Nindu Noorella Saavasam Serial Today Episode: చంభాను పిలిచి తాను రూంలోకి వెళ్తున్నానని బయట నుంచి ఎవరైనా వస్తే తనకు చెప్పమని మనోహరి రూంలోకి వెళ్తుంది. మరోవైపు మనోహరి, యాదమ్మ ఇంకా రాలేదేంటి అని అమర్ అడగ్గానే.. వాల్లు లగేజీ తెచ్చుకుంటున్నారని అంజు చెప్తుంది. మనోహరి రూంలోకి వెళ్లి రణవీర్‌ను పిలుస్తుంది.
మనోహరి: రణవీర్.. నేనే.. రణవీర్ ఎక్కడ దాక్కున్నావు.. బయటకు రా (రణవీర్ బాత్రూంలోంచి వస్తాడు.) నేను బయలుదేరుతున్నాను ఈ రెండు రోజులు ఇంట్లో జాగ్రత్తగా ఉండు
రణవీర్: అది సరే మనోహరి మరి ఆ బాంబు ఏమైందో తెలియదు కదా మనకు
మను: అది ఆ మంగళ దాన్ని కారులో పెట్టిందట.. తీయడం కుదరడం లేదు.. అమర్ ఏమో అక్కడే ఉన్నాడు. దాంతో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. సరే వదిలేసెయ్ దాన్ని ఇంకోలా ఉపయోగించుకుందాం.. నేన ఊరు వెళ్లి ఆ భాగీ పని ఫినిష్ చేస్తాను
రణవీర్: అదేంటి మీతో పాటు అమర్ వస్తున్నాడు కదా భాగీని ఎలా చంపేస్తావు
మను: అమర్ మాతో రాకుండా చేస్తాను
రణవీర్: అమర్‌ను ఎలా ఆపుతావు
మను: మిస్సయిన బాంబు ద్వారా అమర్ మాతో రాకుండా చేస్తాను..
అంటూ తన సీక్రెట్ ఫోన్ తీసి స్విచ్చాన్ చేసి మేజర్ కు ఫోన్ చేస్తుంది.
మేజర్: హలో ఎవరు.. చెప్పండి..?
మను: నేను ఎవరైతే మీకెందుకు కానీ మీకో ముఖ్యమైన విషయం చెబుదామని ఫోన్ చేశాను
మేజర్: ముఖ్యమైన విషయమా..? ఏంటా విషయం
మను: మీరు ఒక బాంబు కోసం వెతుకుతున్నారు కదా..?
మేజర్: అవును అది మీకెలా తెలుసు..? మీడియా నుంచి కాల్ చేస్తున్నారా..? రిపోర్టరా మీరా..? ఏ టీవీ చానెల్.. పేపరా..?
మను: లేదు ఆ బాంబు సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఒక షాపులో ఉంది
మేజర్: అసలు ఎవరు మీరు..? ఆ విషయం మీకెలా తెలుసు
మను: వెంటనే వెళ్లి ఆ బాంబును డిప్యూజ్ చేయండి లేకపోతే పేలిపోతుంది
అంటూ మేజర్ ఎవరు మీరు అని అడుగుతుండగానే మనోహరి కాల్ కట్ చేస్తుంది. అంతా విన్న రణవీర్ షాకింగ్‌తో కూడిన ఆశ్చర్యపోతాడు.
రణవీర్: మనోహరి ఎవరతను.. ఇంతకీ నువ్వు ఎవరికి కాల్ చేశావు
మను: అమరేంద్ర పై అధికారికి ఫోన్ చేశాను.
రణవీర్: ఏ ఎందుకు.? ఇప్పుడు ఆయనకు ఎందుకు ఈ విషయం చెప్పావు..?
మను: ఈ బాంబు కేసు అమర్ చూస్తున్నాడు.. కాబట్టి.. ఇప్పుడు పై అధికారి ఊరికి రావాల్సిన అమర్‌ను అక్కడికి ఆ బాంబు కోసం పంపిస్తాడు కాబట్టి.
రణవీర్: నీ బ్రెయిన్ సూపర్ మనోహరి.. ఇంత టెన్షన్‌లో కూడా నీ బ్రెయిన్ పాదరసంలా పని చేస్తుంది. ఇంతకీ ఆ భాగీని ఎలా ఫినిష్ చేయబోతున్నావు..
మను: సింపుల్ హైవే నుంచి మట్టి రోడ్డు తీసకుని అడవిలోకి తీసుకెళ్లి అందరినీ కన్పీజ్ చేసి భాగీని ఒంటరిని చేసి పని పూర్తి చేస్తాను
రణవీర్: ఓ సూపర్ బెస్ట్ ఆఫ్ లక్
సరే నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు రణవీర్ నేను వెళ్తున్నాను అని లగేజీ తీసుకుని మనోహరి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!