Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలు పెళ్లి చెడగొట్టడానికి లెటర్‌ రాసారని తెలుసుకుని మనోహరి కోప్పడుతుంది. ఇంతలో రూంలో రెడీ అవుతున్న అమర్‌ పిల్లలు రాసిన లెటర్‌ చూస్తాడు. ఏంటోనని తీసుకుని చదువుతాడు. మరోవైపు పిల్లలు మిస్సమ్మ దగ్గరకు వెళ్లి తాము లెటర్‌ రాసిన విషయం చెప్తారు. దీంతో మిస్సమ్మ ఎందుకు లెటర్‌ రాశారని ఈ విషయం తెలిస్తే మీ డాడీ ఎంత కొప్పడతాడో అని చెప్పగానే పిల్లలు మా డాడీ మమ్మల్ని  తిట్టినా, కొట్టినా సరే మేమైతే మా అభిప్రాయం చెప్పాము అంటారు. ఇంతలో అమర్‌ పిల్లలను కిందకు పిలుస్తాడు.


అమర్‌: ఎంటిది? అమ్ము మీతోనే మాట్లాడుతున్నాను. ఏంటిది? అసలు ఈ లెటర్‌ ఎవరు రాశారు.


మిస్సమ్మ: సార్‌ అది పిల్లలు ఏదో తెలియక..


అమర్‌: నువ్వాగు మిస్సమ్మ.. మీతోనే మాట్లాడుతున్నాను ఎవరు రాశారు.


అని అమర్ గట్టిగా అడిగే సరికి   పిల్లలు మేము అందరం కలిసే రాశామని మా మనసులో మాట మీకు చెప్పాలని రాశాము అనగానే మీరు ఏ విషయమైనా నాతో షేర్‌ చేసుకునే స్వేచ్చ ఉంది. ఇంత చిన్న విషయం నేను అర్థం చేసుకోలేనా? అనగానే పిల్లలు మా మీద మీకు కోపం లేదా డాడ్‌ అనగానే కోపం ఏంలేదని మీరు సమ్మర్‌ క్యాంపుకు ముందుగా వెళ్లాలని ఉందని చెప్తే నేను ఎందుకు వద్దంటాను అంటూ మీకు ఏమైనా కావాలంటే రాథోడ్‌ చూసుకుంటాడని చెప్పి అమర్‌ వెళ్లిపోతుంటే మిస్సమ్మ లెటర్‌ అడిగి తీసుకుని చదువుతుంది.


మిస్సమ్మ: హాయ్‌ డాడ్‌ మేం సమ్మర్‌ మొత్తం క్యాంపులోనే ఉండాలనుకుంటున్నాం. మాకు కూడా కొన్ని రోజులు మా ఫ్రెండ్స్‌ తో ఎంజాయ్‌ చేయాలని ఉంది. అందుకే మేము రేపే క్యాంపుకు వెళ్తున్నాం.


పిల్లలు: ఇది మేము రాసిన లెటర్‌ కాదు మిస్సమ్మ ఇది  ఎవరో రాసి అక్కడ పెట్టారు.


మనోహరి: ఎన్ని రోజులు అయినా ఇంకెన్ని రోజులులే పిల్లలు మీరు సమ్మర్‌ క్యాంపుకు వెళ్లిపోతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా?  


మిస్సమ్మ: ఏయ్‌ అసలు మనిషివేనా నువ్వు. తల్లిని పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న పిల్లలకి ఇప్పుడు తండ్రిని కూడా దూరం చేస్తున్నావా?


అంటూ మిస్సమ్మ తిడుతుంటే నువ్వు కాసేపు ఆగు అంటూ రాథోడ్‌ దగ్గరకు వెళ్లి నువ్వు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయే వాళ్లను నమ్ముకుంటే నువ్వు కూడా మధ్యలోనే వెళ్లిపోతావు. అంటూ వార్నింగ్ ఇవ్వడంతో రాథోడ్‌ వెళ్లిపోతాడు. తర్వాత మిస్సమ్మకు కూడా వార్నింగ్ ఇస్తుంది మనోహరి. మరోవైపు అరుంధతి కోపంగా గుప్తను తిడుతుంది. మనోహరి పిల్లలను క్యాంపుకు పంపుతుందని మీరు ఏదైనా చేయండని చెబితే ఎందుకు చేయడం లేదని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంటి బాల్కనీలోంచి అమర్‌ గమనిస్తాడు. అక్కడ ఎవ్వరూ లేరని ఎవరిని చూసి మాట్లాడుతున్నాడని అనుమానంగా కిందకు వస్తాడు. అమర్‌ రావడాన్ని చూసిన అరుంధతి గుప్తకు చెప్తుంది.


అరుంధతి: అయ్యో గుప్త గారు వెనక్కి చూడండి.


గుప్త: నేను చూడను.. చూడను గాక చూడను. ముందు నువ్వు నా అంగుళీకము ఇవ్వుము


అరుంధతి: గుప్త గారు మా ఆయన వస్తున్నారు చూడండి.


గుప్త: అయినను నీ పతిదేవుడు వచ్చినచో నాకెందుకు భయము.


అమర్‌: ఎవరితో మాట్లాడుతున్నావు. నీ ముందు ఎవరు లేరు కదా? ఇందాకట్నుంచి ఎవరితో మాట్లాడుతున్నావు.


అరుంధతి: టెన్షన్‌ పడకుండా ఏదో ఒకటి చెప్పి కవర్‌ చేయండి.


అనగానే గుప్త నేను మా బామ్మతో మాట్లాడుతున్నాను. అని చెప్పగానే ఇక్కడ ఎవరూ లేరు కదా అనగానే మనసుతో చూస్తే ఎవరైనా కనిపిస్తారని గుప్త చెప్పగానే అమర్‌ వెంటనే అక్కడే కూర్చుని కళ్లు మూసుకుని ఏకాగ్రతగా కళ్లు తెరిచి చూడగానే అరుంధతి కనిపిస్తుంది. దీంతో ఏడుస్తూ అరుంధతిని చూస్తుండిపోతాడు. ఇంతలో గుప్త మీకు ఆ బాలిక కనిపిస్తుందా అని అడగ్గానే అవునని చెప్పి లేచి వెళ్లిపోతాడు అమర్‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: పసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్