Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలు ముగ్గురు భాగీ దగ్గరకు వెళ్లి అంజు నీ దగ్గరకు హెల్ప్‌ అడగడానికి వస్తుందని నువ్వు ఒప్పుకోవద్దని చెప్తారు. దీంతో నేను ఇంట్లో వాళ్ల ప్రేమను గెలవాలనుకుంటాను కాబట్టి అలా పోట్లాడతా అని భాగీ చెప్పగానే పిల్లలు అందరూ ఎమోషన్‌ అవుతూ నిజంగా మా అమ్మలాగే ఉంటావు. మా అమ్మలాగే మాట్లాడతావు. నువ్వొచ్చాక అమ్మ లేదనే బాధ కొంచెం తగ్గింది అంటారు.


భాగీ: సరే అమ్ము నువ్వు నేను కలిసి సండే ఎవరికీ తెలియకుండా పార్లర్‌కు వెళ్దామా..?


అమ్ము: పార్లర్‌ ఏంటి మిస్సమ్మ..


భాగీ: అదే సండే ఆప్టర్‌ నూన్‌ ఈ లేజీ బాయ్స్‌ పడుకున్నాక.. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు ఆరు అక్కా పార్లర్‌ కు వెళ్లే వారట కదా?


అమ్ము: ఆ విషయం నీకెలా తెలుసు మిస్సమ్మ. నాకు మా అమ్మకు తప్ప ఎవరికీ తెలియదు. ఆఖరికి డాడీ వాళ్లకు కూడా తెలియదు. అసలు ఎవరు చెప్పారు నీకు.


భాగీ: పక్కింటి అక్క చెప్పింది.


అమ్ము: ఆవిడకు ఎలా తెలిసింది.


భాగీ: ఆవిడ ఆరు అక్క ఫ్రెండ్స్‌ అంట అమ్ము. ఎప్పుడో మాటల్లో చెప్పిందేమో


అమ్ము: అమ్మ ఎవరికీ చెప్పే చాన్సే లేదు మిస్సమ్మ ఎందుకంటే అది మా ఇద్దరి సీక్రెట్‌ అని అమ్మే చెప్పేది.


అని చెబుతూ అసలు ఆ పక్కింటి అవిడ ఎలా ఉంటారని పిల్లలు అడుగుతారు. మిస్సమ్మ పోలికలు చెప్పగానే మేము అడిగింది పక్కింటి ఆవిడ  పోలికలు మా అమ్మ పోలికలు కాదని అంటారు ఇంతలో బయట అంజు ఏం చేస్తుందో చేద్దాం పదండి అని బయటకు వస్తారు. బయట అంజు తన మాటలతో అమర్‌ను కాకా పడుతుంది. తన యాక్టింగ్‌ తో అదరగొడుతుంది.


అమ్ము: మిస్సమ్మ ఇది ఓవర్‌ గా మాట్లాడుతుంది.


భాగీ: దీనికంతటికి ఓవర్‌ కంపెన్సీట్‌ చేద్దాం అమ్ము.


అంజు: డాడ్‌ కాళ్లు నొప్పిగా ఉన్నాయా..? పట్టమంటావా?


అమర్‌: అంజు వద్దు అమ్మా..


అంజు: ఒళ్లు నొప్పిగా ఉందా డాడ్‌..  పడతాను ఏమీ అనొద్దు డాడ్‌. అమ్మో నా మాటలు వినేసినట్టున్నారు..బెటాలియన్‌ అంతా వచ్చారు అంటే నా ప్లాన్‌ అంతా ప్లాప్‌ చేస్తారు. ( అని మనసులో అనుకుంటుంది.)


భాగీ: పిల్లలు అంజు పాపను చూసి ఎలా రెస్పాన్స్‌బులుగా ఉండాలో చూసి నేర్చుకోండి. పొద్దునే లేచినప్పటి నుంచి ఎంత పని చేస్తుంది.


అమ్ము: అంత చేసింది అంటే ఎంత అవసరం ఉందో


అమర్: ఏంటి అమ్మా ఏదో అంటున్నావు.


అంజు: డాడ్‌ నన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది అన్నది. అంటే లైక్‌ ఓవర్‌ హ్యపీనెస్‌ డాడ్‌ . అంతే కదా అమ్ము.


అమ్ము: అంతే అంతే చాలా ఓవర్‌ గానే ఉంది


అంటూ పిల్లలు ముగ్గురు కలిసి అమర్‌ దగ్గర అంజును ఇరికిస్తారు. ఏం చెప్పాలో తెలియక అంజు తల బాదుకుంటుంది. ఏడుస్తుంది. ఇంట్లో ఉంటే డాడ్‌ తిడతాడు. స్కూల్‌ కు వెళ్దామంటే ఆ రాక్షసి రానివ్వదు అని బాధపడుతుంటే అందరూ వెళ్లిపోతారు. మరోవైపు బయట కారు తుడుస్తూ ఉన్న రాథోడ్‌కు బాల్‌ వచ్చి తగులుతుంది.  పిల్లలు బాల్‌ అడగ్గానే తిడుతూ ఆ బాల్‌ ఇస్తాడు.


   అలాగే రెండు సార్లు బాల్‌ రాథోడ్ మీదకు రాగానే మూడోసారి బాల్‌ ను మిస్సమ్మ ఉన్నవైపు విసిరుతాడు. మిస్సమ్మ పట్టకుంటుంది. దీంతో రాథోడ్‌ షాక్‌ అవుతాడు. బాల్‌ గాల్లో ఆగిందేంటి అనుకుంటాడు. ఆరు కూడా షాక్‌ అవుతుంది. బాల్‌ తిరిగి రాథోడ్‌కు విసురుతుంది. భయంతో రాథోడ్‌ కారు లోపలికి వెళ్లి కూర్చుంటాడు. గుప్త ఆలోచిస్తుంది. ఇంతలో ఆరు అనుమానంతో నేను బాల్‌ ఎలా పట్టుకోగలిగాను అని గుప్తను అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం