Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి తన రూంలోని  క్యాలెండర్‌లో పౌర్ణమిని రౌండప్‌ చేసి ఈసారి నిన్ను వదలను అరుంధతి అని గట్టిగా అరుస్తుంది. ఇంతలో ఆమర్‌ అక్కడికి వచ్చి క్యాలెండర్‌ చూసి పౌర్ణమిని ఎందుకు రౌండప్‌ చేసుకున్నావు అని అడగడంతో ఎవరో స్వామీజీ చెప్పారని పౌర్ణమికి ఆరు పేరు మీద గుడిలో అన్నదానం చేయించాలని గుర్తు కోసం రౌండప్‌ చేశానని చెప్తుంది. మరి అరుంధతిని వదలను అని ఎందుకు అన్నావు అని అడగడంతో తను నన్ను వదిలేసి వెళ్లినా నేను మాత్రం తనను ఎప్పటికీ వదలను అన్నాను అంటూ అమర్‌ ముందు ఎమోషన్‌ అయినట్టు నాటకం ఆడుతుంది. తర్వాత పిల్లలను పడుకోబెట్టి భాగీ తమ రూంలోకి వెళ్తుంటే అమర్‌ వస్తాడు.


భాగీ: మీరెప్పుడు వచ్చారు.


అమర్‌: బుక్‌ క్లోజ్‌ చేసేటప్పుడు వచ్చాను. ఇవాళ జరిగిన దానికి పిల్లలు బయపడ్డారేమోనని చూడటానికి వచ్చాను.


భాగీ: మీరు మా పక్కన ఉండగా ఇక మాకెందుకు భయం. ఏవండి అంజు చైన్‌ తీసేసి టేబుల్‌ మీద పెట్టేసింది.


అమర్‌: సరే లాకర్‌లో పేట్టేయ్‌.


భాగీ: మాట్లాడుతుంటే వెళ్లిపోతున్నారేంటి? మనుషుల మాట వినరా? లేదా మనుషులు అంటే మీకు పడదా?


అమర్‌: మనుషులా ఇక్కడ నేను తప్పా మనుషులు ఎక్కడు ఉన్నారు.


భాగీ: జోక్‌ వేశారా? చాలా బాగుంది.


అమర్‌: లేదు… నిజమే చెప్పాను.


భాగీ: మళ్లీ ఎక్కడికి నేను మాట్లాడటం పూర్తి అవ్వలేదు ఇంకా..


అమర్‌: మ్యాటర్‌ తప్పా మిగతా ముచ్చట్లు అన్ని పెడతావు. చెప్పు


భాగీ: ఈ చైన్‌ అంజుకు ఎక్కడిది..? దుర్గా మాత డాలర్‌  కదండి. కోల్‌ కత్తా వాళ్లు ఎక్కువ వేసుకుంటారు. అంజుకు మాత్రమే ఎందుక ఉంది. మిగతా వాళ్లకు ఎందుకు లేదు. ఏంటండి ఏం మాట్లాడటం లేదు. ఎందుకండి ఈమధ్య ఏదోలా బిహేవ్‌ చేశారు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదండి.  


అమర్:  చెప్పాల్సి వచ్చినప్పుడు అన్ని చెప్తాను మిస్సమ్మ. నువ్వు అడగనివి. నువ్వు అనుకోనివి అన్ని చెప్తాను.


అని అమర్‌ వెళ్లిపోతాడు. మీ బాధని, కష్టాలని అన్ని పంచుకోవాలండి. ఆరోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాను. అనుకుంటుంది భాగీ. తర్వాత గుప్త తన చేతి వేలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఒకవేళ ఆరుకు దొరికే మళ్లీ నన్ను టార్చర్‌ పెడుతుందని భయపడుతూ అటూ ఇటూ చూసి ఇక్కడ ఎక్కడ ఆరు లేదనుకుని ఉంగరం తీస్తాడు. అది జారి పోయి రాథోడ్‌ కాళ్ల దగ్గర పడుతుంది. దీంతో ఇద్దరి మధ్య కామేడీ గొడవ జరుగుతుంది. నా ఉంగరం నాకు ఇవ్వు అని గుప్త అడగ్గానే ఇదేమైనా మాయ ఉంగరమా? అయితే నేను వెంటనే గాల్లో తేలియాడాలి అంటాడు. వెంటనే రాథోడ్‌ పైకి వెళ్తాడు. భయంతో వణికపోతుంటాడు రాథోడ్‌. గుప్త వెంటనే ఆ ఉంగరానికి కిందకు దింపమని చెప్పు దింపేస్తుంది అనగానే రాథోడ్‌ చెప్పగానే జారి కిందపడిపోతాడు. రాథోడ్‌ చేతిలోని ఉంగరం జారి దూరంగా పడిపోతుంది. ఆరు వచ్చి ఉంగరం తీసుకుంటుంది.


గుప్త: అయ్యో నా అంగుళీకము ఎవరి వద్దకు చేరకూడదని అనుకున్నానో వారి వద్దకే చేరింది. అంతా అయిపోయింది ఇక ఆ బాలిక  నా అంగుళీకము నాకు ఇవ్వదు.


ఆరు: గుప్త గారు తీసుకోండి.. ఉంగరం తీసుకుని మళ్లీ మాయం అయిపోండి..


అని ఆరు ఉంగరం గుప్తకు ఇవ్వగానే గుప్త మాయం అవుతాడు. వెంటనే రాథోడ్‌ భయపడతాడు. ఇదంతా నిజంగానే జరిగిందా? లేక మాయ. లేదు మాయే అనవసరంగా ఆ మనోహరి పెట్టిన కాఫీ తాగిన ఇదంతా ఆ కాఫీ మహిమే.. అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: పెళ్లికి ఓకే చెప్పిన గగన్‌ – శోభ కలలోకి వచ్చి నిజం చెప్పిందన్న శరత్‌చంద్ర