Meghasandesam Serial Today Episode: గగన్‌ కోసం కోటు తీసుకుని వచ్చిన నక్షత్ర, శారద కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుని కోటు మీరే గగన్‌ కు ఇవ్వాలని అడుగుతుంది. కోటు నేనెలా ఇస్తానని శారద అనగానే మీరు ఇవ్వకపోతే కాలేజీలో నా పరువు పోతుందని అంటుంది నక్షత్ర. అసలు కోటుకు నీ కాలేజీకి సంబంధం ఏంటి? అని భూమి అడుగుతుంది. దీంతో నేను కోటు కొంటున్నప్పుడు కాలేజీలో నా ఫ్రెండ్స్‌ మీ బావకు నీకు పడదు కదా నువ్వు ఇచ్చే కోటు ఎలా తీసుకుంటాడని అడిగారు నేను ఇస్తానని పందెం కాశానని చెప్తుంది నక్షత్ర.

నక్షత్ర: ఫ్లీజ్‌ అత్తయ్యా.. మీరు కాదంటే కాలేజీలో నేను రోజంతా ఎండలో నిలబడాలి. ఆ అవమానం నేను తట్టుకోలేను. ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్‌ అత్తయ్యా ఇవ్వండి.

శారద: సరేలే అమ్మా ఆడపిల్లవి. అందరిలో అవమాన పడితే ఏం బాగుంటుంది. నేనే ఇస్తాలే..

నక్షత్ర: థ్యాంక్యూ అత్తయ్యా..

కోటు తీసుకుని గగన్‌ రూంలోకి వెళ్తుంది శారద

గగన్‌: ఏంటమ్మా అది..

శారద: కోటురా..

గగన్‌: ఎవరు తెచ్చారు..?

శారద: ఎవరు తెస్తారు. నేనే తెచ్చాను. పూర్ణి, నేను మొన్న షాపింగ్‌ కు వెళ్లిన్నప్పుడు నీకు బాగుంటుందని తీసుకొచ్చాను.

గగన్‌: సరేలే అమ్మా స్నానం చేసి వచ్చి వేసుకుంటాను.

శారద బయటకు వచ్చేస్తుంది.

శారద: ఇచ్చేశాను అమ్మా ఏంటో ఎప్పుడూ లేనిది నీకోసం వాడితో అబద్దం చెప్పాల్సి వచ్చింది.

నక్షత్ర: సరేలేండి అత్తయ్యా నాకోసమే కదా అబద్దం చెప్పారు. థాంక్యూ సో మచ్‌ అత్తయ్యా..

 అంటూ శారదను మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఇలాగే ఉండండి అంటూ కాళ్లమీద పడుతుంది. తర్వాత గగన్‌ కోటు చేతిలో పట్టుకుని కిందకు వస్తాడు. గగన్ ను చూసిన నక్షత్ర హ్యాపీగా ఫీలవుతుంది. భూమి మాత్రం ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.

గగన్‌: నువ్వేంటి ఇక్కడ ఎవరు రమ్మన్నారు..

నక్షత్ర: అది.. అత్తయ్య రమ్మంటే వచ్చాను..

భూమి: ఆంటీని ఎందుకు రమ్మంటారు. అయినా మధ్యలో ఆంటీని  ఎందుకు ఇరికిస్తావు.

నక్షత్ర: చెప్పండి అత్తయ్యా మీరు రమ్మంటేనే కదా వచ్చాను. ప్లీజ్‌..

శారద: అవున్రా నేనే రమ్మన్నాను.

గగన్‌: వాళ్ల గురించి తెలిసి ఎందుకు రమ్మన్నావు అమ్మా..

శారద: వీధిలో షాపు వరకు వెళ్లి వస్తుంటే దారి మధ్యలో కనిపించింది. ఇంటిదాకా వచ్చింది కదా అని రమ్మని పిలిచాను.

గగన్‌: ఒకాయన వచ్చిపోతున్నందుకే మనం పడుతున్న అవమానాలు చాలవా అమ్మా..నువ్వు పద్దతిగా పిలిచావు. కానీ వాళ్ల అమ్మ వచ్చి తన కూతురుతో పనేంటని అడుగుతుంది.

నక్షత్ర: మా మమ్మీని నేను మేనేజ్‌ చేస్తాను బావ.

అని చెప్పి నక్షత్ర వెళ్లిపోతుంది. భూమి మనసులో ఏదో ఏర్పాటు చేశాను అంది ఏం ఏర్పాటు చేసింది. అనుకుంటుంది. గగన్‌ కొంచెం ముందుకు వెళ్లగానే గగన్‌ షర్ట్‌ మీద ఉన్న నక్షత్ర ఫోటో కనిపిస్తుంది. భూమి షాక్‌ అవుతుంది. వెనకాలే పరుగెత్తుకెళ్లి షర్ట్‌ వేసుకోవద్దని చెప్తుంది. గగన్‌ తో పాటు కారులో ఆఫీసుకు వెళ్తుంది. గగన్‌ వెనక ఉన్న ఫోటో కనిపించకుండా మేనేజ్‌ చేస్తుంది. గగన్‌ ఆఫీసులో వెళ్లగానే తాను కూడా గగన్‌ వెనకే నడుస్తూ ఎవ్వరికీ ఫోటో ఎవ్వరికీ కనబడకుండా చేస్తుంది. అయినా ఇవాళ రోజంతా ఇలా చేయాలంటే కష్టమే అని భూమి మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంట్లోంచి వచ్చిన ఘోర – టెన్షన్‌ పడుతున్న మనోహరి