Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, రామ్మూర్తితో మిస్సమ్మను తీసుకెళ్లడానికే వచ్చాను. అని చెప్పగానే రామ్మూర్తి తీసుకెళ్లండి బాబు.. భాగీ ఇప్పుడు మీ భార్య, వాళ్లకు అమ్మ.. మీరు ఎప్పుడైనా తీసుకెళ్లండి అని చెప్తాడు రామ్మూర్తి. దీంతో అమ్ము హ్యాపీగా అయితే ఇప్పుడే మిస్సమ్మను తీసుకెళ్లవచ్చా..? అని అడుగుతుంది. అది భాగీ ఇష్టం అమ్మా ఇప్పుడే వెళ్లాలి అనుకుంటే వెళ్లండి. రెండు రోజులు ఉండి వెళ్లాలి అనుకుంటే వెళ్లొచ్చు అని చెప్తాడు రామ్మూర్తి. ఇంతలో మిస్సమ్మ నేను రెండు రోజులు ఉండి వస్తాను. ఆయన రమ్మని గట్టిగా పిలవట్లేదు కదా..? కానీ మా నాన్న ఇక్కడ ఉండమని ప్రేమగా అడుగుతున్నారు అందుకే.
అమర్: మిస్సమ్మ ఇంటికి వెళ్దాం పద. నేను పిల్లలు నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాం. రెండు రోజులు ఆగి కాదు. ఇవాళే మాతో రా.. సరేనా..?
భాగీ: సరే అండి ఇప్పుడే బట్టలు తెచ్చుకుంటాను.
రామ్మూర్తి: బాబుగారు గంటన్నర సేపు రాహుకాలం ఉంది. అది వెళ్లాక మీరు వెల్లుదురు. ఇబ్బందేం లేదు కదా..? బాబు.
అమర్: ఇబ్బందేం లేదండి.
అని చెప్పగానే రామ్మూర్తి పిల్లలకు ఐస్‌క్రీమ్ తీసుకురావడానికి వెళ్తుంటే.. అమర్ బయటకు వెళ్లి సారీ చెప్పబోతుంటే.. వద్దని రామ్మూర్తి మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య వచ్చినా.. మీకు మీరే పరిష్కరించుకోవాలి. అని చెప్పి వెళ్తాడు. అమర్ లోపలికి వచ్చేసరికి భాగీ పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అమర్ ఎమోషన్ అవుతాడు. మరోవైపు యముడు కోపంగా ఎవరు తనను డిస్టర్బ్ చేశారని గుప్తను తిడతాడు. దీంతో గుప్త ఆరు వల్లే మీకు డిస్టర్బ్ అవుతున్నారని చెప్తాడు.
యముడు: ఇంత కష్టంలో కూడా ఆ బాలిక ఇంత సంతోషంగా ఎలా ఉంది.
గుప్త: అయ్యో ప్రభు ఇంత జరిగినా మీకు ఇంకా ఆ బాలిక గురించి అర్థం కాలేదు. ఆ బాలిక తనకు తన కుటుంబానికి ఎదురైన కష్టాలను చూసిన తర్వాత నాకు మానవ లోకంపై అభిమానం ఏర్పడింది.
యముడు: ఏది ఏమైనా ఈ అమావాస్య నాడు ఆ బాలికను మనం మన లోకానికి తీసుకెళ్లాలి.
గుప్త: నా అనుభవంతో చెప్తున్నాను. మనం అనుకున్నప్పుడు ఆ బాలిక రాదు.
ఇంతలో ఆరు వస్తుంది. ఎంటి రాజు గారు మా గుప్త గారిని భయపెడుతున్నారు అని అడుగుతుంది. నన్ను ఎలా తీసుకెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా..? అని అడుగుతుంది. ప్రణాళిక వేయాల్సిన అవసరం మాకెం ఉంది. అని యముడు చెప్పగానే యముడిని మళ్లీ పొగడ్తలతో ముంచెత్తుతుంది ఆరు. భాగీ వస్తుందని ఆరు సంతోషంగా ఉంటుంది. ఇంతలో అమర్, భాగీ పిల్లలు వస్తారు. వాళ్లను చూసిన మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. నిర్మల వాళ్ళకు దిష్టి తీస్తుంది.
అంజు: నిమ్ము డార్లింగ్ ఇది నీకు కొంచెం ఎక్కువగా అనిపించడం లేదా..?
నిర్మల: అనిపించడం లేదు. ఇలా మీ అందరిని సంతోషంగా చూశారు కాబట్టే మిస్సమ్మ మా ఇంట్లోంచి వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఆ దేవుడి దయ వల్ల మీరందరూ కలుసుకున్నారు.
అంజు: హారతి మిస్సమ్మకు కదా.. ఇచ్చుకోండి వెళ్లిపోతాను.
భాగీ: నువ్వు కూడా ఉంటేనే మన ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది అంజు నువ్వు కూడా ఉండు. మీరు తీయండి అత్తయ్యా..
అని చెప్పగానే నిర్మల దిష్టి తీస్తుంది. అంతా గమనిస్తున్న మనసులో రగిలిపోతుంది. అందరూ లోపలికి వస్తారు. భాగీని చూసి మనోహరి ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అందరూ వెళ్లిపోయాక భాగీ, మనోహరి రూంలోకి వెళ్తుంది. ఏం జరిగింది మను.. నీ కాలు విరిగింది అని విన్నాను. ఎక్కడ పడితే అక్కడ కాలు పెడితే ఇలాగే ఉంటుంది అని వార్నింగ్ ఇస్తుంది. నన్ను పర్మినెంట్ గా పంపించేసి నువ్వు ఆయన పక్కన పర్మినెంట్ గా సెటిల్ అవుదామనుకున్నావా..? అని అడుగుతుంది. ఆరు ఫోటో గురించి పిల్లలకు నువ్వే నూరిపోశావా అంటూ నిలదీస్తుంది. దీంతో ఒక్కసారి పంపించిన దాన్ని మళ్లీ పంపిచలేను అనుకున్నావా..? అనగానే నువ్వు ఎన్నిసార్లు పంపించినా.. నేను మళ్లీ మళ్లీ వస్తాను. అది నా పవర్ కాదు. అంటూ తాళి చూపిస్తూ దీని పవర్. అని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!