Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీతో కాదని పిల్లలు మనోహరిని తీసుకుని స్కూల్‌కు వెళ్లాలనుకుంటారు. అయితే అంజు మాత్రం అందుకు ఒప్పుకోదు. దీంతో అమ్ము బలవంతంగా కోపంగా అంజును మను కారులో స్కూల్‌కు తీసుకెళ్తుంది. తర్వాత అందరూ స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. డిన్నర్ చేస్తుంటారు. భాగీ అందరికీ వడ్డిస్తుంది. అమ్ము మాత్రం విచిత్రంగా ఎన్నడూ లేని విధంగా ప్రవర్తిస్తుంది. అమర్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. భాగీ, రాథోడ్ షాక్ అవుతారు.
అమ్ము: డాడ్ మనోహరి ఆంటీ చాలా మంచిది.. ఇవాళ ఆంటీకి నేను వడ్డిస్తాను.. ( అంటూ భోజనం చేస్తున్న అమ్ము లేచి వెళ్లి మనోహరికి భోజనం వడ్డిస్తుంది.) డాడ్ మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. చాలా బాగా మాట్లాడుతుంది. మాకు ఏది ఇష్టమో మాకు ఏది మంచిదో మనోహరి ఆంటీకి బాగా తెలుసు.. నాకు ఆంటీ చాలా చాలా ఇష్టం..
ఆకాష్: అవును డాడ్.. మనోహరి ఆంటీ చాలా మంచిది.. ఆంటీని చూస్తుంటే.. మాకు అమ్మ లేని లోటు తీరినట్టు అనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే.. అమ్మతో మాట్లాడినట్టే ఉంటుంది డాడ్.. నిజంగా ఆంటీ చాలా మంచిది డాడ్..
అని చెప్తుంటే.. భాగీ, రాథోడ్ షాకింగ్ గా చూస్తుంటారు.. అమర్ ఆశ్చర్యంగా వింటుంటాడు. ఇంతలో అంజు కోపంగా ఆకాష్‌ను తిడుతుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది.
అంజు: ఆకాస్ ఏం మాట్లాడుతున్నావు.. అమ్మ స్థానం ఎప్పుడూ మిస్సమ్మదే.. అది ఎవ్వరూ భర్తీ చేయలేరు.. అమ్మ ప్రేమను మిస్సమ్మ పంచినట్టుగా ఎవ్వరూ పంచలేరు.. అది ఎవరి వల్ల కాదు.. ఇంకా చెప్పాలంటే.. మిస్సమ్మే మనకు మరో అమ్మ.. అలాంటి మిస్సమ్మను కాదని ఇంకెవరినైనా పొగిడితే నేను సహించను డాడ్..
అంటూ అంజు చెప్తుంటే.. మనోహరి షాకింగ్‌గా చూస్తుంటుంది. అమర్ మాత్రం పిల్లలో వచ్చిన మార్పును గమనిస్తుంటాడు. ఇదంతా మనోహరి ఆడుతున్న డ్రామాగా బావిస్తాడు. ఇంతలో భాగీ అంజును వారిస్తుంది.
భాగీ: భోజనం చేస్తున్న దగ్గర గొడవలు ఎందుకు అంజు.. ప్రశాంతంగా భోజనం చేయండి..
అంజు: అది కాదు మిస్సమ్మ.. నీకు మేమంటే ఎంతో ప్రేమ ఉంటుంది. నువ్వు మమ్మల్ని ఎన్నోసార్లు సేవ్ చేశావు.. అదంతా వీళ్లు ఇప్పుడు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు..
భాగీ: అంజు అదంతా ఇప్పుడెందుకు చెప్పు ప్రశాంతంగా భోజనం చేయి..
అని భాగీ చెప్పగానే.. అంజు భోజనం చేస్తుంది. ఇంతలో అమ్ము మరోసారి మిస్సమ్మను టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఈసారి ఇన్ డైరెక్టుగా అమర్‌తో మాట్లాడుతుంది.
అమ్ము: డాడ్ నెక్ట్స్ సెమిస్టర్ నుంచి నేను హాస్టల్‌కు వెళ్దాం అనుకుంటున్నాను..
ఆకాష్: అవును డాడ్ అమ్ముతో పాటు నేను కూడా హాస్టల్‌కే వెళ్దాం అనుకుంటున్నాను.
అమర్: ఎందుకు ఇప్పటికిప్పుడు ఇలాంటి డిసీజన్ ఎందుకు తీసుకున్నారు.. ఇక్కడే ఇంట్లో ఉంటే ఏదైనా ప్రాబ్లమా..? అసలు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు హాస్టల్‌కు మీ ఇద్దరూ వెళ్తారా..? ఆనంద్, అంజు కూడా మీతో వస్తారా..? హాస్టల్ కు
అమ్ము: వాళ్లు వస్తారో రారో నాకు తెలియదు డాడ్.. కానీ నేను మాత్రం వెళ్దాం అనుకుంటున్నాను.. ఎందుకంటే ఇంట్లో చదువుకోవడం నాకు చాలా డిస్టర్బ్ గా ఉంది. అందుకే ఈ డిసీజన్ తీసుకున్నాను డాడ్. హాస్టల్ అయితే డిస్టర్బ్ లేకుండా చదువుకోవడానికి బెటర్ కదా..?
అంటూ అమ్ము చెప్పగానే అమర్, భాగీ, రాథోడ్ షాక్ అవుతారు. మనోహరి మాత్రం తాను కొంచెం చెబితే అమ్ము మొత్తం అల్లుకుపోతుంది అని మనసులో హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!