Ammayi garu Serial Today Episode రాజు కోమలి వైపు తిరిగిపోయాడని విరూపాక్షి షాక్ అయిపోతుంది. రూప దగ్గరకు వెళ్లి రాజు అలా చేస్తే నువ్వు ఊరుకుంటావ్ కానీ నేను ఊరుకోను అని అంటుంది. ఇంతలో రాజు రాగానే రాజు ఏంటి నీకు ఆ కోమలి అమ్మాయిగారా రూప రుక్మిణినా అని కోప్పడుతుంది. 

Continues below advertisement

రాజు విరూపాక్షితో అమ్మగారు శాంతించండి ఇదంతా నేను కావాలనే చేశాను ఇదంతా యాక్టింగ్ అని అంటాడు. యాక్టింగా అని విరూపాక్షి అడుగుతుంది. దాంతో రాజు, రూపలు కోమలి తాయొత్తు గురించి చెప్తారు. కోమలి తాయొత్తు రాజుకి కట్టి వశీకరణ చేయాలి అనుకోవడం రాజు వినేసి ఆ తాయొత్తుని మార్చేసి దాని ప్లేస్‌లో డూప్లికేట్ తాయొత్తుని పెట్టామని చెప్తారు. డూప్లికేట్ తాయొత్తు రాజుకి కట్టడంతో రాజు వశీకరణ అయినట్లు నమ్మేశారని అంటాడు. ఈ దెబ్బతో విజయాంబిక, దీపక్‌ల పని పట్టాలని మందారం అంటుంది. 

రాజు కోమలిని తినిపించి ఎక్కువ ఓవర్ చేయడం రూప గుర్తు చేసుకొని ఏంటి సార్ తాయొత్తు ఎక్కువ పని చేసేస్తుంది. పక్కన నేను గుర్తున్నాను అని నీకు తెలుస్తుందా అని బుంగ మూతి పెట్టుకుంటుంది. ఎప్పటికీ మీరే నా అమ్మాయిగారు అని రాజు రూపని దగ్గరకు తీసుకుంటాడు. ఇద్దరూ హగ్ చేసుకొని హ్యాపీగా ఉంటారు. 

Continues below advertisement

కోమలికి కాబోయే అత్తామామలు అనాథాశ్రామానికి వెళ్తారు. రమ్య వాళ్లని చూసి కోమలి అత్తామామలు ఇక్కడికి వచ్చారేంటి అని అనుకుంటుంది. కోమలి అత్తామామలతో రమ్య మాట్లాడుతుంది. వాళ్లు లోపలికి వెళ్లి కోమలిని పిలుస్తారు. కోమలి బయటకు వెళ్లిందని రమ్య చెప్తుంది. అందరినీ పెళ్లికి పిలవాలని వాళ్లు అనుకొని కోమలి, అశోక్‌లను పిలవాలి అని అనుకుంటారు. ఇద్దరికీ కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది. ఇక అశోక్‌ తల్లిదండ్రులు వార్డెన్‌తో మాట్లాడుతారు. కోమలి రెండు నెలలుగా అనాథాశ్రమంలో ఉండటం లేదని చెప్తారు. వాళ్లకి డౌట్ వచ్చి అర్జెంటుగా ఇద్దరినీ రమ్మని చెప్పి అశోక్‌కి చెప్తారు. అశోక్ చాలా కంగారు పడతాడు. 

అశోక్‌ వెంటనే కోమలికి కాల్ చేసి అమ్మానాన్నలు అనాథాశ్రమం దగ్గరకు ఉన్నారు నిన్ను త్వరగా తీసుకురమ్మన్నారు అని అంటాడు. కోమలి చాలా కంగారు పడుతుంది. మొన్నే పెద్ద ప్రమాదం తప్పించుకున్నాం కాదా.. ఇప్పుడు నేను అక్కడ ఉండటం లేదు అని తెలిస్తే ఇక నా పని అంటే అంటుంది. ఇక కోమలి వస్తానని చెప్పి అశోక్‌ని రమ్మని అంటుంది. 

ఇంతలో ఎమ్మెల్యే విరూపాక్షి వస్తుంది. కోమలి బయటకు వెళ్తుంటే రాజు వచ్చి అమ్మాయిగారు ఏంటి అని అంటాడు. కోమలి రాజుతో నాకు కాఫీ కావాలి అంటుంది. రాజు సరే అంటాడు. రూప వచ్చి తనకు కాఫీ ఇస్తా అంటే నేను ఒప్పుకోను అని అంటుంది. నువ్వులే రుక్మిణి మా అమ్మాయిగారికి నేను కాఫీ ఇవ్వాలి అంటాడు. కోమలి విజయాంబిక దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. రాజు కూడా వెంట పడుతున్నాడని  అంటుంది. అంతా నేను చూసుకుంటా నువ్వు వెళ్లు అని  విజయాంబిక అంటుంది. ఇక కోమలి అశోక్‌తో వెళ్లడం రాజు చూసి ఫాలో అవుతాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.