Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు డీఎన్‌ఏ టెస్ట్ మిస్‌ అయినందుకు మనోహరి బాధపడుతుంది. ఎలాగైనా మరోసారి టెస్ట్ చేయాలని అనుకుంటుంది. అప్పుడే భాగీ కోపంగా మనోహరి రూంలోకి వెళ్లి మనోహరి అంటూ గట్టిగా పిలుస్తుంది. మనోహరి షాకింగ్‌ గా చూస్తుంటుంది.

భాగీ: ఏంటి నువ్వు చేసిన పని

(మనోహరిని కొడుతుంది.)

మనోహరి: నా మీదే చేయి చేసుకుంటావా..? ఇందాకా ఆ సరస్వతి కొట్టింది ఇప్పుడు నువ్వు

భాగీ: నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు నిన్ను ఏం చేసినా పాపం లేదు

మనోహరి: నేనేం చేశాను

భాగీ: స్కూల్‌ లో అంజు బ్లడ్‌ శాంపిల్‌ ఎందుకు తీసుకున్నావు

మనోహరి: నేను శాంపిల్స్‌ తీసుకోవడం ఏంటి..? నాకేంటి అవసరం

భాగీ: నాకు అంతా తెలుసు.. తప్పించుకోలేవు.. నిజం చెప్పు

మనోహరి: అంజు రణవీర్ కూతురేమోనని టెస్ట్‌ చేస్తే తెలిసిపోతుంది కదాని బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నాను

భాగీ: అంజు రణవీర్‌ కూతురైతే నీ కూతురు కాదా..? నువ్వు వాడి భార్యవే కదా? వాడితో కలిసి నువ్వు వదిలేసిన బిడ్డనే కదా మీరు వెతుకుతున్నారు..?

మనోహరి: ఆ బిడ్డతో రణవీర్‌కు చాలా పనుంది

భాగీ: తెలుసు.. బిడ్డతో  రణవీర్‌కున్న పనేంటో నాకు తెలుసు.. బిడ్డ దొరికాక రణవీర్‌ ఏం చేస్తాడో తెలుసు. బిడ్డ దొరక్కపోతే రణవీర్‌ నిన్ను ఏం చేస్తాడో తెలుసు. అందుకే కదా ఆ బిడ్డ కోసం అంతలా వెతుకుతున్నావు. తప్పు చేస్తున్నావు మనోహరి ఈ విషయం ఆయనకు తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు..

మనోహరి: నా బిడ్డ కోసం నేను వెతికితే తప్పా..?

భాగీ: ఫస్ట్‌ టైం నా బిడ్డ అన్నట్టున్నావు. అప్పుడు బిడ్డను వదిలేయడం ఎందుకు ఇప్పుడు వెతకడం ఎందుకు..?

మనోహరి: అదంతా నీకు అనవసరం

భాగీ: ఓకే కానీ మీరు అంజు జోలికి రావొద్దు. మీరు వెతుకుతున్న బిడ్డ అంజు కాదు..

మనోహరి: మా బిడ్డ అంజు కాదని నువ్వెలా చెప్తున్నావు

భాగీ: ఎలా ఏంటి..? నేను ఆయన భార్యను ఆ అయిదు మంది పిల్లలు మా పిల్లలే

మనోహరి: నమ్మమంటావా..?

భాగీ: నమ్మకు నేను ఈ విషయం ఆయనతో చెప్తాను ఆ తర్వాత నీ ఇష్టం

అని భాగీ వెళ్లిపోతుంది. అంజు నా కూతురు కాదని చెప్తుందేంటి అంటూ మనోహరి ఆలోచిస్తుంది. పైకి అమర్‌ రూంలోకి వెళ్లిన భాగీ అక్కడ అమర్‌ బ్యాగ్‌లో బట్టలు సర్దుకోవడం చూసి షాక్‌ అవుతుంది.

భాగీ: ఏంటండి లగేజీ సర్దుకుంటున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు..?

అమర్‌: చిన్న పని ఉంది రెండు రోజుల్లో వస్తాను

భాగీ: పిల్లలకు ఎగ్జామ్స్‌ ఉన్నాయి కదండి ఈ టైంలో మీరు లేకపోతే

అమర్‌: నువ్వు ఉన్నావు కదా పిల్లలను దగ్గరుండి చదివించు

భాగీ: మీరు ఉండటం వేరండి.. మీరు ఉంటే పిల్లలు బుద్దిగా క్రమశిక్షణగా ఉంటారు

అమర్‌: నేను లేకపోయినా పిల్లలను క్రమశిక్షణగా చూసే బాధ్యత నీది

భాగీ: ( మనసులో ఇదేంటి అపశకునంగా కన్ను అదురుతుంది. ఈయనేమో పిల్లలను తాను లేకపోయినా భద్రంగా చూసుకోమని చెప్తున్నారు.) ఇంతకీ మీరు ఏ ఊరు వెళ్తున్నారండి

అని భాగీ అడిగితే నన్ను ఇప్పుడేం అడగకు భాగీ తిరిగి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. పిల్లలకు స్కూల్‌ టైం అవుతుంది. వెళ్లి వాళ్లను రెడీ చేయ్‌ అంటూ అమర్‌ చెప్పగానే.. భాగీ అనుమానంగా కిందకు వెళ్లిపోతుంది. భాగీ వెనకాలే డోర్‌ చాటు నుంచి మనోహరి, యాదమ్మ అంతా గమనిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!