Nindu Noorella Saavasam Serial Today Episode: ఘోర కిటికి దగ్గరకు వచ్చి మనోహరిని పిలుస్తాడు. ఘోరను చూసిన మనోహరి మరింత టెన్షన్ పడుతుంది. అమర్ చూస్తే పరిస్థితేంటని భయపడుతుంది. అయితే ఈ ఒక్కరోజు నువ్వు తెగిస్తే మనం గెలుస్తాం అని చెప్తాడు. అయితే నువ్వు నా రూంలోనే ఉండు ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అడుగుతుంది. దీంతో ఘోర మనోహరి ఏం చేయాలో చెప్తాడు. మరోవైపు తన మనోనేత్రంతో గుప్త, ఘోర వచ్చింది తెలుసుకుంటాడు. ఇంతలో ఆరు వస్తుంది.
ఆరు: గుప్త గారు లోప బర్తుడే సెలబ్రేషన్స్ సూపర్ గా జరగుతున్నాయి. మీరేంటి ఇక్కడ ఉన్నారు. రండి లోపలికి వెళ్దాం.
గుప్త: రాలేను బాలిక. నువ్వు కూడా లోనికి వెళ్లరాదు.
ఆరు: అంజు బర్తుడే రోజు నేను లోపలికి వెళ్లకూడదా? ఎందుకు? ఓహో అక్కడ మిస్సమ్మ కూడా ఉంటుందనా? మిస్సమ్మకు కనిపించకుండా ఉంటాను. ఏమైంది గుప్త గారు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు.
గుప్త: ఏదో జరగబోవుతున్నదని నా మనసు కీడు శంకించుచున్నది బాలిక. ఆ ఘోర ఈ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడని నాకు అనిపిస్తున్నది.
ఆరు: ఏం మాట్లాడుతున్నారు గుప్త గారు.
గుప్త: ఇది అనుమానమో నిజమో తెలియడం లేదు బాలిక. కానీ ఆ ఘోర ఈ పరిసరాలలోనే ఉన్నాడని నా దివ్య దృష్టి చెబుతున్నది.
ఆరు: మీ దగ్గర ఉన్న భవిష్యవాణి తీసి ఘోర ఇంట్లో ఉన్నాడో లేడో ఒక్కసారి చూడండి గుప్త గారు.
గుప్త: దైవ శక్తి వలే తాంత్రిక శక్తి కూడా చాలా శక్తివంతమైనది బాలిక. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ ఘోర బంధనము వేసినట్టు అనిపిస్తున్నది.
ఆరు: అసలు ఆయన లోపల ఉన్నా కూడా అంత ధైర్యంగా ఎలా వచ్చాడు.
గుప్త: చెప్పితిని కదా బాలిక. నీకు శక్తులు వచ్చాయని గ్రహించి నిన్ను ఇప్పుడు బంధించినచో అతగాడు మరింత శక్తివంతుడు అవునని తెగించి వచ్చినట్టున్నాడు.
ఆరు: వాడు మా వాళ్ల జీవితంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అల్లకల్లోలం సృష్టిస్తాడు గుప్త గారు. ఈసారి ఏం చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది.
గుప్త: ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు లోపలికి వెళ్లరాదు. ఈ పరిసరాలలో దేన్ని నువ్వు తాకరాదు.
ఆరు: సరే గుప్త గారు.
అని చెప్తుంది. మరోవైపు అమర్ లోపల కూర్చుని ఉంటాడు. ఇంతలో రాథోడ్, కరుణ వస్తారు. భాగీ ఎక్కడుందని అడుగుతుంది. పైన అంజును రెడీ చేస్తుందని చెప్తాడు అమర్. కరుణతో మాట్లాడాలని బయటకు వెళ్తారు అమర్, కరుణ. వాళ్లను గమనించిన ఆరు మనం వెళ్లి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం పదండి. అంటుంది. గుప్త వద్దని చెప్తాడు.
కరుణ: చెప్పండి అమర్ గారు.. ఏంటి విషయం.
అమర్: మిస్సమ్మ గురించి పూర్తిగా తెలుసుకుందామని మిమ్మల్ని పిలిచాను.
ఆరు: మా ఆయన బంగారం గుప్త గారు.
కరుణ: అమరేంద్ర గారు దాని కిస్మత్ ఎప్పుడూ మంచిగ లేదు. చిన్నప్పటి నుంచి అంతే అమ్మ చనిపోయింది. గయ్యాళి పిన్ని వచ్చింది. నచ్చిన సదువు లేదు. నచ్చిన బతుకు లేదు. కానీ దానిలో నచ్చేదేదో తెలుసా? ఏం జరిగినా ఏన్ని సార్లు కింద పడినా.. ఎట్ల లేవగలను.. ఎట్ల సంతోషంగా ఉండగలను అని ఆలోచించే దాని మనస్తత్వం.
అమర్: అది కాకుండా తనకి తీరని కోరికలు లాంటివి. ఏమైనా ఉన్నాయా?
కరుణ: తీరని కోరికలు అంటే.. చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ల అక్కను కలవాలనుకుంది. కానీ కలవలేదు. కొడైకెనాల్ లో భాగీ ఫ్యాన్ ఒకామె ఉండేది. ఆమెను కలవాలనుకుంది. కానీ అది కూడా జరగలేదు. ఆ ఇంకోటి ఉంది….
అమర్: ఇంకోటి ఏంటి..? ఇవన్నీ టైం పట్టే పనులు కదా? ఇప్పటికిప్పుడు నేను చేయగలిగేవి. భాగీ హ్యాపీగా ఫీలయ్యేవి ఏమైనా ఉన్నాయా..?
కరుణ: దానికి ఎప్పటి సందో బుల్లెట్ నేర్చుకుని.. రోడ్డు మీద దర్జాగా తిరగాలని కోరిక. కానీ దానికి బుల్లెట్టు లేదు.. నేర్పించే మనిషి లేడు.
అమర్: అయితే నేను ట్రైనర్ ను పెట్టి..
కరుణ: అంటే మీరు రేపటి నుంచి తనకు బుల్లెట్ నేర్పిస్తారన్నమాట.
అంటూ కరుణ లోపలికి వెళ్లిపోతుంది. ఆ బుల్లెట్ కరెక్ట్ కండీషన్ లో ఉందో లేదో చూడు రాథోడ్ అని అమర్ చెప్తాడు. సరే సార్ అని రాథోడ్ వెళ్లిపోతాడు. మరోవైపు భాగీ, అంజును రెడీ చేస్తుంది. పిల్లలు ముగ్గురు చూస్తూ అంజును ఆటపట్టిస్తుంటారు. భాగీ పిల్లలను తిట్టి సారీ చెప్పిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ షర్ట్ మీద నక్షత్ర ఫోటో – కవర్ చేయలేక ఇబ్బందిపడ్డ భూమి