MeghasandesamSerial Today Episode: కేపీకి ఉన్న గండం పోవడానికి మీరా పూజ చేస్తుంటుంది. పూజలో ఏర్పాటు చేసిన కలశంలో మంటలు వస్తాయి. అందరూ షాక్‌ అవుతారు. కేపీ, భూమి వైపు చూడగానే.. ఏదో ప్లాన్‌ చేసినట్టు భూమి సైగ చేస్తుంది. దీంతో కేపీ కూల్‌ అవుతాడు. కలశంలో మంటలు చెర్రి ఆర్పేస్తాడు.

Continues below advertisement

మీరా:  అయ్యయ్యో ఏంటి ఇలా జరుగుతుంది.

స్వామి: అపశకునం.. జరిగింది.

Continues below advertisement

భూమి: ఎంతో పవిత్రంగా జరగాల్సిన పూజలో ఇలా కలశం అంటుకుంది. పర్వాలేదా..? స్వామిజీ గారు.

స్వామిజీ: లేదమ్మా కలశం తగలబడటం శుభసూచకం కాదు.

అపూర్వ: ప్రతి సమస్యకు ఏదో పరిష్కారం ఉంటుంది కదా..? ఇంతదూరం వచ్చాము కదా కాసేపు వెయిట్‌ చేద్దాం. ఏదైనా సొల్యూషన్‌ చూడండి.

మీరా: కాస్త అలస్యం అయినా పర్వాలేదండి.. మీరు ఎలాగైనా పూజ చేయించండి స్వామిజీ

స్వామిజీ: లేదమ్మా..? ఇప్పుడు ఈ సౌభాగ్య వ్రతం చేయకూడదు. అమ్మవారు ఇంకేదో సంకల్పించారు.

చెర్రి: అయితే ఇప్పుడు ఏం చేయమంటారు స్వామిజీ

స్వామిజీ: మంచి ముహూర్తం చూసుకుని మళ్లీ ఇంకొక రోజు పూజ పెట్టుకోవడం మంచిది.

కేపీ: స్వామిజీ ఇప్పుడు వ్రతం లేనట్టేగా ఇయితే నేను ఆఫీసుకు వెళ్తాను. అర్జెంట్‌ పని ఉంది.

మీరా: మీరు వెళ్లొద్దు నేను ఒప్పుకోను..

నక్షత్ర: ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇప్పుడు ఇలా అంటే ఎలా..?

మీరా: కాలింది కళశమే కదా వేరే కలశం పెడదాము..

స్వామిజీ: దైవ కార్యంలో అగ్ని ఇలా నియంత్రణ తప్పి వచ్చిందంటే అది హెచ్చరిక. శుభం కాదమ్మ.

భూమి: అత్తయ్య స్వామిజీ చెప్తున్నారు కదా..? మళ్లీ మంచి ముహూర్తం పెడతారంట. అప్పుడు చేసుకుందాం. ఇప్పుడు తొందర పడకండి.

కేపీ: మీరా నాకు ఎందుకో మనఃసాక్షి ఒప్పుకోవడం లేదు. స్వామిజీ చెప్తున్నారు కదా ఇప్పుడు వ్రతం చేయడం మంచిది కాదని.. పైగా ఆఫీసులో నాకోసం వెయిట్‌ చేస్తున్నారు. అందుకని నేను ఆఫీసుకు వెళ్తాను వస్తాను.

అపూర్వ: కేపీ ఎంత ముఖ్యమైన పని అయినా బావ చూసుకుంటాను అన్నారు కదా..? నువ్వెందుకు కంగారు పడుతున్నావు..

కేపీ: అపూర్వ గారు నాకోసం చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. అందుకే వెళ్తున్నాను.

మీరా: అసలు ఈ పూజ జరగకూడదని మీరు గట్టిగా కోరుకున్నట్టు ఉన్నారు. ముందును ఇలాగే ఉన్నారు.

చెర్రి: అమ్మా పూజ జరగకూడదని నాన్న ఎలా అనుకుంటారు. ఏంటమ్మా..?

భూమి: అత్తయ్యా ఇంకో రోజు చేద్దాము.. కచ్చితంగా నీ పూజ జరుగుతుంది.

అపూర్వ: సరే మీరా వదిలేయ్‌..

మీరా: సరే వదిన మీరు చెప్తున్నారు కాబట్టి ఊరుకుంటున్నాను.

భూమి: అయ్యో మామయ్య మీరేదో ముఖ్యమైన పని అంటున్నారు కదా ఇంకా వెళ్లలేదు ఏంటి..? వెళ్లండి..

కేపీ: ఆ వస్తాను.. అయ్యో మీరా నువ్వేం బాధపడకు ఈ సౌభాగ్య వ్రతాన్ని ఇంకోరోజు పూర్తిగా చేద్దాం.. అప్పుడు మొత్తం పూర్తయ్యే వరకు నేను ఉంటాను. బాధపడకే.. వస్తాను.

అంటూ కేపీ అక్కడి న ఉంచి వెళ్లిపోతాడు.

మీరా: దీనికి పరిహారం ఏం చేయాలి స్వామిజీ..

స్వామిజీ: గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలమ్మా..

మీరా: అలాగే చేస్తాను స్వామిజీ

భూమి: ( మనసులో) ఈలోపు అక్కడ పూజ అయిపోతుంది. అప్పటి వరకు వాళ్లను వీళ్లు చూడకుండా ఉంటే అంతే చాలు.

అపూర్వ: మీరా సరే నువ్వు చేస్తూ ఉండు.. మేము బయలుదేరుతాము.. నువ్వు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయ్‌

అంటూ అపూర్వ, నక్షత్ర అక్కడి నుంచి వెళ్లిపోతారు. చెర్రి, మీరాతో ప్రదక్షిణలు చేయిస్తానని చెప్తాడు. మరోవైపు కేపీ కోసం శారద ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతసేపు అయినా ఇంకా రాలేదేంటని అనుకుంటుంది. ఇక వస్తారో రారో అనుకుంటుండగా.. భూమి ఫోన్‌ చేసి కేపీ బయలుదేరారని చెప్తుంది. ఇదే గుడిలో మీరా కూడా పూజ పెట్టుకుందని చెప్పగానే.. శారద షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!