Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ బాధగా ఉంటాడు టిఫిన్‌ చేయకుండా ఆలోచిస్తుంటాడు. ఏమైందని అందరూ అడగ్గానే ఏమో జరుగుతుంది. నా మనసు ఏం బాగాలేదు. ఆరు బతికున్నప్పుడు ఇలాగే  అనిపించింది. అని బాధగా టిఫిన్‌ చేయకుండా వెళ్లిపోతాడు. మరోవైపు రణవీర్‌  ఇంటికి వెళ్లిన మనోహరిలో ఉన్న ఆరు ఆత్మ అక్కడ తీక్షణంగా చూస్తుంటుంది. ఇంతలో రణవీర్‌ వస్తాడు. ఏంటి మనోహరి  దారి తప్పి వచ్చినట్టు ఉన్నావు. మాట్లాడటానికి వచ్చావా? నాతో ఉండటానికి వచ్చావా? అని అడుగుతాడు.

ఆరు(మనోహరి):  నా గురించి నాకంటే  నీకే బాగా తెలుసు కదా? నువ్వే చెప్పు నేను ఎందుకు వచ్చి ఉంటాను.

రణవీర్‌: నువ్వు నీ ఓటమిని అంత సులువుగా ఒప్పుకునేదానివే అయితే నువ్వు అమరేంద్రను వెతుక్కుంటూ వెళ్లేదానివే కాదు. నీది కానీ జీవితాన్ని వెతుక్కుంటూ  వచ్చే దానివే కాదు.

ఆరు(మనోహరి): అంటే మను పంతం పగ అన్ని తెలిసి మనును  ఎందుకు వదిలేస్తున్నావు రణవీర్‌ ( అని మనసులో అనుకుంటుంది.)

రణవీర్‌: నన్నే  నీ దగ్గరకు రప్పించుకున్న నువ్వు ఇవాళ నన్నే వెతుక్కుంటూ వచ్చావంటే..నీకు ఏదో కావాలి. చెప్పు ఏం కావాలి.

ఆరు(మనోహరి): నా ప్రశ్నలకు సమాధానాలు కావాలి. నేనే నీ భార్యను అని ఆయనకు చెప్పి నీ వెంట ఎందుకు తీసుకెళ్లలేదు. ఎందుకు నేనేవరో తెలియదని అబద్దం చెప్పావు.

 అంటూ అడగగానే నీకు  ఎన్ని సార్లు చెప్పాను. నాకు నా కూతురు  కావాలి అంటాడు రణవీర్‌. దీంతో ఆశ్యర్యంగా కూతురా? అంటుంది ఆరు(మనోహరి). దీంతో రణవీర్‌ తిట్టి కూతురు ఉందన్న విషయం మాత్రం తెలియదని చెప్పకు మనోహరి అంటూ లోపలికి వెళ్లి అంజు  చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చి చూపిస్తాడు. ఫోటో చూసిన ఆరు(మనోహరి) షాక్‌ అవుతుంది. ఫోటోను  హత్తుకుని ఏడుస్తుంది. నా అంజు కన్నతల్లి మనోహరినా.. అనుకుని ఏడుస్తుంది. మరోవైపు అంజు  స్కూల్‌ కు ఎందుకు వెళ్లలేదని కోపంగా అడుగుతుంటాడు. మనోహరికి తాయోత్తు కట్టడానికి వచ్చానని చెబితే  ఏం పనిష్‌మెంట్‌ ఇస్తారోనని అంజు  భయపడుతుంది.

భాగీ: ఏవండి అంజుతో నేను మాట్లాడతా? ఎందుకు స్కూల్‌ కు వెళ్లలేదో అడుగుతా.. మీరు ఆవేవపడకండి ఫ్లీజ్‌

అమర్: మిస్సమ్మ నీకేమీ తెలియదు పక్కకు వెళ్లు.

భాగీ: ఆ మాట వినండి మీరు అరిచే కొద్ది అంజు భయపడుతుంది.

అమర్: మిస్సమ్మ నీకు దీనికి ఏ సంబంధం లేదు. పక్కకు వెళ్లు.

భాగీ: సంబంధం లేదా? నాకు అంజుకు సంబంధం లేదా?

 అని అడగ్గానే నిర్మల ఏం మాట్లాడుతున్నావు నాన్నా.. అంటుంది. దీంతో నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అంటాడు అమర్. దీంతో భాగీ ఎవరన్నా అనకున్నా మిగతా ముగ్గురు  పిల్లలతో పాటు అంజు కూడా నా కూతురే.. అంటుంది. కానీ మిగతా ముగ్గురు వేరు అంజు  వేరు అంటాడు అమర్‌. దీంతో భాగీ మీకేమైంది ఇవాళ ఉదయం నుంచి ఇలాగే ఉన్నారు  అని అడుగుతుంది అమర్‌ బయటకు వెళ్లిపోతాడు. తర్వాత ఇంటికి వచ్చిన ఆరు(మనోహరి) అంజును చూస్తూ ఏడుస్తూ హగ్‌ చేసుకుని ముద్దు పెడుతుంది.  ఇంతలో అంజు తాయోత్తు తీస్తుంది.

అంజు: ఆంటీ ఇది మీకు కట్టాలని నేను స్కూల్‌ నుంచి వచ్చేశా..? డాడీ నన్ను తిట్టారు.

భాగీ: ఏంటి అంజు నువ్వు ఈ తాయోత్తు కోసం ఇంటికి వచ్చావా?

అంజు: అవును మిస్సమ్మ ఆంటీయే ఈ తాయోత్తు కట్టమని చెప్పారు.

నిర్మల: తాయోత్తు కట్టమని నీకు చెప్పిందా? ఎందుకు?

అంజు: ఏమో తెలియదు. నేను అడగలేదు.

భాగీ: మనోహరి గారు ఎందుకు అంజుకు తాయోత్తు ఇచ్చి కట్టమన్నారు. ( ఏమైంది మనోహరికి చాలా వింతగా..  చాలా కొత్తగా కనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది.)

అంజు తాయోత్తు కడుతుంది. గుప్త ఎంత పని చేశావు బాలిక  అంటాడు. ఇంతలో ఘోర ఆత్మ బంధన జరుగుతుంది అంటుంటాడు. మరోవైపు ఆరు(మనోహరి) లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంట్లో అందరూ కంగారుపడుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం