Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ కంకణాలు కట్టుకుని పూజ పూర్తి చేస్తారు. తర్వాత బిక్ష తీసుకుని దీక్ష విరమించాలని భాగీ చెప్పగానే సరేనని అందరూ భోజనం చేస్తుంటారు. ఇంతలో రామ్మూర్తి రేపు పొద్దున్న నేను భాగీ కావడి కట్టుకుని గుడికి వస్తామని.. మీరు నేరుగా వచ్చేయండి అని చెప్పడంతో అమర్ తాము కూడా కావడి కడతామని అడుగుతాడు. అది చాలా కష్టమని ఇప్పటికే మీరు చాలా శ్రమ పడ్డారని అంటాడు రామ్మూర్తి. లేదని రేపు అందరం కావడి కడదామని అనుకుని భోజనం చేస్తారు. మరోవైపు మనోహరి, ఘోర మాట్లాడుకుంటుంటారు.
ఘోర: అదే జరిగింది అంటే ఆ ఆత్మను బంధన చేయలేం మనోహరి. కావడి కట్టి గుడికి వెళ్లారో దీక్ష పూర్తి అవుతుంది. అప్పుడు ఇక ఏం చేసినా ఆత్మను బంధించలేం.
మనోహరి: ఇదంతా ఆ తండ్రీ కూతుళ్ల వల్ల జరిగింది. వాళ్లే దీక్ష అనకుండా ఉండి ఉంటే ఈ పాటికి అది ఇంట్లోంచి అమర లైఫ్ లోంచి వెళ్లిపోయి ఉండేది. వాళ్లు అనుకున్నది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఘోర.
ఘెర: కావడి ఎత్తకుండా ఆపాలి. వాళ్ల దీక్షకు భంగం కలిగించాలి.
మనోహరి: కానీ ఎలా ఏదో శక్తి వాళ్లను కాపాడుతుందే..
అని మనోహరి అడగ్గానే వారిలో ఒకరు చస్తే.. అప్పుడు కూడా దీక్ష అని మడి కట్టుకుని కూర్చుంటారా..? అని ఘోర చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. తర్వాత హ్యాపీగా ఫీలవుతుంది. సీసాలో ఉన్న ఆరు.. ఘోరాను తిడుతుంది. దీంతో ఘోర నీతోనే ఆ ముసలాడను చంపేస్తానని ఘోర చెప్పగానే మనోహరి ఆ ముసల్ది చస్తుందంటేనే నాకు ఎంతో సంతోషంగా ఉందని హ్యాపీగా ఫీలవుతుంది. ఘోర గేటు దగ్గరే కూర్చుని ఏవేవో మంత్రాలు చదువుతుంటాడు.
ఆరు: నీకు దండం పెడతా ఘోర ప్లీజ్.. అతయ్య నన్ను అమ్మలా చూసుకుంది. ఆవిడను ఏం చేయవద్దు. మామయ్య.. అత్తయ్య లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు.
ఘోర: ఏయ్… ఈ ఘోర ఏం చేయగలడో ఏం చేస్తాడో అందరికీ చూపించాల్సిన సమయం వచ్చింది. ఈ ఘోర వచ్చాడన్న సంకేతం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది.
అంటూ మంత్రించి సీసాను ఓపెన్ చేయగానే ఆరు ఆత్మ బయటకు వచ్చి ఇంట్లోంకి వెళ్లి నిర్మల లోకి దూరుతుంది. బయట ఘోర ఏం చెప్తే లోపల నిర్మల అది చేస్తుంది. నిర్మలను మెట్లు ఎక్కి మేడ మీదకు రమ్మని చెప్తాడు. నిర్మల మేడ మీదకు వెళ్తుంది. అదంతా పసిగట్టిన గుప్త షాక్ అవుతాడు. మేడ మీదకు వెళ్తున్న నిర్మలను మనోహరి చూసి ఆనందపడుతుంది.
మనోహరి: పాపం తెల్లారేసరికి ఈ ముసల్దాని బతుకు తెల్లారిపోతుంది.
గుప్త: ఆ ఘోర దుష్ట ఆలోచనలతో బాలిక ఆత్మను వశపరుచుకుని ఈ శరీరాన్ని ఆవహించేలా చేశాడు. ఇప్పుడు ఈ శరీరానికి ఏ హాని తలపెట్టదలిచాడో..
ఘోర: అక్కడి నుంచి కిందకు దూకేయ్..ఏంటి ఆలోచిస్తున్నావు.. కిందకు దూకేయ్.. నీ బంధాల సంకెళ్లు తెంచుకుంటూ కిందకు దూకు.
గుప్త: జగన్నాథ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నన్ను నిస్సహాయుడిగా నన్ను ఈ భూలోకమున ఎందుకు ఉంచినావు. ఈ పరిస్థితిని నువ్వే చక్కదిద్ద వలెను..
ఘోర: పైలోకాలకు వెళ్లేందుకు కిందకు దూకేయ్..
అనగానే గుప్త ఘోరాను తిడుతుంటాడు. ఇంతలో భాగీ వచ్చి నిర్మలను కాపాడుతుంది. చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది. అత్తయ్యా అని పిలవగానే ఉలిక్కిపడి స్పృహలోకి వస్తుంది. ఎందుకు ఇక్కడి నుంచి దూకుతున్నారు అని అడగ్గానే నిర్మల షాకింగ్ గా నేను మేడ మీదకు ఎలా వచ్చాను అంటూ భయపడుతుంది. ఆరు ఆత్మ మళ్లీ సీసాలోకి వెళ్లిపోతుంది. ఘోర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిర్మల ఏడుస్తుంది. భాగీ ఓదార్చి కిందకు తీసుకెళ్తుంది. మరుసటి రోజు పూజ చేసి అందరూ కావడి ఎత్తుకుని వెళ్తుంటే.. గార్డెన్ లో ఉన్న గుప్త చూసి హ్యాపీగా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!