Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి థాంక్స్‌ చెప్పగానే రణవీర్‌కు తన కూతురు గుర్తుకువస్తుంది. నిన్ను చూస్తుంటే నా దుర్గను చూస్తున్నట్లు ఉందమ్మా అని రణవీర్‌ చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. తను ఇప్పుడు ఎక్కుడుంది. తన ఫోటో ఉందా? మీ దగ్గర అని అంజు అడగడంతో మనోహరి ఇంకా టెన్షన్‌ పడుతుంది. ఇంతలో మీ అమ్మాయి కూడా మాలాగే తల్లి లేకుండా పెరుగుతుందా? అని అంజు అడగ్గానే మీ అమ్మతో నా భార్యను పోల్చోద్దని మీ అమ్మా చాలా మంచిదని నా భార్య అలాంటిది కాదని చెప్తాడు రణవీర్‌. దీంతో పిల్లలు అందరూ కలిసి రణవీర్‌ను లోపలికి తీసుకెళ్తారు.


శివరాం: అమర్‌ నీకోసం రణవీర్‌ గారు వచ్చారు..


అమర్‌: ఆ వస్తున్నా నాన్నా..


రణవీర్‌: నమస్తే అమరేంద్ర గారు.


అమర్‌: నమస్తే రణవీర్‌ గారు.


రణవీర్‌: ఇలా మళ్లీ మళ్లీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లున్నాను. పక్కనే వేరే పని ఉండి వచ్చాను. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను.


అమర్‌: ఇబ్బందేం లేదు రణవీర్‌.


రణవీర్: ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను కదా సార్‌  ఇక్కడికి వస్తే నా వాళ్లను చూసినట్టే ఉంటుంది. అందుకే కారణం దొరకగానే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను.


నిర్మల: నీ భార్య ఇంకా దొరకలేదా? బాబు.


రణవీర్: లేదమ్మా.. రోజులు గడిచే కొద్దీ నాకు కావాల్సింది నాకు దొరుకుతుందన్న నమ్మకం చచ్చిపోతుంది.


   అంటూ రణవీర్‌ ఎమోషన్‌ గా ఫీలవుతుంటాడు. దీంతో భాగీ, రణవీర్‌ను ఓదారుస్తుంది. ఇంతలో అమర్‌, రణవీర్‌ను మీది కోల్‌కతా అన్నారు కదా? అక్కడ మథర్‌ థెరిస్సా ఆశ్రమం గురించి తెలుసా? అని అడగ్గానే రణవీర్‌ తెలుసని ఆ ఆశ్రమానికి ప్రతి సంవత్సరం డొనేట్‌ చేస్తుంటాను అంటాడు. దీంతో అమర్‌ మౌనంగా ఉండిపోతాడు. అమర్‌, రణవీర్‌తో పర్సనల్‌ గా మాట్లాడాలని బయటకు వెళ్తాడు.


రణవీర్‌: అమరేంద్రజీ చెప్పండి.


అమర్‌: నాకు కోల్‌కత్తాలో ఒక చిన్న పని ఉంది రణవీర్‌ అది చాలా ముఖ్యమైనది.


రణవీర్‌: చెప్పండి జీ అక్కడ మన వాళ్లు ఉన్నారు.


అమర్‌: ఒకరి గురించి సమాచారం తెలుసుకోవాలి.


   అని అడగ్గానే పైనుంచి చాటుగా వింటున్న మనోహరి టెన్షన్‌ పడుతుంది. అమర్‌ నా గురించే అడగబోతున్నాడా? అని భయపడుతుంది. రణవీర్‌ చెప్పండి సాయంత్రం కల్లా కనుక్కుని చెప్తాను అంటాడు. అయితే మీరు మీ పనిలో ఉన్నారు. అక్కడి ఎవరితోనైనా నాకు కనెక్ట్‌ చేయండి అని అమర్‌ అడగ్గానే రణవీర్‌ సరే అంటాడు. తర్వాత వెళ్లబోతూ.. అంజును పిలిచి డబ్బులు ఇచ్చి హగ్‌ చేసుకుని వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిన రణవీర్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు.


లాయర్‌: ఏమైంది రణవీర్‌ ఎందుక ఏడుస్తున్నావు.


రణవీర్‌: ఆ పాపను చూస్తుంటే నా దుర్గ గుర్తుకు వస్తుంది. నా దుర్తను నాకు దూరం చేసిన ఆ మనోహరిని వదిలిపెట్టను


   అంటూ ఆవేశంగా వెళ్లిపోతాడు. మరోవైపు ఆరు, అమర్‌ రాసిన డైరీ గురించి ఆలోచిస్తుంది.  ఇంతలో గుప్త రాగానే నా కన్నవాళ్ల గురించి తెలుసుకోవాలి. మిస్సమ్మ అక్క గురించి తెలుసుకోవాలి. అంజు కన్నవాళ్ల గురించి తెలుసుకోవాలని అంటుంది. దీంతో ఫ్లోలో గుప్త ఒక్కటి తెలిస్తే అన్ని తెలిసినట్లే అంటాడు. దీంతో ఆరు ఏమన్నారు అని అడగ్గానే తేరుకున్న గుప్త నేనేమీ అనలేదు అంటాడు. ఇంతలో ఆరు కిచెన్‌ లోకి వెళ్లి కిచెన్‌లో ఇవన్నీ ఎవరు సర్దారు. అని అడుగుతుంది. దీంతో భాగీ నువ్వు ఇంటి కోడలిగా మాట్లాడుతున్నావేటి? అని అడగ్గానే ఆరు తేరుకుని మాట మారుస్తుంది. నీ కూరలు బాగా స్మెల్‌ వస్తున్నాయని అని భాగీని మాటల్లో పెట్టి  ఆరు గురించి మీ ఆయన తెలుసుకున్నారా? అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి నిజం చెప్పిన చెర్రీ – గగన్ కు గతం గుర్తు చేసిన భూమి