Nindu Noorella Saavasam Serial Today Episode: టపాసుల కాల్చడం దగ్గరో.. దీపాల దగ్గరో భాగీ శారీకి నిప్పు అంటుకుని చనిపోయేలా చేస్తుంది. మనోహరి. అనుకున్నట్టుగానే భాగీ శారీకి మండే కెమికల్‌ను స్ర్పే చేస్తుంది. అదే శారీని కట్టుకుని భాగీ బయటకు వచ్చి టపాసులు కాలుస్తుంది. అయితే భాగీ చీరకు ఎలాగైనా మంటలు అంటుకునేలా చేయాలనుకున్న మనోమరి అమ్మును పిలిచి గేటు దగ్గర దీపాలు పెట్టమని చెప్తుంది. అలాగేనని వెళ్తుంటే వెనకే వెళ్లిన చంభా తన కాలితో అమ్ము కింద పడేలా చేస్తుంది. అమ్ము కింద పడగానే.. అమ్ము చేతిలో ఉన్న దీపాలు వెళ్లి భాగీ శారీకి అంటుకుంటాయి. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అమర్‌ మాత్రం వెంటనే భాగీని కాపాడి లోపలికి తీసుకెళ్తాడు. తర్వాత భాగీ కట్టుకున్న శారీ తీసుకొచ్చి రాథోడ్‌కు ఇస్తాడు.

Continues below advertisement

అమర్‌: రాథోడ్‌ ఈ శారీని తీసుకెళ్లి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇవ్వు..

రాథోడ్‌: ఏమైంది..? శారీని ఎందుకు ల్యాబ్‌లో ఇవ్వాలి..

Continues below advertisement

అమర్‌: ఈ శారీతోనే భాగీని చంపాలని చూశారు. చాలా ప్లాన్డ్ గా వ్యవహరించారు.

అని అమర్‌ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. మనోహరి భయంతో వణికిపోతుంది.

భాగీ: ఈ శారీతో నన్ను చంపడం ఏంటండి..?

అమర్‌: అవును భాగీ ఈ శారీకి ఎవరో మండే స్వభావం ఉన్న కెమికల్‌ ను అప్లై చేశారు. దీంతో ఆ చీరకు మంటలు అంటుకోగానే చాలా స్పీడుగా మంటలు మొత్తం కమ్మేశాయి. టైంకు నేను అలెర్ట్‌ అయ్యాను కాబట్టి సరిపోయింది లేదంటే.. పరిస్థితి మరోలా ఉండేది.

భాగీ: అయినా ఈ శారీ నా ర్యాక్‌లో నేను ఎలా పెట్టానో అలాగే ఉంది. కనీసం ఎవరూ తీసిన జాడ కూడా కనిపించడ లేదు.. కదండి..

అమర్: చాలా ప్లాన్‌గా ఈ శారీని జాగ్రత్తగా ర్యాక్‌ లోంచి బయటకు తీశారు.. అంతే జాగ్రత్తగా స్ర్పే చేసిన తర్వాత తిరిగి పెట్టేశారు.

భాగీ: అయినా నన్ను చీరతో నన్ను చంపేంత పగ, కోపం ఎవరికి ఉంటుందండి..

అమర్‌: అదే తెలుసుకోవాలి భాగీ.. కానీ ప్రీప్లాన్డ్‌ గా నిన్ను ఫైర్‌ యాక్సిడెంట్‌ లో చంపేసి అది నాచురల్‌ డెత్‌గా క్రియేట్‌ చేయాలని చూశారు. కానీ మనం జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ప్రమాదం తప్పింది.

అంటూ అమర్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

రాథోడ్‌: సార్‌ ఈ శారీ ల్యాబ్‌ లో ఇవ్వడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.

అమర్‌: ఉంటుంది రాథోడ్‌.. ఆ స్ప్రే చేసిన వ్యక్తుల ఫింగర్‌ ఫ్రింట్స్‌ ఈ శారీ మీద ఉన్నాయి. అందుకే ఇంట్లో వాళ్ల ఫింగర్‌ ఫ్రింట్స్‌ తీసుకుని వాటిని కూడా శారీతో పాటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిచాలి. సో అందరూ మీ ఫింగర్‌ ఫ్రింట్స్‌ ఈ పేపర్స్‌ మీద ఇవ్వండి

అంటూ అమర్‌ చెప్పగానే.. మనోహరి, చంభా భయపడిపోతారు.. పిల్లలు, రాథోడ్‌ ఒక్కొక్కరుగా వచ్చి ఫింగర్‌ ‌ఫ్రింట్స్‌ ఇస్తారు. మనోహరి, చంభా భయంతో అలాగే నిలబడి చూస్తుంటారు.

రాథోడ్‌: మనోహరి గారు మీరు వచ్చి ఫింగర్‌ ఫ్రింట్స్‌ ఇవ్వండి.. యాదమ్మ నువ్వు కూడా రా వచ్చి ఇక్కడ నీ వేలి ముద్రలు వేయి

అంటూ రాథోడ్‌ చెప్పగానే.. మనోహరి, చంభా భయపడుతుంటారు. ఫింగర్‌ ఫ్రింట్స్‌ ఇవ్వలా వద్దా అని ఆలోచిస్తుంటారు. అమర్‌ ఏమైంది మనోహరి అంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!