గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 14 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 14h Episod

Continues below advertisement

డాన్స్ నేర్పిస్తే పర్వాలేదు కానీ డబ్బుపై వ్యామోహం, మనుషులపై అసహనం నేర్పించకుండా ఉంటే చాలు అంటాడు బాలు. అత్తయ్య చేస్తున్న పని మంచిదే కదా అంటుంది శ్రుతి. అయినా ఈ వయసులో అవసరమా అని అంటాడు బాలు. ఆలోచన మంచిదే అయినా వయసుని మరిచి డాన్స్ చేస్తే ఆమెకు ఏమవుతుందో అనే భయం ఉంది అంటాడు సత్యం. ఇంట్లో అందరూ ఏదో పని చేస్తున్నారు.. అత్తయ్య ఒక్కరే ఖాళీగా ఉన్నారు. అందుకే ఏదో ఒకటి చేయనీయండి..ఎంకరేజ్ చేయండి అంటుంది మీనా. మా అమ్మ కూడా నీ గురించి ఆలోచిస్తే బావుండును అంటాడు బాలు. నా సపోర్ట్ మొత్తం అమ్మకే అంటాడు మనోజ్. శ్రుతి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటారు. ఆవిడకు ఏమైనా అయితే చూసుకునేందుకు మనం ఉన్నాం కదా అంటుంది మీనా. 

ఇక నాట్యాలయంలో ప్రభావతి కూర్చుని ఉంటుంది. ఎవ్వరూ రాలేదు.. కనీసం పది మంది కూడా రాలేదు అంటుంది ప్రభావతి. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. కామాక్షి వెళ్లి తలుపుతీస్తుంది. వాటర్ క్యాన్ అని ఎంట్రీ ఇస్తాడు ఒకడు. మరోసారి కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీస్తుంది కామాక్షి.  ఈసారి కిరాణా షాప్ వాడు సరుకులు పంపిస్తాడు. ఆ తర్వాత ఇంకొకరు వస్తారు. మళ్లీ కాలింగ్ బెల్ మోగడంతో..ఆశగా చూస్తుంది ప్రభావతి. ఇక్కడ డాన్స్ నేర్పిస్తారా అని , ఫీజులు, సౌకర్యాల గురించి వివరాలు మొత్తం అడుగుతాడు. ఠకఠకా చెప్పేస్తుంది ప్రభావతి. నేను నా పిల్లలకు డాన్స్ నేర్పించేందుకు రాలేదంటూ షాక్ ఇస్తాడు. కరెంట్ ఆఫీసులో పనిచేస్తాను..మీరు బిజినెస్ చేస్తున్నారు కదా మీ మీటర్ కమర్షియల్ మీటర్ కి మార్చేస్తానంటాడు. ఇంకా వ్యాపారం మొదలవనే లేదు అప్పుడే ఎఫెక్ట్ పడిందని  బాధపడిపోతారు కామాక్షి, ప్రభావతి. ఆ తర్వాత వేరేవారు వచ్చి డాన్స్ నేర్పిస్తారా అని అడిగితే భయంతో కామాక్షి ఇక్కడ డాన్స్ నేర్పించడం లేదని అబద్ధం చెప్పేస్తుంది. వాళ్లు వెనక్కు వెళ్లిపోతుంటే ప్రభావతి పిలుస్తుంది కానీ ఇక్కడంతా తేడాగా ఉందని వెళ్లిపోతారు.

Continues below advertisement

ఆ తర్వాత కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీస్తుంది కామాక్షి. మీనా బాలు ఎంట్రీ ఇస్తారు. వీళ్లు నిజంగానే నన్ను ఏడిపించేందుకే వచ్చారు అంటుంది ప్రభావతి. అదేం లేదు..మీనాకు డాన్స్ నేర్పించాలని ఫిక్సయ్యాను అంటాడు బాలు. నీకు డాన్స్ ఏంటి? అయినా ఇంట్లో వంట చేసుకోవడం, పూలు కట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా అని అవమానిస్తుంది. మీరు చెప్పండి నేను నేర్చుకుంటా అని బతిమలాడుతారు మీనా బాలు. గురువుగారు అని బాలు రిక్వెస్ట్ చేయడంతో మీనాతో సవాల్ చేస్తుంది ప్రభావతి. నీకు రాదని.నేను ఏం స్టెప్ వేస్తే అది వేస్తావా అని సవాల్ చేస్తుంది. సరే అని మీనా కూడా బరిలో దిగుతుంది. మొత్తానికి ప్రభావతి స్కూల్ కి ఫస్ట్ స్టూడెంట్ మీనా అన్నమాట.  పోటాపోటీగా డాన్స్ చేస్తుంటే చేయి, మెడ పట్టేస్తుంది.

ప్రభావతిని ఇంటికి తీసుకొస్తారు బాలు, మీనా. ఇంట్లో ఒక్కొక్కరుగా వచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. అమ్మావతి శిల్పావతి అయిందంటూ బాలు సెటైర్స్ అందుకుంటాడు. ప్రభావతి మాత్రం ఇదంతా మీనానే చేసిందని రుసరుసలాడుతుంది. మీనాపైనే నిందలేస్తావా? వాళ్లని అవమానించినందుకే నటరాజస్వామి నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడంటూ కామాక్షి కడిగేస్తుంది.  నావల్లే మెడపట్టేసింది అంటున్నారేంటి అత్తయ్య అని మీనా అడుగుతుంది..నీవల్లే కదా అని అంటాడు బాలు. మీరు ప్లాన్ చేస్తేనే కదా వెళ్లానంటూ అలుగుతుంది... మళ్లీ బాలు బుజ్జగింపులు స్టార్ట్ చేస్తాడు.