Brahmamudi Serial Today Episode: కావ్యను ఇంప్రెస్ చేయడానికి రాజ్ వివిధ రకాలుగా డ్రెస్ మార్చుకుంటుంటే అప్పుడే అపర్ణ ఫోన్ చేస్తుంది. రేపటి గురించి ఏమైనా ఆలోచించావా అని అడుగుతుంది. సూపర్ డ్రెస్ తో వస్తానని రాజ్ చెప్పగానే.. అపర్ణ కోప్పడుతుంది.
అపర్ణ: నేను అడిగింది డ్రెస్ గురించి కాదు.. నీ ఐడియా గురించి.. ఎందుకంటే కళావతి మనసును నువ్వు ఎప్పుడో గెలుచుకున్నావు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు తన మనసులో ఉన్న మాటను బయటకు తీసుకురావాలి. అంటే తనకు సంబధించింది ఏదైనా నువ్వు ట్రై చేయాలి కదా..!
రాజ్: అవును కదా ఆ విషయమే మర్చిపోయాను అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు..?
అపర్ణ: ఖర్మ ఇది కూడా నేనే చెప్పాలా..? ఆడదాని మనసు గెలుచుకోవాలి అంటే ఏ పువ్వో, చీరో గిఫ్టుగా ఇవ్వాలి. అప్పుడు సంతోషపడుతుంది
రాజ్: అర్థమైంది అమ్మా.. ఇక చూడండి ఎలా రెచ్చిపోతానో.. రేపు తనకు ఇష్టమైన గిఫ్టు పట్టుకొస్తా.. తన మనసు గెలుచుకుంటాను. తన మనసులో మాటలను బయటకు తీసుకొస్తాను..
అపర్ణ: అది చేస్తాను ఇది చేస్తాను అని కోతలు కోయడం కాదు. రేపు అది నిజం కూడా చేయాలి
రాజ్: నేను హనుమంతుడి టైపు అమ్మా.. నా శక్తి నాకు తెలియదు.. ఇలా నువ్వు పక్కన ఉండి ఎంకరేజ్ చేస్తా ఉండు.. ఇక నేను ఏంటో కళావతికి అర్థం అయ్యేలా చేస్తాను.. అయినా రేపు మీరే చూస్తారు కదా..?
ఫోన్ కట్ చేస్తాడు.
అపర్ణ: వీడు గతం మర్చిపోయాక నా మాట వింటున్నాడు. ముందే నా మాట విని ఉంటే ఈ పాటికి నాకు మనవడో మనవరాలో పుట్టేవాళ్లు..
అనుకుంటుంది. కళ్యాణ్, అప్పు విషయంలో ధాన్యలక్ష్మీ వెళ్లి ప్రకాష్‌ను తిడుతుంది. ప్రకాష్ కూడా ధాన్యలక్ష్మీని తిడతాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు రాజ్ ఎవరికో ఫోన్ చేసి రెడ్ రోజ్ బొకే ఆర్డర్ చేస్తుంటాడు. ఇంతలో యామిని వస్తుంది.
యామిని: ఏంటి బావా ఏదైనా పార్టీకి వెళ్తున్నావా..?
రాజ్: లేదే ఎందుకు అలా అడిగావు
యామిని: ఇంత స్టైల్‌గా రెడీ అయి ఉంటే డౌటు వచ్చింది
రాజ్: స్టైల్ గా ఉంది కదా అందుకే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను
యామిని: అదే ఎందుకు అని అడుగుతున్నాను… ఆ నా గుర్తుకు వచ్చింది బావ రేపు మనం ఇద్దరం వెళ్లి మన రిలేటివ్స్ కు మన పెళ్లి పత్రికలు ఇవ్వాలనుకున్నాం కదా అందుకోసం ఇలా రెడీ అయి ట్రై చేస్తున్నావు కదా..?
రాజ్: ట్రై చేయడం నిజమే కానీ నువ్వు అనుకుంటున్నట్టు మన రిలేటివ్స్ దగ్గరకు వెళ్లడానికి కాదు. నాకు వేరే మీటింగ్ ఉంది.
యామిని: మీటింగా..?
రాజ్: మీటింగ్ అంటే ఆఫీసుకు వెళ్లి స్టాఫ్ ను కలవడం కాదు.. నేను వేరే ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవాలి
యామిని: సరే బావ రేపు మనం వస్తున్నామని మన రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను.
రాజ్: సారీ యామిని రేపు నీతో టైం అసలు స్పెండ్ చేయలేను
అని చెప్పి వెళ్లిపోతాడు. మరవైపు కళ్యాణ్, అప్పుకు భోజనం తీసుకెళ్లి తినిపిస్తాడు. దీంతో అప్పు సారీ చెప్తుంది. ఇంత ఓపిక నీకెలా వచ్చిందని ఎమోషనల్ అవుతుంది. మా వాళ్లే నన్ను భరించలేకపోయారు. నువ్వెలా భరిస్తున్నావని బాధపడుతుంది. మరోవైపు రుద్రాణికి యామిని ఫోన్ చేసి కావ్య ఏం ప్లాన్ చేస్తుందని అడుగుతుంది. ఈసారి ప్లాన్ చేసింది కావ్య కాదని మా వదిన అని చెప్తుంది రుద్రాణి. అయితే రేపు రాజ్ ఇంటికొచ్చే సమయానికి కావ్య ఇంట్లో లేకుండా చేస్తానని తన ప్లాన్ చెప్తుంది రుద్రాణి. మరుసటి రోజు అప్పు ఆఫీసుకు వెళ్తుంటే.. ధాన్యలక్ష్మీ కోపంగా వచ్చి ఏయ్ ఆగు అంటూ తిడుతుంది. ఆప్పు షాకింగ్ గా ఆగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!