Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ చేస్తున్న ఆపరేషన్ విషయంలో ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంటారు చిత్ర, మను. వాళ్లిద్దరిని చూస్తూ పక్కనే కూర్చుని ఉంటుంది ఆరు.
ఆరు: ఏదో పెద్ద దేశ సమస్యల గురించి ఆలోచిస్తున్నట్టు మీరు మీ వెధవ ముఖాలు ఎదుటి వాళ్ల నమ్మకాలు కూల్చడం.. నమ్మిన వాళ్ల కొంపలు ముంచడం తప్పా ఏం చేస్తారు మీరు ఊరికే అటూ ఇటూ తిరగడం కాదు ఏదో ఒకటి మాట్లాడి చావండి.
మను: ఏంటి ఏదైనా తట్టిందా..? చిత్ర..
ఆరు: దాని బుద్దికి అసలు ఏం తడుతుంది
చిత్ర: నిన్న రాత్రి అమరేంద్ర బావ భాగీ డిస్కస్ చేసుకున్నారు. పొద్దున్నే రాథోడ్, రణవీర్‌కు కాల్ చేశాడు. భాగీ, రాథోడ్ అనాథ ఆశ్రమానికి వెళ్లారు. రణవీర్, అమర్ బావ ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ అమర్ బావ మీ పాప దొరికింది. రేపటి కల్లా వస్తుంది అని చెప్పిండు.. ఇదే కదా జరిగింది
మను: నేను చెప్పిందే నాకు చెప్తున్నావేంటి నువ్వు
ఆరు: నేను చెప్తుంది అదే కదా దాని బుర్రలో గుజ్జు లేదు..
చిత్ర: నీతో ఫోన్‌లో రణవీర్ ఏం చెప్పాడు అన్నావు.. రేపు పాప రాగానే.. కోల్‌కతా తీసుకెళ్లిపోతాను ఆలోపు నువ్వు వెళ్లి పాపను చూడు అనే కదా
మను: అవును రణవీర్ నాతో అలాగే చెప్పాడుచిత్ర: ఇదంతా ట్రాప్ మనోహరి ( మనోహరి షాక్ అవుతుంది.) అవును నిన్ను పట్టుకోవడానికి అమరేంద్ర బావ వేసిన వల అది.. ఎవరో పాపను తీసుకొచ్చి అది నీ పాప అని చెప్తే నువ్వు చూడటానికి వెళ్తావు కదా అప్పుడు నిన్ను పట్టుకోవచ్చని ఇలా ప్లాన్ చేశారు. నిన్ను టార్గెట్ చేశారు మను.
ఆరు: అమ్మో చిత్ర నువ్వు తింగరిదానివి అనుకున్నాను.. ఈ ఇంటి ఫుడ్ తిని నీకు కూడా తెలివి ఒంటబట్టింది.. బాగానే గెస్ చేశావు
చిత్ర: నిజంగా వాళ్ల ప్లాన్ ఇదే.. రణవీర్ వైఫ్‌గా నిన్ను పట్టుకోవడానికి వాళ్లు ఈ ప్లాన్ చేశారు..
మను: నన్ను పట్టుకోవడానికి అమర్ ఇంత పెద్ద ప్లాన్ వేస్తారని నేను అనుకోలేదు.
ఆరు: ఆహా నీ కడుపు చల్లగుండా.. నువ్వు ఇలాగే అనుకుంటూ ఉండు
చిత్ర: అమరేంద్ర బావ మిలటరీ వాడు మను.. శత్రువును పట్టుకోవడానికి ఇలాంటి ఎత్తులు.. పై ఎత్తులు ఎన్నో వేస్తుంటాడు.
మను: అమరేంద్ర వ్యూహాలన్నీ యుద్దంలోనే మామూలు మనుషుల మీద వాటిని ప్రయోగించడు. అయితే గియితే ఇది భాగీ ప్లానే అయి ఉంటుంది..
ఆరు: ఇద్దరూ కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారు మీ ముఖాలు మండ
చిత్ర: ప్లాన్ ఎవరిదైతే ఏంటి మను ఇరుక్కునేది మాత్రం నువ్వే కదా
మను: భాగీ ఇలాంటి ప్లాన్ చెప్పినా.. అమరేంద్ర ఒప్పుకోడే..
చిత్ర: ఎందుకు ఒప్పుకోడు
మను: ఎందుకంటే అమరేంద్ర ఇంతకంటే హైలెవెల్‌లో ఆలోచిస్తాడు కాబట్టి
చిత్ర: అవును నువ్వు ఓ పెద్ద ఇంటర్ నేషనల్ క్రిమినల్‌వి మరి నీ కోసం పెద్ద స్థాయిలో ఆలోచించడానికి
మను: (కోపంగా) చిత్రా
చిత్ర: ఎందుకు నా మీద అరుస్తున్నావు..మను.. నువ్వు దొరికిపోవడానికి ఈ ప్లాన్ చాలదా..? అసలు ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తున్నావు
అంటూ చిత్ర హెచ్చరించగానే.. నేను ఎలా దొరుకుతాను చిత్ర. చూస్తూ ఆ భాగీ ప్లాన్ తిప్పికొడతాను.. అంటూ మనోహరి లొపలకి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!