Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమంలో ఉన్న సరస్వతి వార్డెన్ అంజుకు జరిగిన ప్రమాదం గురించి టీవీలో చూస్తుంది. అప్పుడు వచ్చిన రాజుతో ఆ విషయం గురించి అడుగుతుంది. రాజు కూడా తనుక విషయం తెలుసని బాధపడతాడు.
వార్డెన్: దేవుడికి దయ లేదు రాజు గారు. ఎంత మంది అనాథల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ కుటుంబానికి ఇంత కష్టమా..? ఆ చిన్న పాపను తలుచుకుంటుంటేనే గుండె తరుక్కపోతుంది.
రాజు: అవును మేడం కొంత మంది మనుషులు స్వార్థంగా ఆలోచిస్తూ.. మారణహోమం సృష్టిస్తూ ఉంటారు. అక్కడ అంత మంది ఉన్నా ఒక్క అమరేంద్ర కుటుంబం మీదే దాడి జరిగింది అంటే కచ్చితంగా ఆ దాడి వెనక మనోహరి హస్తం ఉండే ఉంటుంది
వార్డెన్: ఆ మారణహోమం మనోహరి పనే అయ్యుంటుందా..?
రాజు: ఆ రాక్షసి ఎంతకు తెగిస్తుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఆ దుర్మార్గురాలి ఆగడాలకు అంతే లేకుండా పోతుంది
మనోహరికి వార్డెన్ ఫోన్ చేస్తుంది.
వార్డెన్: ఓసేయ్ రాక్షసి నువ్వు మనిషివేనా..? ఆడదానివేనా..? మారవా నువ్వు
మను: ఎవరు నువ్వు..
వార్డెన్: నేను ఎవరో గుర్తు పట్టలేదా..? నా వాయిస్ గుర్తు రావడం లేదా..?
మను: ఓ వార్డెనా..
వార్డెన్: అవునే నేను వార్డెన్ నే మాట్లాడుతున్నాను నీలాంటి నీచురాలిని దుర్మార్గురాలిని హంతకురాలిని పెంచిన వార్డెన్ ను మాట్లాడుతున్నాను..
మను: ఈ రోజు నేను ఇలా తయారు అవ్వడానికి కారణం నువ్వే కదా వార్డెన్
వార్డెన్: ఈ చేతులతో నిన్నే కాదే.. అరుంధతిని కూడా పెంచాను. తను దేవత అయితే నువ్వు దెయ్యానివి అయ్యావు.. స్నేహితురాలు అని కూడా చూడకుండా అరుందతిని పొట్టన పెట్టుకున్నావు.. ఆ కుటుంబాన్ని అష్టకష్టాల పాలు చేస్తున్నావు.. నీ దుర్మార్గానికి అంతే లేదా.? ఇప్పుడు ఆ చిన్న పాప చావుబతుకుల్లో ఉండటానికి కారణం నువ్వే అని నాకు అనిపిస్తుంది
మను: అనిపించడం ఏంటి వార్డెన్ అదే నిజం
వార్డెన్: నాకు తెలుసే నువ్వే చేసి ఉంటావని.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావు నీ రక్త దాహం ఇంకెప్పటికీ తీరుతుంది.
మను: అవును నేనే అరుంధతిని చంపాను.. ఇప్పుడు ఆంజు చనిపోతే దానికి కూడా నేనే కారణం.. ఇవే కాకుండా నేను ఇంకా ఎన్నో చేశాను అయితే ఏంటి..? నన్నేం చేయగలవు నువ్వు..
అని మను వార్నింగ్ ఇవ్వగానే.. ఇప్పుడే వచ్చి నీ గురించి అమరేంద్రకు నిజం చెప్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది వార్డెన్. వెంటనే హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ మను ఎదురవుతుంది.
మను: ఫోన్‌లో బెదిరిస్తుంటే.. ఏమో అనుకున్నాను.. ధైర్యం చేసి డైరెక్టుగా వచ్చేశావన్న మాట
వార్డెన్: అవును ధైర్యం చేసి వచ్చాను.. ఇక నీకు బెదురుకునే ప్రసక్తే లేదు.. అందుకే ధైర్యంగా వచ్చేశాను. నువ్వు చేసిన పాపాలన్నీ ఈరోజు బయట పెట్టడానికే వచ్చాను.
మను: అవునా ఎవరితో నా విషయాలు బయట పెడతావు.. అసలు నువ్వు చెప్తే వినడానికి అమరేంద్ర ఇక్కడ ఉండాలి కదా..? అమర్ ఎప్పుడో బయటకు వెళ్లిపోయాడు..
వార్డెన్: అమరేంద్ర ఉన్నా లేకపోయినా.. భాగీ ఉంది కదా ఆవిడకు చెప్తాను.
మను: ఆగు ఇప్పుడు నువ్వు అక్కడకు వెళ్లి దానికి నిజాలు చెప్పావంటే నా సంగతి తెలుసు కదా.? తర్వాత నిన్ను చంపేస్తాను..
వార్డెన్: నీ ఇష్టం వచ్చింది చేసుకో.. నువ్వేం చేసినా ఇవాళ నేను వాళ్లకు నిజం చెప్పి తీరుతాను..
అంటూ వార్డెన్ ఐసీయూ దగ్గరున్న భాగీ దగ్గరకు వెళ్తుంది. భాగీతో మాట్లాడుతుంది. అంతా దూరం నుంచి చూస్తున్న మనోహరి కోపంగా చూస్తుంటుంది. వార్డెన్ చెప్పిన విషయాలు వింటూ భాగీ షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!