Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్ ఇంటికి వెళ్లిన మనోహరి అక్కడే ఉన్న భాగీ ఫోటోను కత్తితో పొడుస్తూ పిచ్చిగా అరుస్తూ.. భాగీ తల్లి కాబోతుందని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. చావవే చావు అంటూ కత్తితో కసిగా ఫోటోను పొడుస్తుంది. ఇంతలో రణవీర్ వస్తాడు.
రణవీర్: మనోహరి భాగీని డైరెక్టుగా పొడవలేక ఇండైరెక్టుగా ఫోటోను పొడుస్తూ శాటిఫై అవుతున్నావా..? నువ్వు ఎంత పొడిచినా ఫోటోకు చిల్లు పడుతుంది తప్పా భాగీ ఒంట్లో నుంచి చుక్క రక్తం కూడా బయటకు రాదు మనోహరి.
మను: ఏంటి రణవీర్ కామెడీగా ఉందా..?
రణవీర్: అవును నువ్వు చేస్తుంది చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పు.. నాతో కోల్‌కతా వచ్చేసెయ్.. నా ఎక్స్ వైఫ్‌గా నా ఇంట్లో హ్యాపీగా ఉండు.
మను: నేను ఇన్నిరోజులు ఇంత కష్టపడింది. అన్ని వదిలేసి నీతో రావడానికి అనుకున్నావా..?
రణవీర్: నువ్వు ఇంక ఎన్ని రోజులు కష్టపడినా అమరేంద్ర నీకు దక్కడు. తన మీద ఆశలు వదిలేసుకో..
మను: అది జరగని పని రణవీర్. నేను కోరుకున్నది నాకు ఎలాగైనా దక్కాలి. నాకు అమర్‌పై ప్రేమ కన్నా అరుంధతిపై పగే ఎక్కువ. అందుకే దాన్ని చంపేశాను. అరుంధతి చచ్చాక దాని స్థానంలోకి భాగీ వచ్చింది. ఇప్పుడు అది కూడా తల్లి కాబోతుంది. దాన్ని వదిలిపెట్టను అరుంధతి లాగా దాన్ని చంపేస్తాను.
రణవీర్: భాగీని నువ్వు ఏమీ చేయలేవు మనోహరి.
మను: ఏయ్ ఎందుకు చేయలేను చెప్పు..
రణవీర్: మరి ఇన్నాళ్లు ఏం చేశావు మనోహరి.
మను: ఇన్నాళ్లు ఆరుంధతి ఆత్మ ఆ భాగీ పక్కనే ఉంది. అందుకే దాన్ని ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఆత్మ పైకి వెళ్లిపోయింది. ఇప్పుడు దాన్ని చంపడానికి ఏ అడ్డూ లేదు.
రణవీర్: భాగీ పక్కన అరుంధతి ఆత్మ మాత్రమే లేదు. అమరేంద్ర ఉన్నాడు కదా..?
మను: ఉంటే ఏంటి..? ఆ గోడను బద్దలుకొట్టుకుని ఇద్దరినీ లేపేస్తాను.
రణవీర్: ఇద్దరినీ అంటే అమరేంద్రను కూడా లేపేస్తావా..?
మను: అమర్‌ను కాదు.. భాగీని దాని కడుపులో ఉన్న బిడ్డను..
రణవీర్: బాగుంది. ఉట్టికి ఎగురలేనిది. స్వర్గానికి ఎగురుతుంది అన్నట్టు భాగీనే చంపలేకపోయావు..ఇప్పుడు తన కడుపులో బిడ్డను చంపుతావా..?
మను: నన్ను తక్కువ అంచనా వేయకు రణవీర్.
రణవీర్: నువ్వే అమరేంద్రను తక్కువ అంచనా వేస్తున్నావు. ఇన్నాళ్లు ఒట్టి మనిషి అయిన భాగీ మీద ఈగ వాలకుండా చూసుకున్నాడు. ఇప్పుడు తను కడుపుతో ఉందని తెలిశాక కంచెలా కాపాడుకుంటాడు.
మను: అరుంధతి లేకపోతే భాగీని కాపాడుకోవడం అమర్ వల్ల అస్సలు కాదు.
రణవీర్: నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. తను దేశాన్ని కాపాడే లెఫ్టినెంట్.. అలాంటి వాడు సొంత భార్యను కాపాడుకోలేడా..?
మను: అప్పట్లో అరుంధతిని కాపాడుకోగలిగాడా..? ఇప్పుడు భాగీ పరిస్థితి కూడా అంతే. ఆ స్థానంలోకి నేను తప్ప ఎవ్వరు వచ్చినా వాళ్ల పరిస్థితి కూడా అంతే చూస్తూ ఉండు రణవీర్ నేను అనుకున్నది చేసి చూపిస్తాను..
అనుకుంటూ కోపంగా భాగీ ఫోటో దగ్గరకు వెళ్లి కత్తితో పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనోహరి వెళ్లిపోయాక కట్టుకున్న వాడిని వదిలేసింది. కన్న కూతురును వదిలేసింది. ఇప్పుడు కడుపులో బిడ్డను కసాయి దానిలా చంపేస్తానంటుంది. ఇంకెన్ని ఘోరాలు చూడాలో అనుకుంటాడు రణవీర్. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!