Nindu Noorella Saavasam Serial Today Episode: బాగీకి అరుంధతి ఫోటో చూపించడానికి బయటకు వస్తుంది అమ్ము. అమ్మును ఎలాగైనా ఆపాలని అనామిక, మనోహరి వెనకాలే పరుగెత్తుకొస్తారు. ఇంతలో భాగీని మ అమ్మ ఫోటో చూద్దువురా అని అమ్ము పిలుస్తుంది. భాగీ పరుగెత్తుకొచ్చి ఫోటో తీసుకోబోతుంటే.. అమర్ వచ్చి ఫోటో లాక్కుంటాడు. అనామిక, మనోహరి రిలాక్స్ అవుతారు.
అమ్ము: సారీ డాడ్
అమర్: మీకు ఇది ఎక్కడిది అన్ని ఫోటోస్ దాచేశాను కదా మీకు ఇది ఎక్కడికి అమ్ము చెప్పు..
అమ్ము: అంటే కొడైకెనాల్‌లో అమ్మ నాకు ఇచ్చింది. అప్పటి నుంచి నా దగ్గరే దాచుకున్నాను
అమర్: అమ్మ ఫోటో మీరు చూడకూడదని దాచేయలేదు. అమ్మను చూసినప్పుడల్లా మీకు గుర్తొచ్చి బాధపడతారని దాచేశాను
అమ్ము: సారీ డాడ్ అమ్మను రోజూ చూడొచ్చని ఆ ఒక్క ఫోటో మాత్రం నా దగ్గరే పెట్టుకున్నాను డాడ్. ఆరోజు మీకు ఇవ్వనందుకు రియల్లీ సారీ డాడ్
మనోహరి: ఆ ఫోటో అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపో అమర్ ఫ్లీజ్..( మనసులో అనుకుంటుంది.)
అనామిక: వెళ్లిపోండి.. ఆ ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోండి..( మనసులో అనుకుంటుంది)
అమర్ ఫోటో తీసుకుని వెళ్లిపోతాడు.
భాగీ: అసలు అక్క ఫేస్ చూసే అదృష్టం ఈ జన్మకు లేనట్టుంది. ఆరు అక్క ఫోటో ఇప్పటి వరకు చూడలేదంటే బాగోదు. మరి ఫోటో చూపించమని ఎలా అడగాలి..? ( మనసులో అనుకుంటుంది)
అమ్ము: సారీ మిస్మమ్మ
అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత అంజు అమ్ము వాళ్లను పిలుస్తుంది. ఎవ్వరూ పలకరు కానీ మనోహరి చూసి అంజు రూంలోకి వెళ్తుంది. ఏంటి అంజు ఏమైనా కావాలా..? అమ్ము వాళ్లు కింద ఆడుకుంటున్నారు అని చెప్తుంది. మిస్సమ్మ ఎక్కడుంది అని అడిగితే తను కిచెన్‌లో ఉందని చెప్తుంది.
అంజు: రణవీర్ అంకుల్ గురించి ఒక విషయం చెప్పాలి
మను: ఏ విషయం చెప్పాలి అంజు..
అంజు: నన్ను కిడ్నాప్ చేసింది రణవీర్ అంకులేమో అని డౌటుగా ఉంది.
మను: ( షాకింగ్ గా) ఏం మాట్లాడుతున్నావు అంజు అసలు రణవీర్ గారు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తారు. నువ్వంటే ఆయనకు ఎంత ఇష్టమో.. ఈ విషయం మీ డాడీకి తెలిస్తే మళ్లీ రణవీర్ అంకుల్‌ను ఇంటికి రానివ్వడు.. మళ్లీ మిమ్మల్ని కూడా కలనివ్వరు.
అంజు: మరి నాకు ఈ డౌటు క్లియర్ అవ్వాలంటే రణవీర్ అంకుల్‌తోనే మాట్లాడాలి కదా.. అంకుల్‌కు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తారా..?
మనోహరి: అంజుకు ఏదో ఒకటి చెప్పి రణవీర్ ఇంటికి పంపిస్తే అప్పుడిక అంజును రణవీర్ తీసుకెళ్లిపోవడం ఈజీ అవుతుంది. చేతికి మట్టి అంటకుండా పని పూర్తి అయిపోతుంది. (మనసులో అనుకుంటుంది) అంకుల్‌ను ఇక్కడకు పిలిస్తే అందరూ ఇంట్లోనే ఉంటారు కదా..? ఒక పని చేయ్ నువ్వే రణవీర్ అంకుల్ ఇంటికి వెళ్లి అడుగు
అంజు: నేనా నేను ఎలా రణవీర్ అంకుల్ ఇంటికి వెళ్లగలను డాడీ ఇంట్లోంచే పంపించరు కదా
మను: చెప్పకుండా వెల్లిపోతే ఎలా ఆపుతారు
అంజు: అమ్మో చెప్పకుండా వెళ్లిపోతే తర్వాత డాడీ కొడతారు.
మను: ఏం లేదు అంజు నీకు చాలా ధైర్యం ఉండేదని మీ అమ్మ చెప్పేది. కానీ నువ్వు ఇలా భయపడుతున్నావేంటి
అంటూ అంజును రెచ్చగొట్టి రణవీర్ ఇంటికి వెళ్తేందుకు ఒప్పిస్తుంది మనోహరి. సరే అంటూ అంజు వెళ్లిపోతుంది. అంజు వస్తున్న విషయం మనోహరి, రణవీర్ కు కాల్ చేసి చెప్తుంది. అజు తన ఇంటిక రాగానే రణవీర్ అంజుకు మాటలు చెప్పి కోల్‌కతా తీసుకెళ్తాడు. తర్వాత రణవీర్ మీద అనుమానం వచ్చిన అమర్ ఆయన ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇల్లు తాళం ఉంటుంది. ఇంతలో భాగీ పోన్ చేసి అంజు కనిపించడం లేదని చెప్తుంది. మరోవైపు అంజును కోల్‌కతా కోర్టుకు తీసుకుపోయి ఉంటాడు రణవీర్. అక్కడ జడ్జి ముందు అంజును దుర్గా నిలబెడతాడు రణవీర్. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!