Nindu Noorella Saavasam Serial Today Episode: అక్షింతలు తీసుకుని వచ్చిన భాగీ.. ఆరు ఇచ్చిన గిప్ట్ చూపించగానే అందరూ షాక్ అవుతారు. అంజు.. ఆరును గుర్తు చేసుకుంటుంది. మనోహరి మాత్రం దాన్ని బంధించాడా లేదా? అని మనసులో అనుకుటుంది. అంజు గిఫ్ట్ తీసుకుని చూసి ఏడుస్తుంది. అందరూ షాకింగ్ చూస్తుంటే ఏమైందని అడుగుతుంది. పిల్లలు డాడ్ అచ్చం మామ్ చేసిన బొమ్మలాగే ఉందని చెప్తారు. భాగీని ఆ బొమ్మ ఎవరిచ్చారని అమర్ అడుగుతాడు. అదిగో అక్కడే అని చూపించగానే అక్కడ ఎవ్వరూ కనిపించరు. కంగారుగా భాగీ వెతుకుతుంది. మరోవైపు గుప్త ఆరు కోసం వెతుకుతుంటాడు. ఇంకోవైపు ఘోర బయటకు వచ్చి ఆరున బంధించానని మనోహరికి చూపించి వెళ్తాడు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.
అంజు: అచ్చం అమ్మ చేసినట్టే ఉంది.
ఆకాష్: అంజు ప్రతి బర్తుడేకు అమ్మ ఇలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేది.
ఆనంద్: లాస్ట్ ఇయర్ అంజుకు హ్యపీ ప్యారెట్ నచ్చిందని నెక్స్ట్ ఇయర్ ఇస్తా అంది.
అమర్: మీ అమ్మ లేకపోయినా మాట నిలబెట్టుకుంది.
అంజు: నాకు తెలుసు మా అమ్మే నాకోసం ఈ గిఫ్ట్ పంపించినట్టు ఉంది. డాడ్ నిజం చెప్పండి డాడ్ మమ్మీ కదా వచ్చింది. నిజం చెప్పండి డాడ్ మమ్మే కదా ఈ బొమ్మ నాకు పంపించింది.
కరుణ: అరే బర్తుడే పూట ఎవరైనా ఏడుస్తారా? చెప్పు.. చూడు నీకు ఎన్ని గిఫ్టులు వచ్చాయే చూడు.
అమర్: నాన్నా.. రాథోడ్ వచ్చిన వాళ్లకు భోజనాలు అరైంజ్ చేయండి. మిస్సమ్మ ఇంకొకసారి ఆ పక్కింటి అక్క వస్తే నాకు పరిచయం చేయ్..
మనోహరి: తను ఇంక కనిపించదులే అమర్.
భాగీ: అంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు మనోహరి గారు. ఆవిడ మీకు కూడ తెలుసా..?
మనోహరి: అంటే గిప్ట్ ఇచ్చి వెళ్లారు అంటూ మళ్లీ రారని అనుకున్నాను.
భాగీ: ఏదో పని ఉందని వెళ్లారు. మళ్లీ వస్తారు.
మనోహరి: రాలేని పరిస్థితుల్లో ఉంటే..
భాగీ: ఎలాంటి పరిస్థుల్లో ఉన్నా అక్క తిరిగి వస్తారు. వస్తారనే నమ్మకం నాకు ఉంది.
మనోహరి: పిచ్చిదానా అరుందతిని పర్మినెంట్ గా పంపిచేశాను. ( అని మనసులో అనుకుంటుంది.)
భాగీ: సరేలేండి అక్కను కలిసిన వెంటనే తప్పకుండా పరిచయం చేస్తాను.
రణవీర్: జీ సార్ ఏదో అప్‌సెట్ లో ఉన్నారు. నేను తర్వాత వచ్చి కలుస్తాను.
అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత భాగీ ఆరు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తుంది. మరోవైపు గుప్త కంగారుగా ఆరు కోసం ఇళ్లంతా వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. మరోవైపు ఆరు ఆత్మను తీసుకెళ్లిన ఘోర పూజ చేస్తుంటాడు. సీసాలో బంధిగా ఉన్న ఆరు ఆత్మ నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది. మనోహరి వస్తుంది.
ఘోర: మనం గెలిచాం మనోహరి.. మనం గెలిచాం.. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు.. చేస్తాను..
మనోహరి: ముందు ఆ రణవీర్‌ను చంపేయ్.. ఘోర..
ఘోర: ఆలోచించుకుని చెప్పు మనోహరి. ఏం చెప్పినా ఏం చేసినా అతను నీ మెడలో తాళి కట్టిన భర్త.
మనోహరి: ఆ భర్త ఆ బతుకు వదిలేసుకుని వచ్చినదాన్ని నేను. ఆ రణవీర్ ప్రాణాలతో ఉన్నని రోజులు నేను ప్రశాంతంగా ఉండలేను.
ఘోర: సరే నీకు మాటిచ్చినట్టు నీకున్న రెండు కోరికలు తీరుస్తాను. ఇవాళ రాత్రికి పూజ చేస్తాను. రేపు తెల్లవారగానే నీ సమస్యలు తీరిపోతాయి.
మనోహరి: అదెంత.. దాని బతుకెంత. దేవుళ్లను పూజిస్తూనే ఉంది. ఈసారి ఏ దేవుడొచ్చి కాపాడతాడో నేను చూస్తాను.
అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ఆరు కోసం గుప్త వెతికి ఘోర.. ఆరును బంధించాడేమోనని అనుకుంటుండగానే యముడు వస్తాడు. ఆరు కనిపించడం లేదని గుప్త చెప్తాడు. దీంతో యముడు ఆ బాలికను ఘోర బంధించాడని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: రాకేష్ ను చంపబోయిన రాజనందిని ఆత్మ