Illu Illalu Pillalu Serial Today Episode విశ్వ అమూల్యకి ఐలవ్‌యూ చెప్తాడు. శ్రీవల్లి కొంప ముంచేశాడని తల బాదుకుంటుంది. అమూల్య విశ్వతో రేయ్ పిచ్చి పిచ్చిగా ఉందా.. ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మాట వస్తే చంపేస్తా.. మా అన్న నిన్ను పిచ్చకొట్టుడు కొట్టినా నాతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నావ్‌,, నీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని నాకు తెలుసురా.. మా నాన్ననికి చెప్పి నీ అంతు చూడకపోతే నేను రామరాజు కూతుర్నే కాదు అని వార్నింగ్ ఇచ్చి అమూల్య వెళ్లిపోతుంది.

Continues below advertisement

శ్రీవల్లి చాలా భయపడుతుంది. విశ్వ దగ్గరకు వచ్చి నానా మాటలు అంటుంది. ఓరేయ్ బండ సచ్చినోడా.. మనిషివేమో మా ఊరి కొండ అంత ఉన్నావ్,, బుర్ర మాత్రం పెసర గింజ అంత లేదు.. కాసేపు ఆగు మా మామయ్య ఇంట్లో నా శవం చూద్దువు గాని అని తిడుతుంది. కంగారుగా బయల్దేరుతుంది.

రామరాజు ఊరు బయల్దేరుతాడు. తిరుపతితో ఈ రెండు రోజులు రైస్‌ మిల్లు నువ్వు నడిపోడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. రామరాజు వెళ్తుంటే వేదవతి ఏడుస్తుంది. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తా కదా అని రామరాజు భార్యకి సర్ది చెప్తాడు. రామరాజు వెళ్లిపోతాడు.

Continues below advertisement

ప్రేమ, ధీరజ్ గ్రౌండ్‌లో పరుగు పందెం పెట్టుకుంటారు. ధీరజ్ ప్రేమతో పరుగెత్తలేక ఓడిపోతాడు. తర్వాత ప్రేమ ఒక్కర్తే పరుగెడుతుంది. ధీరజ్ మనసులో నా మీద పోటీకి దిగి నువ్వు గెలవాలనే చూస్తావని అది నీకు సంతోషం అని నాకు తెలుసు ప్రేమ అందుకే ఓడిపోయా అనుకుంటాడు. ప్రేమతో ఏదో ఒక రోజు నువ్వు పోలీస్ అవుతావు.. ప్రేమ.. పోలీసు అవుతావు అని అంటాడు. దాంతో ప్రేమ ధీరజ్‌ నవ్వుకుంటారు. ప్రేమ ధీరజ్‌ని తరుముతుంది.  ధీరజ్ కింద పడిపోవడంతో ప్రేమ పెద్దగా నువ్వుతుంది. ధీరజ్ ప్రేమని అలా చూస్తూ ఉండిపోతాడు.

అమూల్య సీరియస్‌గా ఇంటికి వస్తుంటే శ్రీవల్లి వెనకాలే పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. అమూల్యని శ్రీవల్లి పక్కకి తీసుకెళ్తుంది. ఆ ఎలుగు బంటి గాడు నాకు ప్రపోజ్ చేశాడు వాడి సంగతి నాన్నకి చెప్తా అంటుంది. నువ్వు చెప్తే మీ నాన్న వాళ్లతో గొడవ పడతారు. కత్తులతో నరుక్కుంటారు. ఎవరో ఒకరు పోతారు.. ఎవరు పోయినా పర్లేదు అంటే చెప్పేయ్ అంటుంది. అలా ఎలా వదిలేయాలి వదినా ఇప్పుడు వదిలేస్తే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు అని అమూల్య అంటుంది.

వల్లి అమూల్యతో ఎవరికి ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలీదు కదా వాడికి నీ మీద ప్రేమ పుట్టింది..వాడు చెప్పాడు.. నచ్చితే ఓకే లేదంటే వదలేయ్ అని అంటుంది. వాడు నీకు బావే కదా చెప్తే తప్పేముంది అని శ్రీవల్లి అంటుంది. వాడో వెధవ అని అమూల్య అంటే ఏమో వాడు మారాడేమో నిజంగానే మన రెండు కుటుంబాల్ని కలపాలి అనుకున్నాడామో.. మీ అమ్మ పుట్టింటికి దూరం అయింది.. పుట్టింటి ప్రేమ కోసం ఆశగా ఎదురు చూస్తుంది.. మన రెండు కుటుంబాలు కలిస్తేనే మీ అమ్మకి ఆనందం.. ఆ ఆనందం మీ అమ్మకి ఎప్పుడు ఇస్తారో.. ఎప్పుడు కన్న రుణం తీర్చుకుంటారో ఏమో.. ఒక మనిషి మీద మనం ఎప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉండకూడదు.. రెండు కుటుంబాలు త్వరగా కలిసిపోతే బాగున్న అని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి మాటలకు అమూల్య ఆలోచనలో పడుతుంది.

నర్మద ఆఫీసర్లతో వచ్చి భద్రావతి, సేనాపతి కబ్జా చేసిన 20, 20 ఎకరాల దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న కనెస్ట్రక్షన్స్‌ని సీజ్ చేయిస్తుంది. విషయం భద్రావతి, సేనలకు తెలుస్తుంది. ఇద్దరూ నర్మద దగ్గరకు వస్తారు. ఇది ఎవరితో తెలుసా ఎందుకు సీజ్ చేశావ్ అని భద్రావతి అంటే ఇది ఎవరిది అని తెలీకుండా చేస్తానా అని నర్మద అడుగుతుంది. ఇందులో కొంత గవర్నమెంట్ స్థలం ఉంది అది మీరు కబ్జా చేశారు.. ప్రభుత్వ అనుమతి లేకుండా అందులో కట్టడాలు చేస్తున్నారు అని అంటుంది. ఇదంతా నీ మామ నీతో చేయిస్తున్నాడని నాకు తెలుసు అని సేనాపతి అంటే ఇందులోకి కుటుంబ విషయాలు తీసుకురావొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.