Ammayi garu Serial Today Episode రోజుకో మలుపు తిరుగుతూ అమ్మాయి గారు సీరియల్ ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. మందారానికి గతం గుర్తొస్తే ప్రమాదమని విజయాంబిక కొడుకు కోడలికి విడాకులు ఇప్పించి ఫారిన్ చెక్కేయాలి అనుకుంటే రూప ఆ ప్లాన్ పసిగట్టి దీపక్‌కు మందారంతో బదులు మౌనికతో విడాకులు ఇప్పించేలా చేస్తుంది. ఈ తరుణంలో తాజా ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది.


"విజయాంబిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తుంది. అందరూ సూర్యప్రతాప్‌కి కాబోయే ఎమ్మెల్యే అని విజయాంబికకు జేజేలు కొడతారు. ఇక విజయాంబిక నామినేషన్ వేస్తుంది. ఎవరూ నామినేషన్ వేయడానికి రాకపోతే ఏకగ్రీవం ఖాయం అని చెప్తారు. నాకు పోటీ వచ్చే ధైర్యం ఎవరికీ లేదని విజయాంబిక అంటుంది. ఇంతలో రాజు విరూపాక్షికి జై అంటూ ఎంట్రీ ఇస్తారు. విజయాంబికకు పోటీగా విరూపాక్షి నామినేషన్‌ వేయడానికి రావడంతో ఇవాళ్టి ప్రోమో పూర్తయిపోతుంది. "



 


దీపక్, మౌనికలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేలా రూప, రాజులు చేస్తారు. ఇద్దరికీ విడాకులు ఇష్టమేనా అని జడ్జి అడుగుతారు. విడాకులు ఇస్తే ఆత్మ హత్య చేసుకుంటానని మౌనిక బెదిరిస్తుంది. అయితే దీపక్ విడాకులు ఇష్టమే అని చెప్తాడు. మౌనిక షాక్ అయి కోర్టులో నుంచి పారిపోతుంది. మౌనికని ఒప్పిస్తామని విజయాంబిక, దీపక్‌లు వెళ్తారు. ఇలా చేశావేంటి అని మౌనిక దీపక్‌ని అడిగితే రాజు గంటలో చనిపోతానని అందుకే అలా చెప్పానని అంటాడు.


దీపక్ అలా చెప్పడంతో మౌనిక షాక్ అయి ఏమైందని అడుగుతుంది. దాంతో దీపక్ స్వామీజీలా వచ్చింది రాజు అని తనకు రాజు కషాయం రూపంలో విషం ఇచ్చాడని చెప్తాడు. విరుగుడు ఇంట్లో ఉందని విడాకులు తీసుకోకపోతే విరుగుడు చెప్పను అని బెదిరించాడని చెప్తాడు. దాంతో మౌనిక కోర్టులోకి వెళ్లి విడాకులు ఇష్టమే అని చెప్తుంది. జడ్జి ఇద్దరికీ ఆరు నెలల టైం ఇస్తారు. తర్వాత దీపక్, విజయాంబిక, మౌనికలు పరుగున రూప, రాజుల దగ్గరకు వెళ్లి విరుగుడు అడిగితే ఇంటికెళ్లి మజ్జిగ తాగమని రాజు చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే చీప్ మందు తాగించానని దానికి మజ్జిగే విరుగుడు అని చెప్తాడు. అందరూ ఇంటికి వెళ్లిన తర్వాత పార్టీకి చెందిన కొంత మంది నాయకులు ఇంటికి వచ్చి ఈ సారి ఎమ్మెల్యే టికెట్ మహిళకు కేటాయించారు కదా రూపని రాజకీయాల్లోకి దించమని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేం గెలిపిస్తాం అని సీఎంతో చెప్తారు. దానికి సూర్య రూపకి ఇష్టం అయితే తనకు ఇష్టమే అంటాడు. రూప అవకాశం ఇచ్చినందుకు తండ్రికి థ్యాంక్స్ చెప్తుంది కానీ తనకు అనుభవం లేదని రాజకీయాలు వద్దని తప్పకుంటుంది. దాంతో విజయాంబిక అక్కడున్న మరో నేతకి సైగ చేయడంతో వాళ్లు విజయాంబిక పేరు చెప్తారు. రూప ఇలా అయిందేంటి అని అనుకుంటుంది. దీంతో ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి