Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, రణవీర్‌ను తీసుకుని మ్యారేజ్ ఆఫీసుకు వెళ్లి అక్కడ మనోహరి గురించి ఆరా తీస్తుంటాడు. పెళ్లి జరిగిన నాటి డ్యాక్యుమెంట్స్ వెతుకుతుంటాడు. ఇంతలో మనోహరి రణవీర్‌కు ఫోన్ చేస్తుంది. రణవీర్ తన ఫ్రెండుతో మాట్లాడినట్టు మాట్లాడతాడు.
రణవీర్: చెప్పరా..?
మనోహరి: ఎక్కడున్నారు..? అమర్ ను ఆఫీసుకు వెళ్లకుండా ఆపమని చెప్పాను ఆపావా..?
రణవీర్: చెప్పా కదరా..? నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వస్తే.. ఆఫీసు వరకు వెళ్తానని.. ఇప్పుడే ఇక్కడికి వచ్చాము
మనోహరి: ఆఫీసులో ఉన్నారా..? ఫ్లీజ్ రణవీర్ ఏదో ఒకటి చేసి అమర్ ఆ నిజం తెలుసుకోకుండా చేయ్
రణవీర్: ఏంట్రా ఎన్ని సార్లు చెప్పాలి.. నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. అలా అని నువ్వు అన్నింటికీ నా మీదే ఆధారపడితే ఎలా చెప్పు
మనోహరి: ఫ్లీజ్ రణవీర్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయ్.. నాకు నీకు పెళ్లి జరిగిపోయిందని అమర్‌కు తెలిస్తే. ఇక అమర్ నన్ను ఎప్పటికీ నమ్మడు
రణవీర్: నీ ప్రాబ్లమ్ నాకు అర్థం అవుతుందిరా కానీ నేను ఇప్పుడు ఏమీ చేయలేను.. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను.. నన్ను డైవర్ట్ చేయకు.. అర్థమైందా..? నన్ను డైవర్ట్ చేయకు బై
అని ఫోన్ కట్ చేస్తాడు రణవీర్. మనోహరి అమర్‌ను ఎలాగైనా డైవర్ట్ చేయాలని ఆలోచిస్తుంది. కిటికీలోంచి చూడగానే భాగీ కనిపిస్తుంది. దీంతో భాగీ నా ప్రేమ కోసం నువ్వు ప్రాణ త్యాగం చేయాలి ఫ్లీజ్ అని మనసులో అనుకుంటుంది. ఆఫీసులో డ్యాక్యుమెంట్స్ దొరక్కుండా చేస్తాడు రణవీర్.
రాథోడ్: ఇంతదూరం వచ్చినా కూడా ఒక్క ఆధారం దొరకలేదు అంతా వృథా అయింది కదా సార్
అమర్: సామూహిక వివాహాలు జరిగినప్పుడు వీడియో తీస్తారు కదా.. అది ఉందా..?
వ్యక్తి: ఉంది సార్..
అమర్: అది ఒకసారి ప్లే చేస్తారా..?
వ్యక్తి: చేస్తాను సార్ కూర్చోండి..
అతను సిస్టం ఓపెన్ చేసి వీడియో ప్లే చేస్తాడు. వరుసగా పెళ్లి వీడియో వస్తుంటుది.
లాయరు: రణవీర్ మీ పెళ్లి వీడియో వచ్చేస్తుంది. ఈలోపు ఏదో ఒకటి చేయ్
రణవీర్: ఏం చేసినా.. అమర్‌కు అనుమానం వచ్చేస్తుంది. మనోహరే ఏదో ఒకటి చేయాలి.
అనగానే హైదరాబాద్‌లో మనోహరి మెట్ల మీద ఆయిల్ వేస్తుంది. అక్కడికి వచ్చిన భాగీ కింద పడుతుంది. గార్డెన్‌లో ఉన్న యముడి పాశం ఇంట్లోకి వెళ్తుంది. యముడు, గుప్త, చిత్రగుప్త షాక్ అవుతారు. భాగీ సౌండ్‌కు అనామిక పైకి పరుగెత్తుకుని వెళ్తుంది. కోల్‌కతాలో ఉన్న అమర్‌కు నిర్మల ఫోన్ చేస్తుంది.
అమర్: అమ్మ ఎందుకు కంగారు పడుతున్నావు.. ఏమైంది అమ్మా.. హలో నాన్నా ఏమైంది..? అవునా..? ఎప్పుడు జరిగింది..? (రణవీర్ సిస్టమ్‌ను పక్కకు తిస్పేస్తాడు.) ఇప్పుడు ఎలా ఉంది. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము.. రాథోడ్ మనం వెంటనే ఇంటికి వెళ్లాలి టికెట్స్ బుక్ చేయ్
రణవీర్: ఏమైంది అమరేంద్ర గారు ఏం జరిగింది
అమర్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రణవీర్ హ్యపీగా ఫీలవుతాడు. మనోహరికి ఫోన్ చేసి అమర్ ను భలే డైవర్ట్ చేశావని మెచ్చుకుంటాడు. హైదరాబాద్‌లో భాగీకి ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్తారు. వినోద్ హాల్లో కూర్చుని ఉండగా.. నిర్మల, శివరాం వస్తారు.
నిర్మల: ఒరే నాన్నా ఇంట్లో పెద్ద ప్రమాదం జరిగింది
వినోద్: అవునా పిల్లలు ఎక్కడ..? అన్నయ్యకు ఏం కాలేదు కదా..?
నిర్మల: అందరూ బాగానే ఉన్నారు నాన్నా..? మీ వదినే కాలు జారి పడిపోయింది.
శివరాం: ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా వెళ్లి వదినతో మాట్లాడిరా..?
వినోద్: తర్వాత మాట్లాడతానులే నాన్నా
నిర్మల: అసలు భాగీ ఏం చేసిందనిరా అంత కోపంగా ఉన్నావు
వినోద్: అన్నయ్యను మోసం చేసి పెళ్లి చేసుకుంది. వదిన స్థానాన్ని తీసేసుకుంది. కొన్ని రోజులు ఉంటే వదినను అన్నయ్య మర్చిపోయేలా చేసి పిల్లలను అన్నయ్యకు దూరం చేస్తుంది. ఇదే కదా ఆవిడ ప్లాను
అమర్: ఓరేయ్ వినోద్..
అంటూ కోపంగా వినోద్‌ను కొట్టడానికి వెళ్తాడు. నిర్మల, శివరాం అడ్డు పడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!