Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలకి కాల నాగు కాటేస్తుంది. బాల ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నాడని గురువుగారు త్రిపురకు చెప్తారు. బాల శరీరంలో పాకిన విషానికి విరుగుడుగా ఉన్న ఒకే ఒక్క మార్గం నాగాంభరి పుష్పమని దాన్నీ తీసుకురావడం ప్రాణాలని చెలగాటం పెట్టడమే అని చెప్తారు. ఇక త్రిపుర ప్రాణాలకు సైతం లెక్కించకుండా బాల కోసం ఆ పుష్పాన్ని తీసుకొస్తానని చెప్తుంది. దాంతో గురువు గారు మార్గం చెప్తారు.


కారడవిలో ప్రయాణించి రెండు ప్రమాదకర నిలువు కొండలు దాటాలని తర్వాత నాగసాధువులు ఉంటారు వాళ్లు వెళ్లనివ్వరు అని వాళ్లు నుంచి ఒకవేళ తప్పించుకొని వెళ్లినా నాగాంభరి పుష్పం కోసం వెళ్తే అక్కడ నాగసర్పం కాపలా ఉంటుందని దాని నుంచి తప్పించుకొని తేవడం కష్టమని ఈ ప్రయాణం మానేస్తేనే మంచిదని గురువుగారు చెప్తారు. అయినా త్రిపుర వినకుండా నేను ఎలా అయినా వెళ్లి తీసుకొస్తానని చెప్తుంది. దాంతో గురువుగారు సూర్యస్తమయం అయ్యేలోపు తీసుకురావాలి అని త్రిపురకు మార్గం ఉన్న కాలపత్ర గ్రంధం ఇస్తారు. త్రిపుర మనసులో బాల నీ ఈ పరిస్థితికి కారణం నేను నేను నిన్ను కాపాడుకుంటానని బయల్దేరుతుంది. 


మరోవైపు గిరి రేపు తన పెళ్లి తెల్లారే లోపు వాడు చస్తాడు అని అనుకుంటాడు. వాడి జీవితం రేపు ముగిసి పోతే నా వైవాహిక జీవితం రేపటి నుంచి మొదలవుతుందని అనుకుంటాడు. ఇంతలో ఓ వైద్య శిబిరం దగ్గర కాపాలా ఉన్న ఓ మనిషి వచ్చి కాలసర్ప నాగు విరుగుడు తీసుకురావడానికి వదిన వెళ్లిందని చెప్తాడు. గిరి కోపంతో రగిలిపోతాడు. వాడిని కాపాడుతుందా అని అంటాడు. మరోవైపు త్రిపుర ఎండలో అడవిలో పరుగులు తీస్తుంది. నాగసాధువులు ఉన్న చోటుకు చేరుకుంటుంది. నాగసాధువులు త్రిపురని చూసి ఎంత ధైర్యం నీకు మా స్థానానికి వచ్చావు వెంటనే వెనక్కి వెళ్లిపో అంటారు. దాంతో త్రిపుర వాళ్లకి దండం పెట్టి నేను నాగాంభరి పుష్ఫం కోసం వచ్చాను నన్ను అక్కడికి తీసుకెళ్లండి అని బతిమాలుతుంది.


నాగసాధువులు వెళ్లిపోమని తమ నిగ్రహం చెడిపోతే నీకే ప్రమాదం అని చెప్తారు. మరోవైపు బాల శరీరంలో విషం ప్రభావం వల్ల కాళ్లు చేతులు నీలి రంగులోకి మారిపోతాయి. గురువుగారు చూసి విషప్రభావం పని చేయడం మొదలైందని అంటారు. నాగసాధువులు త్రిపురని వెళ్లిపోమని అంటే ఆ పుష్ఫం లేకుండా వెళ్లను అని అంటుంది. నాగసాధువుల్ని బతిమాలుతుంది. దాంతో నాగసాధువులు తన గురువు  గారికి మాత్రమే మార్గం తెలుసు అని ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే కనికరిస్తారని ధ్యానంలో ఉన్న ఆయన కనికరించాలి అంటే కఠిన దీక్షతో మండుటెండలో చెప్పులు లేకుండా దూరంగా ఉన్న కొలను నుంచి 108 కడవల నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేయాలని అంటారు.


త్రిపుర చేస్తాను అని కడవ తీసుకొని కొలనుకి వెళ్తుంది. అతి కష్టం మీద కడవతో నీళ్లు మోసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తుంది. దాంతో ఆ గురువుగారు కళ్లు తెరుస్తారు. అంతా దివ్యదృష్టితో చూసి ఓ ప్రాణాన్ని కాపాడాలి అన్న నీ సంకల్పానికి నాతో పాటు అందరూ కరుణించారని అందరూ త్రిపురకు సాయం చేయడానికి సిద్ధ పడతారు. ఇక త్రిపురకు మార్గాన్ని ఇస్తారు. నాగాంభరి పుష్ఫం నాగాంభరి వనంలో ఉంటుందని అక్కడ ఉన్నా ప్రతీ చెట్టు మొక్క కూడా సర్పాలే అని అక్కడున్న శివలింగం మీద శివభస్మంతో అభిషేకం చేస్తే నీకు నాగాంభరి పుష్పం దక్కుతుందని త్రిపురకు భస్మం ఇస్తారు. శివనాగ కాటు నుంచి తప్పించుకోవడానికి శివ మంత్రం త్రిపురకు చెప్పారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి