Nindu Noorella Saavasam Serial Today Episode:  పిల్లలు తాతయ్యా మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. పిల్లల్ని చూడటానికి వచ్చాను అంటాడు. ఇంటికి రావొచ్చు కదా అని అడగ్గానే నేను అక్కడికి వస్తే మీరు నన్ను మొహమాట పెడతారని చెప్తూ.. నువ్వెందుకు వచ్చావమ్మా అని భాగీని అడుగుతాడు రామ్మూర్తి. కొందరు చేసిన తప్పు సరిదిద్దడానికి వచ్చాను అంటుంది. ఇంతలో పిల్లలు క్లాస్‌రూంలోకి వెళ్తారు. మరోవైపు కారులో వెళ్తున్న అమర్‌ భాగీ మాటలు గుర్తు చేసుకుంటాడు.


అమర్: గోల్‌ ఏమీ లేదంటుంది. అసలు గోలే లేని మనిషి ఉంటాడా? ఏదో రెండు సార్లు అనుకున్నది జరగలేదని గోలే లేదని అంటే ఎలా? కనీసం చిన్న కోర్కెలు ఉంటాయి కదా? అవైనా చెప్పాలి కదా?


రాథోడ్‌: సార్‌ ఏమీ అనుకోకండి ఈ గోల్‌ గోల ఏంటి సార్‌.


అమర్: అంటే ఏంటి? రాథోడ్‌ గోల్‌ ఉండటం గోలనా..?


రాథోడ్‌: అయ్యోయ్యో నేను అలా అనలేదు సార్‌. అంటే ఎవరికి గోల్‌ లేదని మీరు గోల చేస్తున్నారు అని అడుగుతున్నాను.  


అమర్: ఇంకెవరి గురించి అంటాను ఉంది కదా నా లైఫ్‌లో ఒక లూజ్‌. మిస్సమ్మకే..


రాథోడ్‌: పెళ్లైన ఆడపిల్లకు భర్తను ప్రేమగా చూసుకోవడం తప్పా పెద్దగా గోల్‌ ఏముంటుంది సార్‌.


అమర్‌: ప్రతి ఒక్కరికీ ఒక గోల్‌ ఉంటుంది. ఉండాలి. మిస్సమ్మకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలని తన గోల్‌ ను పక్కన పెట్టేసింది. అదేంటే కనుక్కుని వెంటనే నెరవేర్చాలి.


రాథోడ్: సార్‌ చిన్న డౌటు భార్యగానా.. లేదంటే భార్య చెల్లెలుగానా..? సార్‌.   


అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. మరోవైపు భాగీ, రామ్మూర్తిలు ప్రిన్సిపాల్‌ రూంలోకి వెళ్తారు. వాళ్లను చూసి ప్రిన్సిపాల్‌ భయపడుతుంది.


భాగీ: ప్రిన్సిపాల్‌ గారు మీతో మాట్లా్డ్డానికి అని వచ్చి ఇంత సేపు అయింది. మీరేం మాట్లాడరేంటి?


ప్రిన్సిపాల్‌: అది చెప్పాల్సింది మీరు.


భాగీ: మీరు ఫ్రీగా ఉన్నారంటే మాట్లాడతాము.


ప్రిన్సిపాల్‌: నేను కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడదాం.


భాగీ: టైం లేదు మేడం. ఇప్పుడే మీతో మాట్లాడాలి.


   అనగానే ప్రిన్సిపాల్‌ భయపడుతుంది. రామ్మూర్తితో సొంత పనులు చేయించుకుంటానని భాగీకి తెలిసిపోయినట్టుందని మనసులో అనుకుంటూ ఏదేదో మాట్లాడుతుంది. దీంతో రామ్మూర్తి ప్రిన్సిపాల్ గారు నా కూతురు మాట్లాడటానికి వచ్చింది అంజలి పాప గురించి అని చెప్పగానే ప్రిన్సిపాల్‌ కూల్‌ అవుతుంది. అంజలి ఇంకొక్కసారి ఆఫ్సెంట్‌ అవ్వకుండా చూసుకో అని చెప్పగానే అంజలి షాక్‌ అవుతుంది. ఇంకేమీ అనరా? అంటూ క్లాస్‌ లోకి వెళ్తుంది.  మరోవైపు ఇంట్లో శివరాం, నిర్మల టీ తాగుతుంటారు. ఇంతలో శివరాం మనోహరిని టీ తీసుకురా అని అడుగుతారు.


మనోహరి: అబ్బా అమర్‌ ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహారాణిని అవుదామనుకుంటే ఈ ముసలోళ్లు ఇద్దరు కలిసి నన్ను పనిదాన్ని చేసేలా ఉన్నారు. పెళ్లి కాగానే ఈ ముసలోళ్లను కాళ్లు విరగొట్టి మూలన కూర్చోబెట్టాలి.


ఆరు: ఈ ఇంటిని నిన్ను తీసుకొచ్చి నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కదే.. ఇంత చేస్తున్నా వాళ్లు ఒక్కగ్లాసు నీళ్లు అడిగినందుకు ఇంతలా తిట్టుకుంటావా? నాకు కనక ప్రాణం ఉంటేనే నా కాలు అడ్డుపెట్టేదాన్ని


 అంటూ వెళ్లి కాలు అడ్డం పెట్టగానే మనోహరి కిందపడిపోతుంది.


మనోహరి: అసలు నేను కింద ఎలా పడ్డాను.


ఆరు: అంటే మను కింద పడింది నా కాలు తగిలేనా..?


నిర్మల: అదేంటమ్మా అలా కిందపడ్డావు.


శివరాం: చూసుకోని నడవాలి కదమ్మా..


మనోహరి: మీరు వాటర్‌ అడిగే సరికి కంగారుగా తీసుకొస్తూ కింద పడ్డాను అంకుల్‌. కానీ ఎలా పడ్డాను.


నిర్మల: అమ్మా మనోహరి కాలుకు ఏమైనా దెబ్బ తగిలిందా?


మనోహరి: ఏం లేదు ఆంటీ. నేను బయటకు వెళ్లాలి వస్తాను.


   అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆరు మాత్రం అసలు ఇదెలా సాధ్యం అయింది. మొన్న కూడా కొబ్బరి బొండం పడాలి అంటే పడిపోయింది. అసలు నిజంగా జరిగిందా? లేక పొరపడుతున్నానా? అనుకుని డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్లి గ్లాస్‌ చేత్తే పట్టుకుని షాక్‌ అవుతుంది. గాల్లోకి లేచిన గ్లాస్‌ ను చూసి శివరాం షాక్ అవుతాడు. తర్వాత ఆరుకు స్పర్శ వచ్చిందనే విషయం తెలియకుండా చేయాలని గుప్త ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఆరు అక్కడకు వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: దొంగతనం మీదేసుకున్న చెర్రి – భూమిని క్షమించమన్న శరత్‌చంద్ర