Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి కారులో వెళ్తుంటే.. ముసుగు వ్యక్తి ఫాలో చేస్తుంటాడు. అది గమనించిన మను కోపంగా కారులో ఉన్న గన్ తీసుకుని కిందకు దిగుతుంది.
మను: రేయ్ ఎవర్రా నువ్వు.. నాకు నీకు ఏంట్రా సంబంధం.. నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావు.. నేను చేసిన ద్రోహం ఏంటి..? నా మీద నీకు పగ ఏంటి..? రేయ్ మర్యాదగా బయటకు రారా..? రేయ్ పిరికోడిలా దాక్కోవడం కాదు బయటకు రా..? నువ్వు ధైర్యం ఉన్న మగాడివే అయితే నా ముందుకు రా.. ఫేస్ టూ ఫేస్ తేల్చుకుందాం రారా బయటకు
వెనక నుంచి మను భుజం మీద ఎవరో చేయి వేస్తారు. మనోహరి భయంతో వణికిపోతూ.. తిరిగి చూస్తుంది. అమర్ ఉంటాడు.
అమర్: నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మనోహరి.. నీ చేతిలో ఈ గన్ ఏంటి..? ఎవరిని వెతుకుతున్నావు.
మను: అది నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది అమర్.
అమర్: ఎవరు ఫాలో చేస్తున్నారు..?
మను: తెలియదు తల నుంచి కాళ్ల వరకు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. తను నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు
అమర్: నేను నిన్ను ఇంట్లో ఉండమన్నాను కదా..? బయటకు ఎందుకు వచ్చావు..
మను: అది చిన్న పని ఉండి వచ్చాను..
అమర్: ఏంటా పని
మను: అది పర్సనల్ పని అమర్
అమర్: సరే నీ పర్సనల్ నేను అడగను కానీ నీకు థ్రెట్ ఉందని తెలుసు కదా..? బయట తిరగొద్దని చెప్పాను కదా.. అయినా నీకు ఈ గన్ ఎక్కడిది..? ఎవరు ఇచ్చారు..?
మను: నేనే నా సేప్టీ కోసం తీసుకున్నాను..
అమర్: లైసెన్స్ ఉందా..? పోలీస్ స్టేషన్‌లో పర్మిషన్ తీసుకున్నావా..?
మను: లేదు. తీసుకోలేదు
అమర్: ఏంటి మనోహరి ఇది.. ఒక మిలటరీ ఆఫీసర్ ఇంట్లో ఉంటూ పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేని గన్ వాడుతున్నావా..? ఇది ఎంత క్రైమో తెలుసా..? నీకు
మను: సారీ అమర్ నాకు ఈ ఫార్మాలీటీస్ ఏమీ తెలియదు.. నాకు థ్రెట్ ఉందని తీసుకున్నాను అంతే..
అమర్: నా ఇంట్లో ఉన్నంత వరకు నీ బాధ్యత నాది నన్ను దాటి నీ జోలికి ఎవ్వరూ రారు.. నీకు ఏ వెపన్ అవసరం లేదు.. పద ఇంటికి వెళ్దాం
అని మనోహరి చేతిలో గన్ తీసుకుని అమర్ వెళ్లిపోతాడు. వెనకే మను వెళ్తుంది. ఇక యమలోకంలో ఉన్న ఆరు కూడా మనును ఎవరు కాల్చాలనుకున్నారు..? అని ఆలోచిస్తుంది. మాయా దర్పణంలో చూడాలని అనుకుంటుంది. అందుకోసం నిద్ర పోతున్న గుప్త దగ్గరకు వెళ్లి ఆయన చేతికి ఉన్న ఉంగరం కొట్టేస్తుంది. పక్కకు వెళ్లి ఉంగరం మహిమతో మాయా దర్పణం తెరచి చూస్తుంది. ఇంతలో అక్కడకు యముడు వస్తాడు.
యముడు: ఏమి చేయుచున్నావు బాలిక.. భవిష్యవాణి నీ చేతుల్లోకి ఎలా వచ్చినది.
ఆరు: అయ్యయ్యో నా చేతుల్లో పడలేదు.. నా తల మీద కూడా పడలేదు.. ఇక్కడ ఉంటే ఏంటా అని చూస్తున్నాను అంతే
యముడు: అసత్యం ఆడకుము బాలిక ఆ ఆంగుళీకము లేనిదే భవిష్య వాణి గోచరించదు.. తెరువబడదు.. ( ఆర తన చేతికున్న రింగ్ దాచేస్తుంది) ఏంటది దాచేస్తున్నావు బాలిక.
ఆరు: ఏమీ లేదు రాజు గారు..
యముడు: మళ్లీ మా దేవి అంగుళీయకము దొంగిలించితివా..?
అంటూ అనుమానంగా అడగ్గానే.. లేదు గుప్త గారికి తీసుకున్నాను చూడండి అంటూ చేతులు ముందుకు చాస్తుంది ఆరు. వెంటనే ఆరు చేతికి ఉన్న ఉంగరాన్ని లాక్కుంటాడు యముడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!