Nindu Noorella Saavasam Serial Today Episode: గతం మర్చిపోయిన అమర్‌తో రాథోడ్‌ వెళ్లి మాట్లాడితేనే మంచిదని భాగీ చెప్పగానే.. రాథోడ్‌ అమర్‌ దగ్గరకు వెళ్లబోతుంటే.. అప్పుడే మనోహరి అమర్‌ను తీసుకుని కిందకు రావడంతో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ చాలా ఇట్రెస్టింగ్‌ గా జరిగింది.

మనోహరి: యాదమ్మ నేను అమర్‌ లాన్‌లో కూర్చుంటాము వెళ్లి ఒక మంచి కాఫీ తీసుకురా

అమర్‌: యాదమ్మా..? ఎవరు యాదమ్మ…?

మనోహరి: అయ్యో చెప్పడం మర్చిపోయాను  తను యాదమ్మ.. ఇంట్లో పని మనిషి నువ్వు వెళ్లు యాదమ్మ

అమర్‌: వీళ్లెవరు..? ఇక్కడ ఎందుకు ఉన్నారు

అంటూ భాగీ, పిల్లల గురించి అడగ్గానే.. పిల్లలు, భాగీ ఎమోషనల్ అవుతుంటారు.

మనోహరి: తర్వాత అన్ని చెప్తాను అమర్‌. ఇక నుంచి నీకు అన్ని నేనే అంతా నేను చూసుకుంటాను పద వెళ్దాం

ఇద్దరు బయటకు వెళ్లి లాన్‌లో కూర్చుంటారు. రాథోడ్‌ బయటకు వెళ్లబోతుంటే.. భాగీ ఆసేస్తుంది.

భాగీ: ఆగు రాథోడ్‌ ఇప్పుడు ఏం మాట్లాడినా ఆయన కన్ఫీజ్‌ అవుతారు. డిస్టర్బ్‌ అవుతారు. నువ్వు అన్నట్టు మనం కొంచెం లేటు అయ్యాం. అయినా పర్వాలేదు. ఆయన రికవరీ అవ్వడం ముఖ్యం

రాథోడ్‌: సార్‌ పరిస్థితి అడ్డం పెట్టుకుని మనోహరి ఓవర్‌ చేస్తుంది మిస్సమ్మ. కావాలనే మనకంటే ముందుగానే వెళ్లింది

భాగీ: తను ఎదురుచూడని అవకాశం దొరికింది కదా..? ఎందుకు వదిలిపెడుతుంది రాథోడ్‌

యాదమ్మ లాన్‌లోకి కాఫీ తీసుకెళ్తుంది. పిల్లలు, భాగీ, రాథోడ్‌ కూడా బయట గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంటారు.

మనోహరి: అమర్‌ ఈ లాన్‌లో గార్డెన్‌ అంతా మనం పెంచిందే.. చాలా అందంగా ఉంది కదా..?

అమర్‌: మనమా..? నాకేం గుర్తు రావడం లేదు.  

మనోహరి: అవును నువ్వు నేను కలిసి పెంచాం

అమర్‌: అవునా..? నాకేవీ గుర్తు రావడం లేదు

మనోహరి: డోంట్ వర్రీ అమర్‌.. నీకు అన్ని నేను గుర్తు చేస్తాను కదా..? నువ్వు  రిలాక్స్‌ తీసుకో ( మనసులో ఒసేయ్‌ భాగీ నీ రేపటి బతుకు ఇదేనే.. ఇలా నేను అమర్‌ కలిసిపోతాం. మీరు దూరం అయిపోతారు. ఈరోజు మిమ్మల్ని ఇంటి గుమ్మం దాటించాను. రేపు ఇంటి గేటు దాటిస్తాను.)

రాథోడ్‌, భాగీ, పిల్లలు బాధగా లోపలికి వెళ్తారు.

అంజు: ఏంటి మిస్సమ్మ, మనోహరి ఆంటీ డాడ్‌ను తీసుకెళ్తుంటే.. నువ్వు చూస్తూ ఉండిపోయావు..

ఆనంద్‌: డాడ్‌ తో ఉండాల్సింది నువ్వు మిస్సమ్మ. డాడ్‌ పక్కన ఉండాల్సింది నువ్వు

అంజు: ఆ మనోహరి ఎవరు మిస్సమ్మ. సార్‌కు ఏమవుతుంది..?

బుజ్జమ్మ: సార్‌ ను ఇప్పుడు చూసుకోవాల్సింది మనమే కదమ్మా..? సార్‌ను బాగా చూసుకోవాలని డాక్టర్‌ అంకుల్‌ కూడా చెప్పారు కదా..? పదమ్మా వెళ్లి సార్‌తో మాట్లాడదాం

రాథోడ్‌: వద్దు బుజ్జమ్మ సార్‌ గతం మర్చిపోయారు. ఇప్పుడు సార్‌కు మనం ఎవరిమో గుర్తు లేదు. బలవంతంగా గుర్తు చేస్తే ప్రమాదం అని డాక్టర్‌ చెప్పారు కదా…

భాగీ: అందుకే నేను ఆగిపోయాను. మనోహరి మనకంటే ఒక అడుగు ముందుకేసి ఆయనకు దగ్గర అయింది

అంటూ అందరూ మాట్లాడుకుంటుంటే అప్పుడే మనోహరి వస్తుంది. అందరికీ వార్నింగ్‌ ఇస్తుంది. ఇక నుంచి నా దయాదాక్షిణ్యాలతో మీరు ఇంట్లో బతకాలి అంటూ చెప్పగానే.. ఆనంద్ అంతకర్మ మాకేం పట్టలేదు అంటీ అంటాడు. దీంతో మనోహరి కోపంగా కర్మపట్టకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్లి బతకాల్సి వస్తుంది అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!