Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి ఇంటకి వెళ్తూ.. బాబ్జీని సిమ్ మార్చమని చెప్తుంది. సరేనని అలాగే చేస్తాడు. మరోవైపు అమర్.. రాథోడ్‌కు ఆఫీసుకు ఫోన్ చేసి బాబ్జీ ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో కనుక్కోమని చెప్తాడు. అలాగే మనోహరి ఫోన్ కూడా ఇంటికి వెల్లే వరకు అబ్జర్వ్ లో పెట్టమని చెప్తాడు. దీంతో ఆఫీసుకు ఫోన్ చేసిన రాథోడ్ ఫోన్ మాట్లాడుతూ షాక్ అవుతాడు. ఫోన్ కట్ చేసి మనోహరి, బాబ్జీ ఒకే ప్లేస్ లో ఉన్నట్టు ట్రేస్ అయిందట సార్. అని చెప్తాడు. దీంతో అమర్ ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు రామ్మూర్తి ఇంటికి వస్తాడు.
రామ్మూర్తి: ఓసే మంగళ.. మంగళ
మంగళ: అబ్బాబ్బా ఇదేమైనా లంకంత కొంప ఉన్నది ఒకటే గది దానికెందుకు అంతలా అరుస్తావు.
రామ్మూర్తి: ఇదిగో తీసుకో.. ఇక్కడ నిలబడి నా ముఖం చూస్తావేంటి..? వెళ్లి కడుగు.
మంగళ: నీ ముఖం కూడా పక్కకు తిప్పి చూస్తే నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో నీకు అర్తం అవుతుంది.
అని మంగళ చెప్పగానే పక్కకు చూడగానే భాగీ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. రామ్మూర్తి షాక్ అవుతాడు. భాగీ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. భాగీ పలకకుండా ఉంటుంది. దీంతో మంగళ మొగుడు కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టాడు అది ఎలా చెప్తుంది అంటుంది. భాగీ కూడా అవునని అంటుంది.
రామ్మూర్తి: భాగీ నువ్వేమి బాధపడకు అమ్మా.. అది నీ ఇల్లు, నీ కాపురం మనస్పర్థలు లేని కాపురాలు ఉండవమ్మా.. వాటిని దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించాలి. ఈరోజు పొమ్మన్న బాబుగారే రేపు రమ్మంటారు చూడు. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి.
భాగీ: సరే నాన్నా.. నాకు భయమేసింది నాన్నా..
రామ్మూర్తి: నువ్వు ఏడ్చి ఈ నాన్నను కూడా ఏడ్పించావు. కొద్ది రోజులు పోతే అన్ని సర్ధుకుంటాయి.
అని రామ్మూర్తి చెప్తుండగానే భాగీ అనుమానంగా ఈ క్యారేజ్ కట్టుకుని ఎక్కడికి వెళ్లారు అని అడుగుతంది రామ్మూర్తి ఏదో చెప్పి బయటకు వెళ్లిపోతాడు. విషయం తెలియగానే ముసలోడు గుండె ఆగి చనిపోతాడు అనుకుంటే ఇంత ఉషారుగా ఉన్నాడేంటి.. అని మనసులో అనుకుంటుంది మంగళ. బయటకు వెళ్లిన రామ్మూర్తి ఏడుస్తుంటాడు. భాగీ పరిస్థితి తలుచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తాడు. గార్డెన్ లో కూర్చున్న గుప్త దగ్గరకు డల్లుగా వస్తుంది ఆరు.
గుప్త: ఏమైనది బాలిక.
ఆరు: ఇల్లంతా బోసి పోయింది. మిస్సమ్మ ఉంటే ఇల్లంతా ఎంత హడావిడిగా ఉండేది గుప్త గారు. మిస్సమ్మ వెళ్లి 24 గంటల కాలేదు. అప్పుడే మిస్సమ్మ లేని వెలితి అందరి ముఖాల్లోనూ కనిపిస్తుంది.
గుప్త: నిజమే బాలిక. నీ కుంటుంబము నీవు లేవన్న విషయం తెలిసిన క్షణములో ఎంత బాధపడ్డారో ఇప్పుడు అలాగే ఉన్నారు.
ఆరు: పిల్లలు పైన ఉన్నారు. అత్తయ్యోమే ఒంటరిగా కుస్తీ పడుతుంది. మిస్సమ్మ ఎప్పుడు తిరిగి వస్తుందో.. ఏమో..?
ఇంతలో మనోహరి హ్యాపీగా ఇంటికి వస్తుంది. ఆరు కోపంగా మనోహరిని చూసి తిట్టుకుంటుంది. ఎవరు ఎంత ఎక్కువగా ఏడిస్తే దీనికి అంత ఆనందంగా ఉంటుంది గుప్త గారు అంటుంది. లోపలికి వెళ్లిన మనోహరిని చూసి భోజనం చేయమని అంజు చెప్తుంది. నిర్మల చేసిన వంట తినలేక అందరూ ఇబ్బంది పడుతుంటారు. ఇంతలో అమర్ ఇంటికి వస్తాడు.
ఆరు: ఏమైంది ఈయనెందుకు అంత పాస్ట్ గా వెళ్తున్నారు. నేను ఒక్కదాన్నే వెళ్లి ఏం చేస్తాను త్వరగా రండి గుప్త గారు.
అని కిటికీ దగ్గరకు వెళ్తారు. లోపలికి వెళ్లిన అమర్ గట్టిగా మనోహరిని పిలుస్తాడు. మనోహరి హ్యాపీగా ఇంటికి రాగానే నన్నే పిలుస్తున్నాడు అంటే అనుకుంటూ బయటకు వస్తుంది.
అమర్: నువ్వు మధ్యాహ్నం బయటకు ఎందుకు వెళ్లావు. చెప్పు మనోహరి..
మనోహరి: అది అమర్ ఫ్రెండ్ ను కలవడానికి.
అమర్: నిన్ను చంపడానికి బాబ్జీ నాకు ఫోన్ చేసినప్పుడు ఇద్దరు పక్కనే ఉన్నట్లు తెలిసింది.
రాథోడ్: చెప్పండి మేడం సార్ అడుగుతున్నారు కదా..? బాబ్జీ గాడు సార్‌కు ఫోన్ చేసినప్పుడు మీరు వాడి పక్కన ఎలా ఉన్నారు.
మనోహరి: నేను వాడి పక్కన ఉండటమేంటి? ఎందుకు ఉంటాను.
అమర్: ఉన్నావు మనోహరి అది అర్తం కాకే నిన్ను అడుగుతున్నాను.
ఆరు: గుప్త గారు మిస్సమ్మను పంపించేశాక మా ఆయనకు దగ్గర కావడానికి ప్లాన్ చేసినట్టు ఉంది.
గుప్త: ఆ బాలిక నువ్వు అనుకున్నట్టు కాదు
మనోహరి: అంటే వాడు నా పక్కనే ఉండి నన్ను చంపేస్తానని నీకు ఫోన్ చేశాడేమో..
అమర్: మనోహరి నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. కలకత్తా వెళ్లిపో..
అని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. వెంటనే తన మాటలతో అమర్ ను కన్వీన్స్ చేస్తుంది. అమర్ సరే ఇక్కడే ఉండు కానీ ఎట్టి పరిస్థుల్లోనూ బయటకు వెళ్లకు అని జాగ్రత్తలు చెప్తాడు. సరేనని లోపలికి వెళ్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!