Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ ఇంట్లో పాలు ఎర్రగా మారడంతో ఇంట్లో వాళ్లు ముఖ్యంగా అమర్‌, భాగీ ఎంతలా భయపడ్డారో చెప్పుకుని మను, రణవీర్‌, చంభా సంతోషంగా ఫీలవుతారు.

మను: శభాష్‌ చంభా నీ పాచిక పవర్‌ఫుల్‌గా పారింది

రణవీర్‌: అవును చంబా నీ రీ ఎంట్రీ అదిరిపోయింది

చంభా: చెప్పాను కదా రణవీర్‌ ఈ సారి నేను ఆ ఆత్మ అంతు చూసే వెళ్తానని

మను: తెల్లటి పాలు ఎర్రగా మారడం చూసి ఆ భాగీ వణికిపోయింది. అమరేంద్ర లో కూడా కంగారు వచ్చేసింది. పిల్లలు కూడా చూసి ఉంటే సీన్‌ వేరే లెవెల్‌ లో ఉండేది.

రణవీర్‌: నెక్ట్‌ లెవెల్‌ లో ఆ ఇంట్లో రక్తం పారాలి మనోహరి

చంభా: అరే నేను అదే అనుకుంటున్నాను రణవీర్‌.. ఇప్పుడు తెల్లటి పాలు ఎర్రగా మారాయి.. ఈసారి ఎర్రటి రక్తమే పారేలా చేస్తాను

మను:  ఎవరి రక్తం..? కొంపదీసి పిల్లల రక్తం అయితే కాదు కదా

రణవీర్‌:  ఏం పిల్లలది అయితే ఏమైనా ప్రాబ్లమా..?

మను: పిల్లలకు ఏదైనా అయితే అమర్‌ రియాక్షన్‌ వేరేలా ఉంటుంది. ఆరు ఆస్థికలు గంగలో కలపడం మాని పిల్లల జోలికి వచ్చింది ఎవ్వరా అని ఎంక్వైరీ మొదలు పెడితే  మనం దొరికిపోతాము

చంభా: మరి ఎవరి రక్తం పారించమంటావు మనోహరి చెప్పు

మను: ఆ భాగీ రక్తం పారించాలి. అదే ఎఫెక్ట్‌ అవ్వాలి. దాని రక్తం నేను కళ్లారా చూడాలి..

రణవీర్‌:  మనోహరి ఇన్నాళ్లు ఆ ఇంట్లోనే ఉన్నావు.. నువ్వు భాగీని ఏమీ చేయలేకపోయావు కదా..?

చంభా: భాగీని మనోహరి ఏమీ చేయనవసరం లేదు రణవీర్‌. నీ చేతికి నా చేతికి  ఆ రక్తం అంటనవసరం లేదు

మను: మరి భాగీ  పని ఎవరు చూస్తారు.. దాని అంతం ఎవరు చూస్తారు

చంభా: అందుకు నా దగ్గర ఒక పథకం ఉంది

అంటూ ప్లాన్‌ చెప్తుంది చంభా. చంభా ప్లాన్‌ అద్బుతంగా ఉందని రణవీర్‌, మను చెప్తారు.

రణవీర్‌:  సూపర్‌ చంభా ఈసారి నీ బ్రెయిన్‌ బ్రహ్మండంగా పని చేస్తుంది. ఈసారి నీ ప్లాన్‌కు తిరుగే లేదు

మను: మనం ఈ ప్లాన్‌ ముందే చేసి ఉంటే మనకు ఈ టైం కలిసి వచ్చేది కదా

చంభా: ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు మాత్రమే జరుగుతుంది మనోహరి

మను: కానీ ఈ ప్లాన్‌ ఇప్పుడే వద్దు.. కాస్త గ్యాప్‌ ఇద్దాం.. అన్ని వెంట వెంటనే జరిగితే అమర్‌కు అనుమానం వస్తుంది.

రణవీర్‌:  కరెక్టు మనోహరి.. ఆ ఇంట్లో ఎవరికీ డౌటు రాకుండా.. చాలా ప్లాన్డ్‌గా అమలు చేయాలి

మను: అది ఎప్పుడు చేయాలో నేను చెప్తాను చంభా నువ్వు అప్పటి వరకు రెడీ ఉండు

చంభా: మీరు ఎప్పుడు చెప్పినా నేను రెడీ.. నా గురి ఆ ఆత్మ.. దాన్ని నాతో పట్టుకెళ్లడమే నా లక్ష్యం

అని చంభా చెప్పగానే రణవీర్‌, మనోహరి నవ్వుకుంటారు. ఇక తమ ఇంట్లో పాలు ఎర్రగా మారడంపై అమర్‌ ఎంక్వైరీ మొదులు పెడతాడు. పాలవాణ్ని తన ఆఫీసుకుని పిలిపించుకుని విచారిస్తుంటాడు. పాలవాణ్ని రాథోడ్‌ కొడుతూ నిజం చెప్పమని అడిగితే నాకేం తెలియదు సార్‌ అని చెప్తాడు. ఇంతలో అమర్‌ వచ్చి ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని అడగ్గానే.. ఒకతను వచ్చి తనను కారు తోయమని అడిగింది చెప్తాడు. అతను ఎలా ఉంటాడని అమర్ అడగ్గానే.. ఎత్తుగా జమీందారులా ఉంటాడని పాలవాడు చెప్పగానే.. అమర్‌ తన ఫోన్ లో ఉన్న రణవీర్‌ ఫోటో చూపిస్తాడు. పాలవాడు ఇతనే సార్‌ అని చెప్పగానే అమర్‌, రాథోడ్‌ షాక్‌ అవుతారు. ఇదంతా రణవీర్‌ చేయడం లేదని తన భార్య వెనక నుంచి రణవీర్‌తో చేయిస్తుందని అమర్‌ అంటాడు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!