అని అడుగుతుంది.
చిత్రగుప్తుడు: అవి ఇవి నేను చెప్పలేను కానీ నీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్తూ ఉండగానే మనోహరి ఇంట్లోకి రావడం గమనించిన చిత్రగుప్తుడు కామ్ గా తన పని తాను చేసుకోవడం ప్రారంభిస్తాడు
అరుంధతి: ఎందుకు గుప్తా గారు మనోహరి ని చూసి ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటుంది.
ఇంతలో అమర్ వాళ్ళు ఇంటికి వస్తారు. డ్రైవర్ ని పట్టుకోడానికి వెళ్లారు ఏం జరిగిందో చూసి వస్తాను అని అమర్ వాళ్ళతో వెళ్తుంది అరుంధతి.
డల్ గా సోఫాలో కూర్చున్న అమర్ కి మంచినీళ్లు ఇచ్చి ఎందుకో డల్ గా ఉన్నారు ఏమైంది అని అడుగుతుంది మిస్సమ్మ.
మనోహరి: ఆయనకి చాలా పనులు ఉంటాయి అన్ని నీకు చెప్పాలా.. పిల్లలు వచ్చే టైం అయింది వెళ్లి స్నాక్స్ ప్రిపేర్ చెయ్యు అని చెప్పి అక్కడినుంచి మిస్సమ్మని పంపించేస్తుంది. తర్వాత డ్రైవర్ దొరికాడా అని అమర్ ని అడుగుతుంది.
అమర్: ఒక్కసారిగా షాకై 2నేను డ్రైవర్ దగ్గరికి వెళ్తున్నట్టు నాకు రాథోడ్ కి తప్ప ఎవరికీ తెలియదు నీకు ఎలా తెలుసు అని నిలదీస్తాడు.
మనోహరికి అప్పుడు తను నోరు జారిన సంగతి గుర్తొస్తుంది ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటుంది.
నీల: నేనే చెప్పాను అయ్యగారు. మీరు మాట్లాడుకోవడం విన్నాను మీరు కంగారుగా బయటకు వెళ్తుంటే ఏం జరుగుతుంది అని మనోహరి అమ్మగారు అడిగారు అప్పుడు జరిగింది చెప్పాను అంటుంది.
రాథోడ్ ఆమెని మందలించి పంపించేస్తాడు. తర్వాత మనోహరితో ఆ డ్రైవర్ తప్పించుకున్నాడు అని చెప్తాడు.
అమర్: తప్పించుకోలేదు తప్పించేశారు. మనం వెళ్తున్న విషయం వాడికి ఎవరో ఇన్ఫామ్ చేశారు అందుకే నేను ఎవరో తెలియకుండానే నన్ను చూసి పరిగెట్టాడు అని చెప్తాడు.
ఎవరై ఉంటారో అంటాడు రాథోడ్.
అమర్: అరుంధతిని చంపమని చెప్పిన వాళ్ళు అంటాడు.
ఆ మాటలకి మనోహరీ ఉలిక్కిపడుతుంది నిజంగానే హంతకుడికి డబ్బు ఇచ్చినప్పుడు అతనిని పారిపోమని హెచ్చరించడం గుర్తు చేసుకుంటుంది.
అరుంధతి: అంత కక్షకట్టి నన్ను చంపవలసిన అవసరం ఎవరికి ఉంది అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.