Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ మీద మనోహరి విష ప్రయోగం చేయించిందని యమలోకంలోని యముడు, విచిత్ర గప్తుడు మాయా దర్పణంలో చూస్తారు.
గుప్త: వీక్షించితిరా ప్రభు ఆ మనోహరి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేయుచున్నదో
యముడు: అన్నియు వీక్షించుచున్నాను గుప్త
గుప్త: కృష్ణ పరమాత్మ కూడా శిశు పాలుడిని వంద తప్పుల వరకే క్షమించాడు ప్రభు తమరు ఎందుకని ఈ బాలికను శిక్షించకుండా ఉపేక్షిస్తున్నారు
యముడు: దేనికైనా సమయం రావాలి కదా గుప్త
గుప్త: ఆ దుర్మార్గురాలు మన లోకమునకు వచ్చిన పిదప నరకలోమున ఉన్న శిక్షలన్నీ విధించెదను
యముడు: విచిత్రగుప్త మాకును ఆ బాలికపై ఆగ్రహముగా ఉన్నది. కానీ ఆమె ఆయువు తీరే వరకు మనమేమీ చేయలేము..
గుప్త: పాపి చిరాయువు అన్నట్టు ఆ రాక్షాసి అంత త్వరగా మరణించి మన లోకమునకు రాదనుకుంటాను ప్రభు..
యముడు: మృత్యు దేవత ఆదేశించినప్పుడే మన కర్తవ్యం పాటించాలి గుప్త. అంత వరకు మనం ఎవ్వరి చావును కోరరాదు.. భూలోకమున జరుగునది ఆ అరుందతి బాలిక కంట పడకుండా చూసుకొనుము..
గుప్త: అటులనే ప్రభు… ప్రభూ అటు చూడుము..
అంటూ పక్కనే నిలబడి మొత్తం వింటున్న ఆరును చూపిస్తాడు గుప్త. ఆరును చూసిన యముడు షాక్ అవుతాడు. ఈ బాలిక మొత్తం విన్నదా..? అని మనసులో అనుకుంటాడు. ఆరు ఏడుస్తూ దర్పణంలోకి చూస్తుంది.
ఆరు: నా చెల్లెకి ఏమైంది..? ఎందుకు హాస్పిటల్ లో ఉంది..? చెప్పండి రాజుగారు.. గుప్త గారు చెప్పండి
యముడు: నీ సోదరిపై విష వాయువు ప్రయోగం జరిగింది బాలిక
ఆరు: ఎవరు చేశారు
గుప్త: ఇంకెవరు చేస్తారు.. ఆ మనోహరి
ఆరు: ఇప్పుడు నా చెల్లి పరిస్థితి ఏంటి..?
యముడు: చూస్తున్నావు కదా చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంది
ఆరు: నా చెల్లి చావడానికి వీల్లేదు తన కడుపులో ఒక బిడ్డ ఉంది. వాళ్లను కాపాడండి యమధర్మరాజా..? మీ కాళ్లు పట్టుకుంటా..? నన్ను కనికరించండి.. ఫ్లీజ్
యముడు: అది నా చేతుల్లో లేదు బాలిక
ఆరు: మీరైనా చెప్పండి గుప్త గారు. ఎలాగైనా నా చెల్లి బతకాలి. తను నిండు నూరేళ్లు పిల్లలతో కలిసి ఉండాలి
గుప్త: క్షమించుము బాలిక. మేము నిమిత్త మాత్రులం మాత్రమే ఈ విషయంలో మేము నీకు సహాయం చేయలేని నిస్సహాయులం
ఆరు: అయ్యో భాగీ ఆ దేవుడికే నీ మీద దయ లేనప్పుడు ఇక నిన్ను ఎవరు కాపాడతారు..? నీ కడుపులో ఉన్న బిడ్డను ఎవరు రక్షిస్తారు
అని ఏడుస్తుంది. యముడు, గుప్త అక్కడి నుంచి వెళ్లిపోతారు. భూలోకంలో సరస్వతి వార్డెన్ ఆశ్రమంలో పిల్లలకు టిఫిన్ పెడుతుంటుంది. ఇంతలో రాజు కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తాడు.
రాజు: మేడం భాగమతి మేడం హాస్పిటల్‌లో.. ఐసీయూలో ఉన్నారట.. పరిస్తితి చాలా సీరియస్‌గా ఉందట
సర్వస్వతి: ఏం జరిగింది రాజు గారు.. (జరిగిన విషయం చెప్తాడు రాజు) ఈ దాడి కచ్చితంగా ఆ మనోహరే పనే అయుంటుంది. ఆ రాక్షసి ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటుంది. దేవుడు దాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడో రాజు గారు
రాజు: ఆ దుర్మార్గురాలు గురించి మీరు భాగీ గారికి చెప్పారు కదా మేడం. ఇంకా ఆవిడ ఆ ఇంట్లో ఎందుకు ఉంది.
సర్వస్వతి: నేను మనోహరి గురించి భాగీ గారికి చెప్పాను. కానీ మనోహరి గురించి ఏదో కారణం చేత భాగీ గారు అమరేంద్ర గారికి చెప్పలేదు
రాజు: పదండి మేడం మనం వెళ్లి అమరేంద్ర గారికి అన్ని విషయాలు చెబుదాం
సర్వస్వతి: రాజు గారు అమరేంద్ర గారికి ఏ విషయం చెప్పొద్దని భాగీ గారు నా దగ్గర మాట తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది భాగీ గారి గురించి పదండి రాజు గారు హాస్పిటల్‌కు వెళ్దాం
అంటూ అందరూ కలిసి హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ నలుగురు కలిసి భాగీ కోసం గుడికి వెళ్తుంటే వారితో పాటు గుడికి వెళ్లి హోమం చేయిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!