గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 08 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 08 Episode)

బాలు మీనా పెళ్లిరోజు వేడుక ఘనంగా జరిగింది. మౌనిక సంతోషంగా ఉంటుందేమో అనే ఆలోచనతో వెనుకే వస్తాడు సంజయ్. వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందర్నీ టార్గెట్ చేస్తాడు. అడుగడుగునా వంకలు పెడుతూ, గొడవ క్రియేట్ చేస్తూ మానసిక ఆనందం పొందుతాడు. అయితే ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వస్తుంటాడు బాలు. మరోవైపు మీనా, శ్రుతి కూడా సంజయ్ కి ఇచ్చిపడేస్తుంటారు. మౌనిక మాత్రం అటు చెప్పలేక, ఇటు మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. తన కుటుంబం అందరితో కలసి మేడపై కూర్చుని సంతోషంగా టైమ్ స్పెండ్ చేసిన మౌనికను చూసి కుళ్లుకున్న సంజయ్ కిందకు పిలిచి మరీ క్లాస్ వేస్తాడు. ఇక్కడ నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో ఇంటికి వెళ్లిన తర్వాత ఇంతకు డబుల్ ఏడిపిస్తానని వార్నింగ్ ఇస్తాడు. మౌనిక ఏదో చెప్పేందుకు ట్రై చేస్తుండగా లోపలకు వెళ్లి రూమ్ డోర్ విసురుగా వేయడంతో మౌనిక చేయి నలిగిపోతుంది. యుద్ధానికి సిద్ధమైన బాలు, రవి, శ్రుతిని ఆపేస్తుంది మీనా. విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు సంజయ్ గాడిపని పట్టాలని ఫిక్సవుతారంతా.

అందరూ కలసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఏం టిఫిన్ వదినా అని అడుగుతాడు రవి. పూరీ కుర్మా అని చెబుతుంది మీనా. నేను ఆయిల్ ఫుడ్ తినను అంటాడు సంజయ్. ఏం తింటావ్ అని అడిగితే.. నాకోసం నేను పిజా ఆర్డర్ చేసుకున్నా అని చెబుతాడు. అందరూ తినే టిఫిక్ కాకుండా మీరొక్కరే ఎందుకు అని మౌనిక చెబుదాం అనుకుని సైలెంట్ గా ఆగిపోతుంది. మీనా పూరీ కుర్మా చాలాబాగా చేస్తుందని చెబుతారంతా. అయినా కానీ తినను అంటాడు సంజయ్. ఇంతలో పిజ్జా వస్తుంది. తీసుకునేందుకు వెళ్లిన బాలు..అక్కడే పిజ్జా ఓపెన్ చేసి దాన్నిండా మొత్తం కారం పోసేస్తాడు. తీసుకొచ్చి తినుబావా అని సంజయ్ కి ఇస్తాడు.

పక్కనే ఉన్న మనోజ్ ని కూడా తినమని అడుగుతాడు సంజయ్. తిండి కనిపించగానే పరిగెత్తే మనోజ్..పూరీ కుర్మా పక్కనపెట్టి పిజ్జా తీసుకుంటాడు. నోట్లో పెట్టుకోవడమే ఆలస్యం..కారం నషాలానికంటుతుంది. పక్కనే ఉన్న రవి, శ్రుతిని చూసి సైగ చేస్తాడు బాలు. మీనా కూడా గమనిస్తుంది. అంతా సైలెంట్ గా నవ్వుకుంటారు. మనోజ్, సంజయ్ కారం పిజ్జా తిని కక్కలేక మింగలేక చూస్తుంటారు. అక్కడి నుంచి పారిపోతాడు మనోజ్. వెనుకే సంజయ్ కూడా వాటర్ బాటిల్ తీసుకుని పరిగెత్తుతాడు. మెట్లపై కూర్చుని ఆపసోపాలు పడతాడు. బాలు, మీనా, రవి, శ్రుతి మాత్రం భలేగా ఎంజాయ్ చేస్తారు.

వీళ్లందరితో ఆడుకోవాలని వచ్చిన సంజయ్...బాలుకి బుక్కైపోతాడు. మౌనికను ఏడిపించినందుకు ఇలా బదులుతీర్చుకుంటారంతా. భలేగా చేశావ్ బాలు అని రవి, శ్రుతి కూడా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి అత్తారింట్లో డాబు ప్రదర్శించబోయి ఇరుక్కున్నాడు సంజయ్. వేడుక సందడి ముగియడంతో సంజయ్-మౌనిక తిరిగి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికెళ్లిన తర్వాత మౌనికను ఏమంటాడో అని మీనా టెన్షన్ పడుతూనే ఉంటుంది. మరి బాలు పెట్టిన భయానికి తగ్గుతాడో లేదంటే మరింత టార్చర్ చేస్తాడో చూడాలి...