Nindu Noorella Saavasam Serial Today Episode:  టెడ్డి బేర్‌ తీసుకుని భాగీ రూంలోకి వెళ్తుంది అంజు. భాగీ పడుకుని ఉండటంతో చెల్లి కోసం కదా టెడ్డిబేర్‌ తెచ్చింది ఇక్కడే పెట్టేసి వెళ్దాం అనుకుంటుంది.

Continues below advertisement

అంజు: బుజ్జి కన్నా అమ్మకుట్టి చూడు నీ కోసం ఏం తెచ్చాను. నువ్వు బయటకు వచ్చాక దీంతోనే ఆడుకోవాలి. నీకు బోలెడన్ని బొమ్మలు కొనిస్తాను. నువ్వు ఏం అడిగినా కొనిస్తాను.. ప్రస్తుతానికి దీంతో ఆడుకో

అంటూ వెళ్లిపోతుంటే.. బేబీ అక్కా అని పిలుస్తుంది. వెంటనే అంజు భాగీ దగ్గరకు వెళ్తుంది.

Continues below advertisement

అంజు:  చెల్లి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడావా ఈ విషయం అందరికీ చెప్పాలి

అని తమ రూంలోకి వెళ్లి ఆనంద్‌, ఆకాష్‌, అమ్ములను తనతో రమ్మని అడుగుతుంది.

అమ్ము: ఎక్కడికే

అంజు: రండి చెప్తాను

ఆనంద్: హోం వర్క్‌ చేసుకుంటున్నాము అంజు

అంజు: అది తర్వాత చేసుకోవచ్చు మీరు ఇది మిస్‌ అవ్వకూడదు రండి

ఆకాస్‌: ఏంది మిస్‌ అవ్వకూడదు అంజు

అంజు: అబ్బా ముందు రండి చెప్తాను

సరే అంటూ అందరూ అంజు వెంట భాగీ రూంలోకి వెళ్తారు.  

అంజు: చూడండి

అమ్ము: ఏముంది అక్కడ మిస్సమ్మ నిద్రపోతుంది కదా…

అంజు: నాకు థాంక్స్‌ చెప్పింది

ఆనంద్: నిద్ర పోతున్న మిస్సమ్మ నీకెలా థాంక్స్‌ చెప్తుంది

అంజు: చెప్పింది మిస్సమ్మ కాదు అటు చూడండి

ఆకాష్‌: ఏంటి ఆ టెడ్డి బేర్‌ థాంక్స్‌ చెప్పిందా..?

అంజు: ఆ బొమ్మ ఎలా మాట్లాడుతుంది

అమ్ము: మరి ఎవరు థాంక్స్‌ చెప్పారే..

అంజు: మిస్సమ్మ కడుపులో ఉన్న చెల్లి

పిల్లలు ముగ్గురు  షాక్‌ అవుతారు. పిల్లల సౌండ్‌కు భాగీ నిద్ర లేస్తుంది

భాగీ:  మీరేంటి ఇలా వచ్చారు (ముగ్గురు నవ్వుతుంటారు) ఆగండి ఎందుకు అంజును చూసి నవ్వుతున్నారు

అమ్ము: అంజు కామెడీ చేస్తుంది మిస్సమ్మ

అంజు:  నేనే కామెడీ చేయడం లేదు

అమ్ము: మిస్సమ్మ నీ కడుపులో ఉన్న బేడీ తనకు థాంక్స్‌ చెప్పిందట..

ఆనంద్: తన ఫ్యాకెట్‌ మనీతో పుట్టబోయే బిడ్డకు కొత్త టెడ్డిబేర్‌ కొనిచ్చింది కదా అందుకే బిల్డప్‌ ఇచ్చింది

ఆకాష్‌: మా చెవిలో పూలేం లేవు అంజు..  ఈ జోక్స్‌ అన్ని మీ క్లాస్‌లో తొట్టిగ్యాంగ్‌కు చెప్పు

భాగీ: ఆగండి.. అంజు నిజంగా చెల్లి నీతో మాట్లాడిందా..?

అంజు: అవును నిజంగానే మాట్లాడింది మిస్సమ్మ.. నేను టెడ్డిబేర్‌ తీసుకొచి ఇచ్చి వెళ్తుంటే.. థాంక్స్‌ అంజు అన్న బేబీ వాయిస్‌ వినిపించింది.. అది చెప్తుంటే వీళ్లు ఎవ్వరూ నమ్మటం లేదు.. పైగా నవ్వుతున్నారు

అని చెప్పగానే.. భాగీ కూడా తనకు బేబీ జాగ్రత్త చెపింది గుర్తు చేసుకుని నిన్న నేను చెప్పినా ఆయన నమ్మలేదు.. అని మనసులో అనుకుంటుంది.

 అమ్ము: థాంక్స్‌ మాత్రమేనా..? లేక ఇంకేమైనా చెప్పిందా..?

ఆనంద్: కంగ్రాట్స్‌ కూడా చెప్పిందేమో..? ఎందుకంటే ఆ బేబీ పుట్టాక అంజుకు అక్కగా ప్రమోషన్‌ వస్తుంది కదా..?

ఆకాష్‌: ఇలాంటి స్టోరీస్‌ చెప్పడంలో నువ్వు ఫస్ట్‌ ఉంటావు అంజు

అంజు: మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు. అంతే కానీ మీరు నన్ను ఎగతాళి చేయకండి

భాగీ: ( మనసులో) లేదు అంజు చెప్పింది నిజం కడుపులో బేబీ మాట్లాడుతుంది.

అమర్‌: ఏమైంది అంజు అంత సీరియస్‌గా ఉన్నావు

అమ్ము: అది సీరియస్‌గా కామెడీ చేస్తుంది డాడీ

ఆనంద్: మిస్సమ్మ కడుపులో బేబీ తనకు థాంక్స్‌ చెప్పిందట

ఆకాష్‌: పొట్ట పగిలే లాగా తెగ నవ్విస్తుంది డాడీ

అమర్‌:  ఓ నిన్న మిస్సమ్మకు జాగ్రత్త చెప్పింది.. ఇవాళ అంజుకు థాంక్స్‌ చెప్పిందా..?

అమ్ము: ఎవరు డాడీ

అమర్‌: ఇంకెవరు మన స్వీట్‌ బేబీ

అంటూ అమర్‌ చెప్పగానే.. పిల్లలు ముగ్గురు నవ్వుతుంటారు. అమర్‌ మాత్రం భాగీకి థ్రెట్‌ ఉందని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఆ విషయం విన్న పిల్లలు నలుగురు భయపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!