Nindu Noorella Saavasam Serial Today March 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రణవీర్, మనోహరిని నిలదీసిన అమర్ – కాళీని పట్టిచ్చిన మంగళ
Nindu Noorella Saavasam Today Episode: మనోహరి, రణవీర్ వాళ్ల ఇంటికి వెళ్లిందన్న నిజం అమర్ తెలుసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి ఎలాగైనా అమర్ సీసీటీవీ పుటేజ్ చూడకుండా ఆడ్డుకోవాలని అలాగే అంజును చంపేయాలని డిసైడ్ అవుతుంది. అందరూ పడుకున్నాక అంజు రూంలోకి వెళ్తుంది. అంజు చూసి తనలో తాను మాట్లాడుకుంటుంది.
మను: సారీయే పొట్టి నువ్వెప్పుడు నాకు అనుకూలంగానే ఉన్నావు. కానీ ఉండకూడని ప్లేస్‌లో ఉండి చూడకూడదని నిజాలు చూసేశావు. నేను బతకాలంటే నువ్వు చావాలి. నువ్వేం టెన్షన్ పడకు ముందు నువ్వు వెళ్లు తర్వాత మీ అమ్మను పంపిచేస్తాను. ఇద్దరు ఎం చక్కా పైన కలిసుంటే కలదు సుఖం అని పాటలు పాడుకోండి.
అంటూ దిండు తీసుకుని అంజును చంపేయాలని చూస్తుంది. ఇంతలో భాగీ డోర్ ఓపెన్ చేసుకుని వస్తుంది. మనోహరి.. దిండు తీసి అంజు తల కింద పెడుతుంది.
భాగీ: ఏం చేస్తున్నావు మనోహరి.. అంజు దగ్గర ఏం చేస్తున్నావు.
మనోహరి: అది అంజు దగ్గర ఎవ్వరూ కనిపించలేదు
భాగీ: ఆ అందుకని ఏం చేయడానికి వచ్చావు
మనోహరి: ఏం చేయడానికి వస్తారు. పక్కనే ఉండి చూసుకుందామని వచ్చాను
భాగీ: అవునా..? అయితే నీ సేవలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేవు బయటకు వెళ్లు ఏంటి అలా చూస్తున్నావు. నిన్ను నమ్మి స్పృహలో లేని అంజును వదిలేస్తానని ఎలా అనుకున్నావు వెళ్లు.. ఇంకొక్కసారి ఇటు రాకు
మనోహరి: హెల్త్ బాగాలేని అంజును చూసుకోవడం రాదు కానీ నేను వచ్చి చూసుకుంటుంటే నన్ను అంటున్నావా..? నీ ఖర్మ
భాగీ: ఉన్నట్టుండి అంజు మీద మను ఇంత ప్రేమ చూపిస్తుందంటే.. నమ్మబుద్ది కావడం లేదు.. ఏదో ప్లాన్ చేసి వచ్చి ఉంటుంది
అని మనసులో అనుకుంటుంది భాగీ. రణవీర్ ఇంట్లో సీసీటీవీ పుటేజీ చూసిన అమర్ బయటకు వచ్చి రణవీర్ మాటలే గుర్తు చేసుకుంటుంటాడు.
రాథోడ్: రాథోడ్ ఏం ఆలోచిస్తున్నారు సార్..
అమర్: రణవీర్ మాటల్లో తడబాటు.. కళ్లల్లో కంగారు చూస్తుంటే ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది రాథోడ్. అదేంటో అర్థం కావడం లేదు. ఇందాక అడిగినప్పుడు మనోహరి అసలు ఇక్కడికి వచ్చింది అన్న విషయమే చెప్పలేదు. పైగా పుటేజీలో మనోహరి ఎంట్రీ ఉంది కానీ ఎగ్జిట్ లేదు. ఎందుకు అని అడిగితే రణవీర్ దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు. ఈ డాట్స్ ను ఎలా కరెక్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను
పక్కనే పడిపోయిన కాళీ ఫోన్‌కు మంగళ కాల్ చేస్తుంది. రాథెడ్ వెళ్లి ఫోన్ తీసుకొస్తాడు.
రాథోడ్: సార్ అక్కా అని కాలింగ్ వస్తుంది…?
అమర్: రాథోడ్ ఈ ఫోన్ తీసుకెళ్లి స్టేషన్‌లో కానిస్టేబుల్ కు ఇచ్చి ఎవరిదో కనుక్కోమని చెప్పు..
రాథోడ్: సార్ మళ్లీ అక్కా అని కాల్ వస్తుంది. ఎవరో ఎమర్జన్సీ ఉందేమో..?
అమర్: రాథోడ్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టి మాట్లాడు..
రాథోడ్: అలాగే సార్..
అని రాథోడ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే.. మంగళ మాట్లాడుతుంది. ఆమె మాటలు విని అమర్, రాథోడ్ షాక్ అవుతారు. ఫోన్ ఎవరు లిప్ట్ చేశారో కూడా తెలుసుకోకుండా మంగళ మాట్లాడుతుంది. దీంతో అమర్, మంగళ గారు అని పిలుస్తాడు. అమర్ వాయిస్ విన్న మంగళ షాక్ అవుతుంది. వెంటనే కాల్ కట్ చేస్తుంది. తర్వాత ఫోన్ ఓపెన్ చేసిన చూసిన అమర్ షాక్ అవుతాడు. ఆ ఫోన్ నుంచి స్టేషన్‌కు తీసుకెళ్లి హ్యాండోవర్ చేస్తారు. తర్వాత అమర్, రాథోడ్ ఇంటికి వస్తారు. రణవీర్, మనోహరిని ఇంటికి పిలిచిన అమర్ తనకు నిజం ఎందుకు చెప్పలేదని మనోహరిని ప్రశ్నిస్తాడు. నిన్న రాత్రి కాళీ లాస్ట్ గా నీతోనే ఫోన్ మాట్లాడాడు.. కాళీ నీకెందుకు ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడిన కాసేపటికి నువ్వు చాలాసార్లు కాళీకి తిరిగి ఫోన్ చేశావు ఎందుకు..? అని అమర్ అడగ్గానే.. మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!