Nindu Noorella Saavasam Serial Today Episode:  మంగళ ఆస్తికలు తీసుకుని బయటకు వెళ్తుంటే.. చూసిన ఆరు కంగారు పడుతుంది. అసలు పిన్ని ఏం చేస్తుంది అని ఆలోచిస్తుంది.

Continues below advertisement

ఆరు: మా పిన్నిని ఆపండి గుప్తగారు..

గుప్త: నేను ఆవిడను ఆపలేను బాలిక ఆశక్తుడను

Continues below advertisement

ఆరు: అయితే ఆవిడ ఆస్తికలు తీసుకెళ్లి ఏం చేస్తారు.. ఎవరికి ఇస్తుంది  గుప్తగారు పదండి తను వెళ్లిపోతుంది చూద్దాం

మంగళను ఫాలో అవుతారు.. మంగళ, చంభా, ఘోర దగ్గరకు అస్తికలు ఇస్తుంది.

ఆరు: గుప్త గారు మా పిన్ని ఏంటి నా ఆస్థికలు వాళ్లకు ఇస్తుంది.

గుప్త: నిలువెళ్లా స్వార్థమును విషమును నింపుకున్న నీచపు మనిషి బాలిక. నగల కొరకు నిన్నే బలి చేయుచున్నది.

ఆరు: సొంత పిన్ని అయ్యుండి ఇలా చేస్తున్నారేంటి… ఇప్పుడు నా అస్తికలతో వాళ్లు ఏం చేస్తారు గుప్త గారు..

గుప్త:  నిన్ను బంధించి వారి వశము చేసుకొనెదరు నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలగదు.. మరు జన్మ సంప్రాప్తించదు..

ఆరు: అంటే నేను మళ్లీ నా చెల్లికి కూతురుగా పుట్టనా గుప్త గారు

గుప్త: నీ అస్థికలను గంగలో నిమజ్జనం చేయకుంటే.. నీవు మరలా జన్మించుట అసాధ్యము బాలిక. రేపు జరగబోవు నీ కార్యము మొదలగు లోపు నీ అస్థికలు తిరిగి రానిచో.. నువ్వు శాశ్వతంగా ఆ దుష్ట మాంత్రికులకు బందీవై వాళ్ల చేతుల్లో కీలు బొమ్మవు అయ్యెదవు..

ఆరు: అలా జరగకూడదు గుప్త గారు ఏదో ఒకటి చేయండి.. ఎలాగైనా నా అస్తికలను వెనక్కి తెప్పించండి ఫ్లీజ్‌.. నేను మళ్లీ నా చెల్లెలికి పుట్టాలి. నాకు మరో జన్మ కావాలి. ఏదో ఒకటి చెయ్యండి గుప్త గారు ఫ్లీజ్‌

అంటూ గుప్తకు చెప్తుంది ఆరు. అక్కడి నుంచి చంబా, ఘోర అస్థికలు తీసుకుని వెళ్లిపోతారు. తర్వాత అమర్‌ వాళ్లు అందరూ ఆస్తికలు నిమజ్జనం చేయడానికి నది దగ్గరకు వెళ్తారు. పంతులు వచ్చి పూజ చేస్తుంటే.. అమర్‌, పిల్లలు, భాగీ, రామ్మూర్తి తమకు ఆరుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంటారు.

రామ్మూర్తి: అమ్మ భాగీ అక్క ఇక్కడికి వచ్చిందా అమ్మా

భాగీ: ( అటూ ఇటూ చూస్తుంది) లేదు నాన్న అక్క ఇక్కడ లేదు

రామ్మూర్తి: అంటే కార్యం ముగియక ముందే అక్క పైకి వెళ్లిపోయిందా అమ్మా

భాగీ: లేదు నాన్న ఈ ఘడియల్లోనే కార్యం జరగాలని అక్క చెప్పింది. అప్పుడే తాను మళ్లీ పుడుతుందట

రామ్మూర్తి: అందుకే కదమ్మా అల్లుడు గారి మనసు నొచ్చుకున్నా  ఒత్తిడి చేసి కార్యం జరిపిస్తున్నాం.. లేదంటే అక్క ఇంకొన్నాళ్లు మనతో ఉండేది

భాగీ: అదే నేను ఆశపడ్డాను నాన్న.. మీకు కొన్నైనా అక్క తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు అవి కూడా లేవు

అంటూ భాగీ ఎమోషనల్‌ అవుతుంది. అప్పుడే అక్కడకు చంభా, ఘోర వస్తారు వారి వెనకే ఆరు, గుప్త వస్తారు. గుప్త అంజుకు తన ఉంగరం ఇస్తాడు. అది చేతికి పెట్టుకోగానే అంజుకు తెలియని శక్తులు వస్తాయి. దీంతో అంజు చంభా, ఘోరా దగ్గరకు వెళ్లి తిడుతుంది. వాళ్లను కొట్టి నిజమైన అస్థికలు ఉన్న కుండను తీసుకుంటుంది. మరోవైపు డూప్లికేట్‌ అస్థికలను నిమజ్జనం చేయడానికి అమర్‌ నదిలోకి వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!